BigTV English

OTT Movie : బిచ్చగత్తె దగ్గర లక్షల్లో డబ్బు… ఐఎండిబి రేటింగ్ లో దుమ్మురేపిన ఆంథాలజీ మూవీ

OTT Movie : బిచ్చగత్తె దగ్గర లక్షల్లో డబ్బు… ఐఎండిబి రేటింగ్ లో దుమ్మురేపిన ఆంథాలజీ మూవీ

OTT Movie : శాండల్‌వుడ్ నటుడు, దర్శకుడు రాజ్ బి శెట్టి ఆంథాలజీ మూవీ రూపాంతర అకస్మాత్తుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎలాంటి ముందస్తు అప్డేట్ లేకుండానే సెప్టెంబర్ 13 నుంచి ఈ సినిమా సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతోంది. జూలై 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. థియేట్రికల్ గా విడుదలైన నెలన్నర తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాని ఎక్కడ చూడాలి? స్టోరీ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


స్టోరీ ఏంటంటే?
దర్శకుడు మిథిలేష్ ఆంథాలజీ ద్వారా నాలుగు కథలను ఒకే చోట చూపించారు. సమాజంలోని సమస్యలకు థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించి నాలుగు కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు దర్శకుడు. మొదటి కథలో అనుకోకుండా నగరానికి వలస వచ్చిన పల్లెటూరి వృద్ధ రైతు దంపతులు పడే కష్టాలను దర్శకుడు చూపించాడు. ఎన్నో కలలతో పచ్చని పల్లెటూరును వదిలేసి వచ్చిన ఆ జంట సిటీకి వచ్చాక ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అనేది ఇందులో ఫస్ట్ స్టోరీ లైన్.

రెండవ కథ విషయానికొస్తే.. ఒక పోలీసు అధికారి, ఒక కానిస్టేబుల్, బిచ్చగత్తె చుట్టూ తిరుగుతుంది కథ. బిచ్చగాడి వద్ద చాలా డబ్బును చూసి అతనిపై అనుమానం పెంచుకుంటారు పోలీసులు. ఆ బిచ్చగత్తెని ఇన్వెస్టిగేట్ చేశాక తెలుసుకున్న సత్యాలు ఇంట్రెస్టింగ్ గా, ఎమోషనల్ గా ఉంటాయి.


మూడవ స్టోరీ ఏంటంటే… ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన యువత జీవితంలో ఏమి కోల్పోయింది? ఆ చీకటి ప్రపంచం నుంచి ఎలా బయటపడ్డాడు అనేది మూడో కథ.

నాలుగవ స్టోరీలోకి వెళ్తే.. ఓ ఐటీ ఉద్యోగి స్థానిక రౌడీతో గొడవకు దిగుతాడు. ఈ వివాదం పరిణామాలు ఏమిటి? శత్రువులుగా ఉన్న వీరిద్దరూ ఎలా స్నేహితులుగా మారారనేది నాలుగో కథలో దర్శకుడు చూపించాడు. ఈ నాలుగు కథలను లింక్ చేస్తూ క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు.

Roopanthara Movie Review: Roopanthara review: A marvellous metamorphosis

ఏ ఓటీటీలో చూడవచ్చు ?

ఈ సినిమా సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 13 నుండి ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ కేవలం కన్నడలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఆంథాలజీ సినిమాకు సుహాన్ ప్రసాద్ నిర్మాత. మ్యాంగో పికిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జానీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ ఆంథాలజీ మూవీలో లేఖా నాయుడు, హనుమక్క, భరత్ జిబి, సోమశేఖర్ బోలేగావ్, అంజన్ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మిధున్ ముకుందన్ దీనికి సంగీతం అందించారు. ఈ రూపాంతర సినిమాకు IMDbలో మంచి రేటింగ్ వచ్చింది. దర్శకుడు మిథిలేష్ నాలుగు విభిన్న నేపథ్యాలలో నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లేతో ఆంథాలజీ చిత్రాన్ని తీసుకొచ్చారు. ఈ చిత్రానికి IMDbలో 8.5 రేటింగ్‌ వచ్చింది. ఈ సంవత్సరం కన్నడలో అత్యధిక IMDb రేటింగ్ పొందిన చిత్రంగా కూడా రూపాంతర పేరు తెచ్చుకుంది. భాష అడ్డు కాదు అనుకునే వారు ఈ మూవీపై ఓ లుక్కేయండి.

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×