Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 రోజుకు మనిషిలోని రోజుకొక కొత్త రంగును బయటపెడుతుంది. ఒక్కొక్కరిగా అందరూ దొరికిపోతున్నారు. ఇప్పటివరకు మర్యాద మనీష్ కన్నీళ్లు పెట్టుకోవడం చూడలేదు. ఎవరితోనైతే సంచాలక్ అయినప్పుడు గొడవపడ్డాడో, అదే ఇమ్మానియేల్ దగ్గర ఈరోజు కూర్చుని కన్నీళ్లు కార్చాడు. తన బాధలను చెప్పుకున్నాడు. బిగ్బాస్ ఇలాంటి ట్విస్టులు ఇవ్వడంతో షో మీద ఆసక్తి ఇంకా పెరుగుతుంది.
శ్రీజ దమ్ము, పవన్, ప్రియా శెట్టి, సంజన ల తోపాటు మనీష్ కూర్చున్నాడు. ఆ తరుణంలో శ్రీజకు మరియు మనీష్ కు మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. మనీష్ ఇమ్మానియేల్ దగ్గరికి వెళ్లి కన్నీళ్లు కార్చాడు. నాకు ఇక్కడ ఉండాలని లేదు, వీళ్లు నిజంగా గేమ్ ఆడటం లేదు. నీ రూమ్ లో బెడ్ కాళీ ఉంటే నేను అక్కడికి మూవ్ అవుతాను. నేను పొరపాటున అరుస్తానేమో భయమేస్తుంది. నేను బిగ్ బాస్ లో ఉంటాను నా గేమ్ నేను ఆడుతాను. వీళ్లు కామనర్స్ కాదు. సెల్ఫీస్ రూత్లెస్ ఇడియట్స్ అన్న అంటూ ఇమ్మానుయేల్ దగ్గర చెప్పాడు. ఇమ్మానుయేల్ అలా ఎప్పుడూ అనుకోకూడదు అంటూ మనీష్ కు సర్ది చెప్పాడు.
కామనర్స్ లో ఉన్న శ్రీజ దమ్ము (srija Dhammu), ప్రియ శెట్టి (Priya Shetty) కి అసలు రెస్పెక్ట్ లేదు. వాళ్లకు కెమెరా వస్తే అరవాలంతే. కెమెరా ఉంటే నోరు వాడేసుకోవాలి. నేను వాడేసుకోలేనా, కామనర్స్ అనేదానికి వీరు ఒక గలీజ్ మార్క్. ఎవరైనా రెస్పెక్ట్ వెయ్యాలన్న. వీళ్లు వరస్ట్ కామనర్స్. జెన్యూన్ గా ఉంటారనే బిగ్ బాస్ కామనర్స్ కి అవకాశం ఇచ్చారు. వీళ్ళు ఫేక్ అని తెలిసిపోతుంది. అంటూ ఇమ్మానియేల్ తో మాట్లాడాడు మనీష్. వీళ్లు టెరిబుల్లీ ఫేక్ పీపుల్ అంటూ తెలిపాడు.
Also Read : Bigg Boss 9 Promo : నామినేషన్స్ యాక్షన్… రెండో వారంలోనే ఇంతలా కొట్టుకుంటున్నారేంటి ?