Bigg Boss 9:బిగ్ బాస్ (Bigg Boss) .. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరు సొంతం చేసుకున్న ఈ షో తెలుగులో 9వ సీజన్ ఘనంగా ప్రారంభం అయ్యింది. “చదరంగం కాదు రణరంగం” అంటూ హోస్ట్ నాగార్జున (Nagarjuna) సీమన్ పై అంచనాలు పెంచేశారు. ముఖ్యంగా 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా.. మరొకవైపు 9 మంది సెలబ్రిటీలు హౌస్ లో సందడి చేస్తున్నారు. కామనర్స్ ని ఓనర్స్ గా ప్రకటించిన బిగ్ బాస్.. సెలబ్రిటీస్ ను టెనెంట్స్ గా డివైడ్ చేశారు. హౌస్ ఓనర్ గా గుర్తింపు సొంతం చేసుకోవాలి అంటే కచ్చితంగా టాస్క్ లు నెగ్గాల్సి ఉంటుంది. వారికి హౌస్ లోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. అలా మొదటి వారం కంటెస్టెంట్స్ చేత వ్యతిరేకత ఎదుర్కొని.. సత్తా చాటుతూ మొదటి హౌస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టింది సంజన గల్రానీ.
మొదటివారమే ఎలిమినేషన్..
ఇకపోతే మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియ దిగ్విజయంగా పూర్తయింది. అందులో భాగంగానే టాప్ కంటెస్టెంట్ గా ఉంటుందనుకున్న శ్రష్టి వర్మ (Shrasti Varma).. మొదటి వారమే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. కారణం ఈమె హౌస్ లోకి వెళ్లిన రోజు నుంచి పెద్దగా కెమెరాల్లో ఫోకస్ కాలేదు. ఆడియన్స్ కూడా ఈమెకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. దీంతో రిజెక్ట్ చేశారు. ఇకపోతే ఈమె ఎలిమినేషన్ తో జానీ మాస్టర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేసినా.. పలువురు నిరాశ వ్యక్తం చేశారు. తన నటనతో, ఆటతో, పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తుందని అనుకున్న వారికి నిరాశ మిగిలింది. అయితే ఇక్కడ ఆశ్చర్యపోయే మరో విషయం ఏమిటంటే శ్రష్టి వర్మ చెప్పినట్టుగానే.. తొందరగా హౌస్ లో నుంచి బయటకు వచ్చేసిందని, పలువురు కామెంట్లు చేస్తున్నారు..
నాగార్జున మూవీకి కొరియోగ్రఫీగా మారనున్న శ్రష్టి వర్మ..
అసలు విషయంలోకి వెళ్తే.. సెప్టెంబర్ 7న ఈ షో చాలా ఘనంగా ప్రారంభమైంది. ఆరోజు హౌస్ లోకి వెళ్లే ముందు శ్రష్టి వర్మ త్వరగానే బయటకు వస్తాను అని చెప్పింది. ముఖ్యంగా ఓపెనింగ్ రోజు త్వరగా బయటకు వచ్చి తనకు సాంగ్ కొరియోగ్రఫీ చేయాలని నాగార్జున అనగా.. అటు శ్రష్టి వర్మ కూడా ఓకే చెప్పేసింది. ఇక అన్నట్టుగానే వారం రోజుల్లోనే ఆమె బయటకు రావడం గమనార్హం.. మరి నాగార్జునకు ఇచ్చిన మాట మేరకు ఆయన 100వ సినిమాలో పాటకు ఈమె కొరియోగ్రఫీ అందిస్తుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.
ALSO READ:Film industry: 7 సార్లు గర్భస్రావం.. నరకం చూపించారంటూ హీరోయిన్ ఆవేదన
హౌస్ లో వారి ముసుగులు తీసేసిన సృష్టి వర్మ..
ఇకపోతే ఎలిమినేషన్స్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు బెస్ట్, జెన్యూన్ పర్సన్స్ ఎవరు? ఫేక్, డబుల్ ఫేస్ ఎవరు? అనే విషయాన్ని తెలిపింది. రాము రాథోడ్ లో ఫిల్టర్ ఉండదని జెన్యూన్ పర్సన్ అని తెలిపిన ఈయన.. మర్యాద మనీష్ చాలా స్వీట్ పర్సన్ అని అందరికీ హెల్ప్ చేస్తారని తెలిపింది. అలాగే హరీష్ కూడా జెన్యూన్ గా ఉంటారని, ఫ్లోరా షైనీ ది స్వీట్ సోల్ అంటూ తెలిపింది. మొత్తానికి అయితే ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. భరణి, రీతూ చౌదరి, తనూజా డబుల్ ఫేస్ అంటూ చెప్పుకొచ్చింది.