Bigg Boss 9 Promo : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ ఆడియన్స్ను విపరీతంగా ఎంగేజ్ చేస్తున్నారు. మొత్తానికి మొదటివారం పూర్తయిపోయింది. మొదటి వారంలో శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయారు. పెద్దగా తాను గేమ్ ఆడక పోవడం వలన, అందరితో ఈజీగా కలవకపోవడం వల్ల. అలానే ఆడియన్స్ నుంచి కూడా ఊహించిన సపోర్ట్ రాకపోవడం వలన తాను ఎక్కువ కాలం హౌస్ లో ఉండలేకపోయారు.
ఇక మొత్తానికి రెండవ వారం మొదలైపోయింది. ఇక రీసెంట్ గా ప్రోమో కూడా విడుదలైంది. ఈ ప్రోమో చూస్తుంటే ట్విస్ట్ మీద ట్విస్టులు ఆడియన్స్ కి తగులుతున్నాయి. పూర్తిస్థాయిలో హౌస్ మేట్స్ రంగులు బయటపడుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఈరోజు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో హరీష్, మనీష్, ఎప్పటిలాగానే సంజన , ప్రియశెట్టి వీళ్లంతా హైలెట్ గా నిలిచారు.
బిగ్ బాస్ షో కామనర్స్ కి మరియు సెలబ్రిటీస్ కి మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ షో కు సంబంధించి కామనర్స్ ఒక్కోరకంగా థింక్ చేస్తున్నారు. గతంలో హరీష్ మాట్లాడుతూ కామనర్స్ అంతా కూడా సెలబ్రిటీలను చూడగానే సొల్లు కార్చేస్తున్నారు అంటూ కామెంట్ చేశాడు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో మనీష్ ఏడుస్తూ. వరస్ట్ కామనర్స్ అంటూ ఇమ్మానుయేల్ తో చెబుతున్నాడు. ఇమ్మానుయేల్ హరీష్ ను ఓదార్చాడు.
Also Read: Bigg Boss 9 : ఇట్స్ అఫీషియల్, జానీ మాస్టర్ అసిస్టెంట్ ఎలిమినేటెడ్, ఈ ఎపిసోడ్ హైలైట్స్ ఇవే
కామనర్స్ అంతా కూర్చొని ఒకచోట మీటింగ్ పెట్టారు. దానిలో శ్రీజ దమ్ము మనీష్ ను ఉద్దేశిస్తూ కార్నర్ కెళ్ళి ఏడుస్తూ కూర్చో అంటూ కామెంట్ చేశాను. అలానే ప్రియా శెట్టి కూడా ఫైర్ అయింది. మరోవైపు హరీష్ రాము రాథోడ్ తో మాట్లాడుతూ.. మనుషులు రెండు రకాలు ఉంటారు. ఒకళ్ళు మంచోళ్ళు, మరొకరు మంచోళ్ళ నటించిన వాళ్లు అంటూ భరణిని ఉద్దేశిస్తూ చెప్పాడు. విడుదలైన ప్రోమో చూస్తుంటే ఈరోజు కూడా అదిరిపోయే ఎపిసోడ్ లోడింగ్ అని అర్థం అయిపోతుంది.