Bigg Boss 9 : ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుంది అనుకున్న బిగ్ బాస్ సీజన్ 9 మొదలైపోయింది. మొత్తానికి ఒక వారం రోజులు కంప్లీట్ కూడా అయిపోయింది. ఇంతకుముందు సీజన్స్ కంటే కూడా ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది అని చెప్పాలి. అయితే అందరూ ఊహించిన విధంగానే ట్విస్టులు మీద ట్విస్టులతో ఈ షో ముందుకు కొనసాగింది.
ఈ షోలో ఆసక్తికరమైన కంటెస్టెంట్ శ్రేష్టి వర్మ. శ్రేష్టి వర్మ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఢీ షో తో విపరీతమైన గుర్తింపు సాధించుకుంది. అయితే కొరియోగ్రాఫర్ గా కూడా తను కొన్ని సినిమాలు చేసింది. పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాలో కూడా తను ఇన్వాల్వ్ అయింది. వీటన్నిటిని మించి జానీ మాస్టర్ పైన తను చేసిన ఆరోపణలతో ఇంకా ఫేమస్ అయిపోయింది. అయితే ఆ ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియదు.
గత కొన్ని రోజులుగా సృష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయినట్లు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అది వాస్తవానికి నిజంగానే జరిగిపోయింది. మొదటి వారంలోని శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అయిపోయిన కూడా శ్రేష్టి వర్మ కాన్ఫిడెన్స్ ని మెచ్చుకోవాలి. నేను దేనికైనా రెడీ సర్ అని కింగ్ నాగార్జునతో అనడం కొంతమేరకు పాజిటివ్ మైండ్ సెట్ ను తెలియజేస్తుంది.
అన్నిటిని మించి బిగ్ బాస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి తను కంపోజ్ చేసిన హుక్ స్టెప్ బాగా పాపులర్ అయింది. ఇక శ్రేష్ఠి వర్మ ఎలిమినేట్ అయిన సందర్భంగా తన హైలెట్ మూమెంట్స్ అన్నిటిని కూడా ఎడిట్ చేసి ప్లే చేశారు బిగ్ బాస్. ఎడిట్ మాత్రం చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. క్యూట్ క్యూట్ మూమెంట్స్ అన్నిటిని కూడా ఒక చోట జత చేసి షార్ట్ అండ్ స్వీట్ గా ప్రజెంట్ చేశారు.
శ్రేష్టి వర్మ వర్మ వెళ్ళిపోయే ముందు హౌస్ లో జెన్యూన్ గా ఉన్న వాళ్ల గురించి చెప్పింది. ముందుగా రాము రాథోడ్ గురించి మాట్లాడింది. ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా చాలా జెన్యూన్ గా ఉంటారు అని చెప్పింది. అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ గురించి ఎటువంటి తప్పుడు ఉద్దేశం తనకు లేదు అని తెలిపింది. మాస్క్ మెన్ హరీష్ జన్యూన్ పర్సన్, ఫ్లోరా ఈవిడ చాలా జెన్యూన్ పర్సన్. వీళ్లు నాకు ఫేవరెట్.
రీతు వర్మ కెమెరా ముందు ఒకలా మాట్లాడుతుంది కెమెరా వెనకాల ఒకలాగా ఉంటుంది. మనతో మాట్లాడుతున్నప్పుడు ఒకరకంగా ఉంటుంది. ఇంకో టైంలో వేరేలా ఉంటుంది. తనుజ కూడా సేమ్. నమ్మకం తనుజాతో నాకు బ్రేక్ అయిపోయింది. అది గుడ్డు విషయంలోనే. సంజన మేడం స్వీట్. లైఫ్ లో ఒకసారి నమ్మకం పోతే మళ్ళీ తిరిగి రాదు. భరణి గారి మీద నమ్మకం పోయింది. ఐ యాం సారీ అన్న అంటూ ఎమోషనల్ అయిపోయింది.
స్రవంతి సీరియల్ తో ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు భరణి. అంతేకాకుండా మెగా బ్రదర్ కి ఇతను బాగా ఫ్రెండ్. ఒక టాస్క్ తర్వాత ఇతనికి హౌస్ ఓనర్ గా ప్రమోషన్ వచ్చింది. మొత్తానికి కొన్ని నవ్వులు, సృష్టి వర్మ కన్నీరుతో ఈ ఎపిసోడ్ పూర్తి అయింది.
కొన్ని సినిమాలకు సంబంధించిన గెస్ట్లు బిగ్ బాస్ షో కి ఎంట్రీ ఇవ్వడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంది. సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన తేజ మిరాయ్ సినిమా మంచి సక్సెస్ సాధించింది. రితిక నాయర్, తేజ కలిసి ఈ షోలో కాసేపు సందడి చేశారు. టీజీ విశ్వప్రసాద్ ఇలా కనిపించి అలా వెళ్ళిపోయారు. మొత్తానికి ఎపిసోడ్ ఫన్ అండ్ ఎలిమినేషన్ తో కంప్లీటెడ్.
Also Read: Maruthi: సినిమా కోసం ఇంతలా దిగజారకండి.. ఆ డైరెక్టర్‌కు మారుతి చురకలు