Shivam Dube: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 tournament ) నేపథ్యంలో…. టీమిండియా కు ( Team India) ఓ అరుదైన ఆణిముత్యం దొరికింది. అతడు వాడితే టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుంది. అలా ఇప్పటివరకు 32 సార్లు రుజువు అయింది. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరో కాదు ఆల్రౌండర్ శివం దూబే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు శివం దూబే. ఇతను ఇప్పటివరకు టీమిండియా తరఫున 32 టి20 మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించాడు.
ఇందులో 30 మ్యాచ్లలో టీమిండియా విజయం సాధించింది. రెండు మ్యాచ్ లు ఇతర కారణాల వల్ల రద్దయ్యాయి. అంటే టీమిండియా కు అలాగే ప్రత్యర్థి జట్టుకు చెరో పాయింట్ వచ్చిందన్నమాట. ఈ లెక్కన చూస్తే 32 మ్యాచ్లలో… అన్ని మ్యాచ్లు శివం దుబే ( Shivam Dube ) ఆడటం వల్ల గెలిచిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన పోస్టులు వైరల్ చేసి…. శివం దూబేను ఓ రేంజ్ కు లేపుతున్నారు అభిమానులు.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా కు బంపర్ ఆఫర్ దక్కింది. వరుసగా రెండు మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా సూపర్ 4కు అర్హత సంపాదించింది. ఇవాళ ఒమెన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో యూఏఈ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇందులో యూఏఈ విజయం సాధించడంతో టీమిండియా కు లైన్ క్లియర్ అయింది. ఈ తరుణంలోనే సూపర్ 4 కు టీమిండియా దూసుకువెళ్లింది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే యూఏఈ అలాగే పాకిస్తాన్ జట్టు పై గ్రాండ్ విక్టరీ కొట్టింది టీం ఇండియా. దీంతో టీం ఇండియా ఖాతాలోకి నాలుగు పాయింట్లు రావడమే కాకుండా రన్ రేట్ కూడా బాగానే వచ్చింది. దీంతో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ ఫోర్ అర్హత సంపాదించింది టీమిండియా. రెండవ బర్త్ కోసం పాకిస్తాన్ అలాగే యూఏఈ జట్లు.. తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు సూపర్ ఫోర్ కు వస్తుంది. ఎక్కువ శాతం పాకిస్తాన్ విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అంచనాలు తలకిందులు అయితే యూఏఈ గెలవడం ఖాయం.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో భాగంగా… నిన్నటి రోజున పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. బ్యాటింగ్ అలాగే బౌలింగ్లో అద్భుతంగా రాణించిన టీమిండియాను పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో… విజయం సాధించిన టీమిండియా… ఆసియా కప్ 2025 టోర్నమెంట్ పై కన్నేసింది.
Shivam Dube stands tall with a record 32-match unbeaten streak in T20Is — a silent force behind India’s success. ✨🇮🇳#INDvPAK #Cricket #ShivamDube #Sportskeeda pic.twitter.com/blMDm5YRqm
— Sportskeeda (@Sportskeeda) September 15, 2025