సోన్ ప్రయాగ్-కేదార్ నాథ్ మధ్య భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక రోప్ వే ప్రాజెక్టును చేపట్టింది. ఇది కేదార్ నాథ్ ద్వారకా (ఒక ప్రసిద్ధ జ్యోతిర్లింగ ఆలయం)కు భక్తులు, టూరిస్టులను అత్యంత సులభంగా ప్రయాణించే అవకాశాన్ని కలిగించనుంది. ప్రస్తుతం, సోన్ ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్ వరకు 16 కిలోమీటర్ల పాక్ ట్రెక్ చేయాలి. ఇందుకోసం సుమారు 8 నుంచి 9 గంటల సమయం పడుతుంది. ఈ రోప్ వే పూర్తయిన తర్వాత, ఈ ప్రయాణం కేవలం 36 నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (11,500 అడుగుల ఎత్తులో), అతి పొడవైన రోప్‌వే లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకోనుంది.
⦿ పొడవు, స్థానం: సోన్ ప్రయాగ్-కేదార్ నాథ్ రోప్ వే మొత్తం 12.9 కిలోమీటర్లు ఉంటుంది. సోన్ ప్రయాగ్ రోడ్ యాక్సెస్ చివరి పాయింట్ నుండి కేదార్‌నాథ్ ఆలయం వరకు నిర్మించనున్నారు. ఇది 3,583 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అన్ని వాతావరణ పరిస్థితులలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలు అందించేలా రూపొందిస్తున్నారు.
⦿సామర్థ్యం: దీనిని ట్రై కేబుల్ డిటాచబుల్ గాండోలా(3S) టెక్నాలజీతో నిర్మించబడుతుంది. ప్రతి గంటకు రెండు దిశల్లో 1,800 మంది ప్రయాణికులు, రోజుకు 18,000 మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తారు. కేదార్ నాథ్ కు సంవత్సరానికి సుమారు 20 లక్షల మంది భక్తులను తరలిస్తుంది.
⦿ప్రాజెక్టు ఖర్చు, మోడల్: ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.4,081 కోట్లు. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్ నర్‌షిప్ (PPP) మోడల్ లో నిర్మానం అవుతుంది. అదాని ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL) ఈ రోప్ నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకుంది. దీని నిర్మాణానికి 6 సంవత్సరాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత 29 సంవత్సరాలు AEL ఆపరేట్ చేస్తుంది. ఆదాయంలో అదాని గ్రూప్ 42% పొందుతుంది.
⦿ ఈ ప్రాజెక్టు ఆమోదం: 2022లో కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఆమోదించింది. 2025 మార్చిలో ఫైనల్ అప్రూవల్ ఇచ్చింది. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ (NBWL) 2022 అక్టోబర్ లో పర్యావరణ అనుమతి ఇచ్చింది. ఇది పర్వత్ మాలా పరియోజనలో భాగంగా నిర్మాణం అవుతుంది.
⦿ప్రయోజనాలు: ఈ రోప్ వేతో ప్రయాణ సమయం 9 గంటల నుంచి 36 నిమిషాలకు తగ్గుతుంది. పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. ఉపాధి అవకాశాలు, టూరిజం పెరుగుదల, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది.
Read Also: అంగ్కోర్ వాట్ ఆలయంలా దుర్గా దేవి మండపం, ఖర్చు ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!
కేదార్‌నాథ్ రోప్ వే ప్రాజెక్ట్ భక్తి, ఆధునిక మౌలిక సదుపాయాల మధ్య వారధి అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. “ఈ పవిత్ర ప్రయాణాన్ని సురక్షితంగా, వేగంగా అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. NHLML, ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో మా భాగస్వామ్యం ద్వారా అక్కడి ప్రజలకు కొత్త అవకాశాలను సృష్టిస్తూనే లక్షలాది మంది విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ దేశానికి సేవ చేయడమే కాకుండా, ప్రజలను ఉపయోగపడే మౌలిక సదుపాయాలను నిర్మించాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది” అన్నారు.
Read Also: అక్కడ రైళ్లు ఆకాశాన్ని తాకుతాయి, అమ్మో ఆ స్టేషన్ అంత ఎత్తులో ఉందా?