జెమిని AI శారీ ఫోటోస్ ట్రెండ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. లక్షలాది మంది వినియోగదారులు గూగుల్ జెమిని యాప్‌ని ఉపయోగించి క్రియేట్ చేసిన అందమైన AI శారీ ఫోటోలను నెట్టింట పోస్టు చేస్తున్నారు. తమ మిత్రులతో పంచుకుంటున్నారు. చాలా మంది వినియోగదారులు సాంప్రదాయ పెళ్లి చూపులు. బాలీవుడ్ శారీ షూట్, ఫెస్టివల్ సిల్క్ శారీ పోర్ట్రెయిట్లు సహా లపు ప్రాంప్ట్ లతో ప్రయోగాలు చేస్తున్నారు. ఇవి ఫోటోరియలిస్టిక్ రిజల్ట్స్ ను అందిస్తున్నాయి. రియల్ ఫోటోల్లా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ నెటిజన్లలో సృజనాత్మకత, వినోదాన్ని పంచుతున్నాయి. అయితే, సైబర్ నిపుణులు, పోలీసులు ఈ ఫోటో ట్రెండ్ పై సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. జెమిని యాప్ నిబంధనలు, షరతులు Google AI శిక్షణ కోసం అప్ లోడ్ చేసిన చిత్రాలను ఉపయోగించడానికి అనుమతిస్తాయి. ఇది ప్రైవసీ, సైబర్ మోసం గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతుంది. వ్యక్తిగత అనుమతి లేకుండా డేటాను తిరిగి ఉపయోగించగల ప్లాట్ ఫారమ్ లలో వ్యక్తిగత చిత్రాలను పంచుకోవడం ద్వారా వినియోగదారులు తెలియకుండానే తమను తాము ప్రమాదంలో పడేసుకునే అవకాశం ఉందంటున్నారు.
సాంప్రదాయ దుస్తులతో పాటు అత్యాధునిక AI సాధనాలతో కలిపిన సాంస్కృతిక ఆకర్షణను శారీ ట్రెండ్ ప్రతిబింబిస్తుంది. బనారసీ చీరలో పండుగ ఆభరణాలతో ఉన్న లేడీ, వెడ్డింగ్ రిసెప్షన్ కోసం మోడ్రన్ శారీ యువతి లాంటి ప్రాంప్ట్ లను ఇవ్వడం ద్వారా.. వినియోగదారులు ప్రొఫెషనల్ షూట్ లా కనిపించే హైపర్ రియలిస్టిక్ ఫోటోలను క్రియేట్ చేస్తున్నారు. ఈ AI చీర పోర్ట్రెయిట్‌లు ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపులలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఇవి 2025లో అతిపెద్ద వైరల్ ట్రెండ్‌లలో ఒకటిగా నిలిచాయి.
Read Also: రూ. 4 వేల కోట్లతో కేదార్‌నాథ్ లో కళ్లు చెదిరే రోప్‌వే.. ఇది ప్రపంచంలోనే వెరీ వెరీ స్పెషల్!
ఈ ఫోటోలను ఎంతో రియలిస్టిక్ గా ఉన్నా, పోలీసులు కీలక హెచ్చరికలు చేస్తున్నారు. చీర ఫోటోలు హానికరం కాదని అనిపించినప్పటికీ, జెమిని యాప్ AI ట్రైనింగ్ పర్పస్ కోసం అప్ లోడ్ చేసిన ఫోటోలను సేకరించి ఉపయోగిస్తుందన్నారు. సున్నితమైన డేటాను స్టోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పద్దతులు డిజిటల్ నేరాలు, సైబర్ మోసాలకు కారణమయ్యే అవకాశం ఉంటుందంటున్నారు.“ఈ ఫోటోలు అందంగా, సరదాగా కనిపించవచ్చు. కానీ. వినియోగదారులు బయోమెట్రిక్ డేటాను ఇస్తున్నారని గుర్తుంచుకోవాలి. ఈ సమాచారం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది. ఇది దుర్వినియోగం కావడంతో పాటు మోసానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత ఫోటోలను ఆన్ లైన్ లో పంచుకునే ముందు జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది” అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read Also: అక్కడ రైళ్లు ఆకాశాన్ని తాకుతాయి, అమ్మో ఆ స్టేషన్ అంత ఎత్తులో ఉందా?