BigTV English
Advertisement

Bigg Boss 9 Telugu : హీటేక్కిస్తున్న బిగ్ బాస్ నామోనేషన్స్..రెచ్చిపోయిన తనూజ.. గుడ్డు గొలెంట్రా బాబు..

Bigg Boss 9 Telugu : హీటేక్కిస్తున్న బిగ్ బాస్ నామోనేషన్స్..రెచ్చిపోయిన తనూజ.. గుడ్డు గొలెంట్రా బాబు..

Bigg Boss 9 Telugu : తెలుగు బుల్లితెరపై టాప్ రియాలిటీ షోగా ప్రసారమవుతున్న ఏకైక గేమ్ షో బిగ్ బాస్. 8 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 9 వ సీజన్లోకి అడుగు పెట్టింది. ఈ సీజన్ మొదలయ్యి భారము అవుతుండడంతో ఒక మొదటి కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయింది. డాన్స్ కొరియోగ్రాఫర్ శ్రేష్ట వర్మ ఈవారం తన తట్ట బుట్ట సర్దుకుని బయటికి వెళ్లిపోయింది. ఇక ప్రస్తుతం నామినేషన్స్ హీటెక్కిస్తున్నాయి.. ఈవారం హౌస్ లో ఉండేందుకు నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ ఒక్కొక్కరు రంగు పూసి నామినేషన్ చేస్తున్నారు. ముందుగా సీరియల్ హీరోయిన్ తనూజ నామినేషన్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్క రీజన్ చెప్పి చుక్కలు చూపించింది.


ఈ వారం నామినేషన్స్ లో మాస్క్ మెన్…

సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అందులో బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ లో ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో ముగ్గురిని నామినేట్ చేసి కారణాలు ఏంటో చెప్పాలి అని అడుగుతాడు. ముందుగా తనుజ నామినేషన్ చేయడానికి వస్తుంది. మాస్క్ మాన్ హరీష్ తో పాటుగా మనీష్ ను నామినేట్ చేస్తుంది. అందులో హరీష్ నువ్వు అంటూ మర్యాదగా మాట్లాడలేదు కాబట్టి అతని నామినేట్ చేస్తున్నానని వివరణ ఇస్తుంది. అలాగే మనిషి ఫుడ్ విషయంలో నన్ను ఇలా టార్గెట్ చేయడం మంచిది కాదు అని అంటాడు. ఒక గుడ్డు కోసం నన్ను నామినేట్ చేసావా అని షాక్ అవుతాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని నామినేట్ చేస్తారు. మరి ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్తారు అన్నది సస్పెన్స్ గా మారింది..

రెండో వారం బిగ్ బాస్.. 

మొదటి వారంలో డాన్సర్ శ్రేష్ట వర్మ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. రెండవ వరం అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉండడంతో ఎవరు నామినేట్ చేసి ఎలిమినేట్ చేస్తారో తెలియాల్సింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం ఫ్లోరా బయటకు వెళ్లే అవకాశం ఉందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరి సుమన్ శెట్టి కూడా నామినేషన్స్ లో ఉండబోతున్నారంటూ సమాచారం. ఎటు చూసుకున్నా కూడా సెలబ్రిటీల కన్నా సామాన్యులే ఆక్టివ్ గా ఉన్నారని నెట్టింట టాక్. చూద్దాం ఈవారం హౌస్ నుంచి ఏ కంటెంట్ బ్యాగు సర్దుకుని బయటకు వెళ్తాడు. ఇప్పటి వరకైతే చాలా సాఫ్ట్ గా కూల్ గా జరిగిన టాస్కులు ఇక మీదట ఎలాంటి రణ రంగాన్ని చూపిస్తాయో చూడాలి.. ఈ సీజన్ బిగ్ బాస్ రణరంగం అంటూ నాగార్జున చెప్పినట్లు అంతా సాగుందేమో మరి.. ఏమైనా కూడా ఈ సీజన్ కాస్త చప్పగా ఉందని నెట్టింటా కామెంట్లు వినిపిస్తున్నాయి.


Related News

Bigg Boss 9: నన్ను ఒక బలి పశువుల వాడుకున్నారు.. బిగ్ బాస్ ను కడిగిపారేసిన దమ్ము శ్రీజ.!

Bigg Boss 9 Promo: హౌస్ లో ది గర్ల్ ఫ్రెండ్.. రీ క్రియేట్ తో ఆకట్టుకున్న కంటెస్టెంట్స్!

Bigg Boss 9 Elimination: ఎలిమినేషన్ లో ట్విస్ట్.. మాధురి అవుట్.. తనూజ పవరాస్త్రా సంగతేంటి?

Bigg Boss 9 : డిమోన్ పై నాగ్ ఫుల్ ఫైర్.. బయటకు వెళ్లిపోమ్మని తలుపులు తెరిచిన బిగ్ బాస్

Bigg Boss 9 Day 55: కెప్టెన్ దివ్యకి నాగార్జున కౌంటర్.. సంజన, భరణి, ఇమ్మూకి ఫుల్ క్లాస్, డిమోన్ ని వెళ్లిపోమ్మన్న హోస్ట్

Bigg Boss 9: బయట ఫుల్ నెగిటివ్.. కానీ, రోజు రోజుకి నచ్చేస్తోన్న క్యూట్ పాప

Ramya Moksha : వైరల్ అవుతున్న పచ్చళ్ల పాప వీడియో, బిగ్బాస్ గుట్టు రట్టు

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 8వ వారం ఎలిమినేట్ అతనే..? ఓటింగ్ రివర్స్.. విన్నర్ ఎవరంటే..?

Big Stories

×