Telangana Govt: ఎట్టకేలకు కాలేజీ యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు సఫలం అయ్యాయి. రేపటి నుంచి కాలేజీలు యథావిధిగా తెరుచుకోనున్నాయి. ఈ వారం రూ.600 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీపావళి పండుగకు మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ప్రజా భవన్ లో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.8 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపిన విషయం తెలిసిందే. దీనితో ఈనెల 15 నుంచి నిరవధిక బంద్‌కు సిద్ధమని హెచ్చరికలు జారీ చేసింది.. ఈ నెల 21 లోపు టోకెన్ జారీ చేసి రూ.1200 కోట్లు చెల్లించాలని.. లేకపోతే ఈ నెల 23 నుంచి 25 తేదీల్లో విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తామని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పేర్కొంది.