No Handshake : ఆసియా కప్ 2025 లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (IND Vs PAK) మధ్య జరిగిన మ్యాచ్ లో ప్రస్తుతం షేక్ హ్యాండ్ వివాదం కొనసాగుతోంది. సాధారణంగా మ్యాచ్ ముగిసిన తరువాత ప్రత్యర్థిని గౌరవిస్తూ.. షేక్ హ్యాండ్ (Hand Shake) ఇస్తారు. కానీ ప్రస్తుతం ఇండియా- పాకిస్తాన్ (India-Pakistan) దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నవిషయం తెలిసిందే. మరోవైపు కొందరూ బాయ్ కాట్ (Boycott) టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ అంటూ నినాదాలు చేయడంతో టీమిండియా వారిని గౌరవిస్తూ.. పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానించింది. మరోవైపు టాస్ వేసే సమయంలో కూడా టీమిండియా కెప్టెన్ పాకిస్తాన్ కెప్టెన్ కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీంతో సూర్యకుమార్ యాదవ్ కావాలనే షేక్ హ్యాండ్ ఇవ్వలేదని పాకిస్తాన్ రకరకాల కామెంట్స్ చేస్తుంది. మరోవైపు పీసీబీ.. ఐసీసీ (ICC) కి ఫిర్యాదు చేస్తుందని ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి ఈ మ్యాచ్ లో టీమిండియా (Team India) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఫలితం కంటే షేక్ హ్యాండ్ వివాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారడం విశేషం. ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) కంటే ముందు ఇరు జట్లు తలపడినప్పుడు ఆటగాళ్లు ఒకరినొకరూ పలకరించుకునేవారు.. కానీ తాజా మ్యాచ్ లో కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. అందుకు ఉగ్రవాదులు పహల్గామ్ పై దాడి చేయడమనే చెప్పవచ్చు. గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యామా..? మ్యాచ్ గెలిచామా..? వెళ్లామా అన్నట్టు భారత్ తమ వైఖరీని ప్రదర్శించింది. ముఖ్యంగా టాస్ వేసిన సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ముఖం కూడా చూడకుండా సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar) వెళ్లిపోయాడు. ఇదంతా ముందస్తు ప్రణాళికతోనే జరిగింది.మరోవైపు మ్యాచ్ లో టీమిండియా (Team India) విజయం సాధించిన తరువాత క్రీజులో ఉన్న కెప్టెన్ సూర్యకుమార్, శివమ్ దూబే పాకిస్తాన్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయారు.
“ఆసియా కప్ ను ACC నిర్వహిస్తున్నప్పటికీ.. ఈ టోర్నీ పై ICC (ICC) కి పూర్తి అధికారం ఉంటుంది. ఐసీసీ క్రీడా స్పూర్తిని ప్రోత్సహిస్తుంది. ఆటగాళ్లు ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే.. ఐసీసీ చర్యలు తీసుకుంటుంది. వాస్తవానికి షేక్ హ్యాండ్ విషయంలో ఇలాంటిదే వర్తిస్తుందని పాకిస్తాన్ (Pakistan) భావిస్తుంది. కానీ షేక్ హ్యాండ్ ఇవ్వాలనే నిబంధన ఐసీసీ రూల్స్ బుక్ (ICC Rools Book) లో ఎక్కడా కూడా లేదు. షేక్ హ్యాండ్ అనేది క్రీడా స్పూర్తికి చిహ్నం మాత్రమే. వాస్తవానికి అది కచ్చితమైన రూల్ ఏమి కాదు. ఆటగాళ్లు ఎవరైనా షేక్ హ్యాండ్ చేయాలా..? వద్దా అనేది వారి వ్యక్తిగత నిర్ణయమే. ఐసీసీ రూల్ బుక్ లో మాత్రం ఆటగాళ్లు, సహచరులను, మ్యాచ్ అధికారులను, అంపైర్లను గౌరవించాలని ఉంటుంది. కానీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం పెద్ద నేరం అని ఐసీసీ రూల్స్ లో ఎక్కడా ప్రస్తావించలేదు. ఒకవేళ ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించి.. షేక్ హ్యాండ్ ఇవ్వకుంటే దానిని ఐసీసీ నేరంగా పరిగణిస్తోంది. ఈ సందర్భంలో టీమిండియా (Team India) ఆటగాళ్లు ప్రత్యర్థులను రెచ్చగొట్టేలా వ్యవహరించలేదు. కాబట్టి టీమిండియా కి ఐసీసీ ఎలాంటి జరిమానా విధించే అవకాశం లేదు” అని బీసీసీఐ సీనియర్ అధికారి స్పందించారు.