BigTV English

Bigg Boss 8 Telugu : అవ్వా .. ఇదేంటి మణికంఠ ఇంత కరువులో ఉన్నావా ?

Bigg Boss 8 Telugu : అవ్వా .. ఇదేంటి మణికంఠ ఇంత కరువులో ఉన్నావా ?

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. ఎదో వారం నామినేషన్స్ హౌస్ లో రచ్చగా మారాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం తొమ్మిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. సోమవారం , మంగళవారం జరిగిన ఎపిసోడ్ లలో హౌస్ మేట్స్ ఎక్కడా తగ్గకుండా నామినేషన్స్ చేసారు. ఇక బుధవారం ఎపిసోడ్స్ లలో రచ్చ రచ్చగా సాగింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో ప్రతి ఒక్కరు చురుగ్గా పాల్గొన్నారు . నిన్నటి ఎపిసోడ్స్ హైలెట్ విషయానికొస్తే .. విష్ణు ప్రియా స్టోరీ విన్న గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది. అంత పేరు సంపాదించుకున్న కన్న తండ్రి దగ్గర లేడు అని ఎమోషనల్ అయ్యింది.


నామినేషన్‌ల అనంతరం ప్రేరణ తన టీం మీద గుర్రుగా ఉంది. విష్ణుని ప్రేరణ కడిగి పారేసింది. తనకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదని విష్ణుని ప్రేరణ నిలదీసింది. ఇక ఇన్‌ఫినిటీ రూం లోకి వెళ్లి నబిల్ కోరిన కోరికను బిగ్ బాస్ నేరవేర్చాడు. కాకపోతే దానికి కొన్ని కండీషన్లు పెట్టాడు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నన్ని రోజులు స్వీట్స్, డ్రింక్స్ ముట్టకూడదని నబిల్‌కు కండీషన్ పెట్టాడు. అలా అయితే వారం రోజుల పాటు అన్ లిమిటెడ్ రేషన్ వస్తుందని అన్నాడు. ఆ కండీషన్‌కు నబిల్ ఒప్పుకున్నాడు. ఇక నబీల్ త్యాగం తో హౌస్ లో అన్ లిమిటెడ్ ఫుడ్ ను సంపాదించుకున్నారు.

ఇక రువాత మణికంఠ.. గంగవ్వతో కామెడీ చేశాడు. తాను ఈ వారం సేవ్ అయితే అర్దతులం బంగారం ఇస్తానని, తన కోసం దేవుడ్ని ప్రార్థించమని బేరం పెట్టుకున్నాడు. అక్కడ రోహిణి కాస్త కామెడీ చేసింది. నేను కూడా ప్రేయర్ చేస్తా.. నాకేం ఇస్తావ్ అని అడిగింది. నేను సేవ్ అయితే ముద్దు ఇస్తా అని మణికంఠ కామెడీ చేశాడు. చివరకు గంగవ్వ మీద ఒట్టేసి అర్దతులం ఇస్తానని అన్నాడు. అందరినీ నవ్వించమని అవినాష్, రోహిణిలకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. నామినేషన్ ప్రాసెస్‌లో అవినాష్, పృథ్వీ, తేజలను రోహిణి ఇమిటేట్ చేసింది. ఆ సీన్ కాస్త హౌస్ లో నవ్వులు పూయించింది.


ఎపిసోడ్ మొత్తం సరదాగా సాగింది. అయితే ఎపిసోడ్ విషయం పక్కన పెడితే మణికంఠ మీద నెటిజన్స్ ట్రోల్స్ దారుణంగా వినిపిస్తున్నాయి. హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి ఈ రసికుడు ఎవరొకరిని తన హగ్గులతో పులిహోర కలుపుతున్నాడన్న విషయం తెలిసిందే. నిన్న ఎపిసోడ్ లో మాత్రం రోహిణికి ఏకంగా ముద్దు ఇస్తాను అని చెప్పడం హాట్ టాపిక్ అవుతుంది. నేను ఎలిమినేటి అవ్వకుండా ఉంటె గంగవ్వకు బంగారం ఇస్తానని ఒట్టు వేసాడు. అలాగే రోహిణికి ముద్దు ఇస్తానని అంటాడు దానికి రోహిణి మాత్రం నీతో ముద్దులు పెట్టించుకోవడానికే బిగ్ బాస్ కు వచ్చామా అని సెటైర్ వేస్తుంది . ఇదే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది . ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి . .

Related News

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Bigg Boss 9: ఎన్టీఆర్ షోలో మర్యాద మనీష్.. గుండు సీక్రెట్ రివీల్ చేస్తూ!

Bigg Boss Telugu 9: సంజన సీక్రెట్ బయటపెట్టి షాకిచ్చిన మనీష్.. వరస్ట్ ప్లేయర్ శ్రీజ, ప్రియకు బిగ్ బాంబ్!

Big Stories

×