E-Paper
Advertisement

December 05 Horoscope: ఈ నాలుగు రాశులవారికి ఈ రోజు తిరుగు ఉండదు, మిగతా రాశులకు బ్యాడ్ లక్!

December 05 Horoscope: ఈ నాలుగు రాశులవారికి ఈ రోజు తిరుగు ఉండదు, మిగతా రాశులకు బ్యాడ్ లక్!

December 05 Horoscope :  గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 5న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:  నూతన పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృషభ రాశి:  చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్థి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు.

మిథున రాశి: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికవుమతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటక రాశి: ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతతకు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

సింహ రాశి: ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందుతాయి.

కన్య రాశి: చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు చర్చిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నత్తులు వచ్చే అవకాశం  ఉన్నది.

తులా రాశి: ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన రుణయత్నాలు అనుకూలించవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.  దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపార ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చిక రాశి: ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థాన చలనాలు తప్పవు.

ధనస్సు రాశి: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

మకర రాశి: కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆర్థికపరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో వైద్యలను  సంప్రదించాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారులతో సమస్యలు తప్పవు.

కుంభ రాశి: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పరుస్తాయి. నిరుద్యోగులకు రావలసిన అవకాశాలు తృటిలో చేజారుతాయి.

మీన రాశి: ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు.

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×