BigTV English

బంగారం మాత్రమే కాదు వెండి కూడా రికార్డులు బద్దలు కొడుతోంది..సిల్వర్ లో ఎలా పెట్టుబడి పెట్టాలి..?

బంగారం మాత్రమే కాదు వెండి కూడా రికార్డులు బద్దలు కొడుతోంది..సిల్వర్ లో ఎలా పెట్టుబడి పెట్టాలి..?

బంగారం ధర గడచిన కొన్ని రోజులుగా గమనించినట్లయితే భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా పసిడి ధరలు భారీగా పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు ఒక ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా లక్ష రూపాయలు దాటి ముందుకు దూసుకుని వెళ్లిపోయింది. అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర ఏకంగా 3700 డాలర్ల వద్ద ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకింది.


బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధానంగా డాలర్ విలువ పతనం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అయితే బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారంలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఈటీఎఫ్ స్కీముల్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఫిజికల్ గోల్డ్ సైతం కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరిగిందని అంచనాలు వేస్తున్నారు.

దీనికి ప్రధాన కారణం బంగారం ధర భారీగా పెరగడం వల్ల ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో బంగారం లో పెట్టుబడి పెడుతున్నారు. అటు ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా బంగారం పై పెట్టుబడి పెట్టడం పెరిగింది అని చెప్పవచ్చు. ఇక పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు అయితే తమ రిజర్వుల్లో బంగారం నిష్పత్తి భారీగా పెంచేసాయి అని చెప్పవచ్చు. ఒకప్పుడు డాలర్ కు ఉన్న పరపతిని దాటేసి బంగారం ఆ స్థాయికి చేరుకుంది అని చెప్పవచ్చు. బంగారం విలువ భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో అందులో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది అని పలు అధ్యయన సంస్థలు చెబుతున్నాయి.


అయితే బంగారం తో పాటు సైలెంట్ గా వెండి కూడా అంతే భారీగా పెరిగింది అని చెప్పవచ్చు. వెండి ప్రతిరోజు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు దూసుకుని వెళ్తుంది ధర పెరగడానికి ప్రధాన కారణం, ప్రపంచవ్యాప్తంగా వెండి డిమాండ్ పెరగడమే అని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వెండి ఇండస్ట్రియల్ డిమాండ్ కారణంగానే భారీగా పెరిగిందని అంచనా వేస్తున్నారు. వెండిని ఎక్కువగా ఎలక్ట్రానిక్స్, సోలార్, మెడికల్, ఆటోమొబైల్స్ మొదలైన వస్తువుల తయారీలో ఉపయోగిస్తున్నారు.

అయితే బంగారం తర్వాత వెండి లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మీరు కూడా వెండి లో పెట్టుబడి పెట్టాలి అనుకున్నట్లయితే ఎలా పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాం. . వెండి లో పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది ఫిజికల్ సిల్వర్ లో పెట్టుబడి దీని కోసం మీరు వెండి కాయిన్స్, వెండి సామాన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పద్ధతిలో ఎక్కువ మొత్తంలో మీరు పెట్టుబడి పెట్టలేరు.

సిల్వర్ ఈటీఎఫ్:
వెండిలో పెట్టుబడి పెట్టేందుకు సరైన పద్ధతి సిల్వర్ ఈటీఎఫ్ అని చెప్పవచ్చు. ఇది స్టాక్ మార్కెట్ తరహాలోనే సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడర్ ఫండ్స్ ద్వారా మీరు పెట్టుబడులు పెట్టవచ్చు. ఇవి డిమాట్ అకౌంట్ ద్వారా మీరు ఈ లావాదేవీలను నిర్వహించవచ్చు. ఎలాంటి రిస్క్ ఉండదు. మార్కెట్ డిమాండ్ ను బట్టి ఈటిఎఫ్ విలువ పెరగడం లేదా తగ్గడం అనేది ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఈ తరహా పెట్టుబడులు పెట్టడం వల్ల వెండిపైన మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

మరో మార్గం సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ లేదా లంప్‌సమ్ పద్ధతిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇక కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్ లో మీరు సిల్వర్ ఫ్యూచర్స్ కొనుగోలు చేయడం ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు అయితే ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

Related News

Bigg Boss 9 : ఈ దమ్ము శ్రీజ ప్రతి దానికి నోరు వేసుకొని పడిపోతుంది, అసలు కన్ఫెక్షన్ రూమ్ లో ఏం జరిగింది?

Bigg Boss 9: ఇమ్మానుయేల్ ఎలిమినేషన్? ఇదెక్కడి ట్విస్ట్?

Bigg Boss 9 Sanjana : సంజనా ఓ కట్లపాము.. ఓ నాగుపాము… మూడు రోజుల్లో ఆమెలో ఇది గమనించారా ?

Bigg Boss Telugu 9 Promo: ప్రియ వర్సెస్‌ మనీష్‌.. హౌజ్‌లో సంజనకు కంప్లీట్‌ నో ఎంట్రీ.. ప్రియ సపోర్ట్.. మనీష్ ఫైర్..

Bigg Boss 9 Telugu: ఇమ్మూ గెటప్ అదుర్స్.. గొడవల మధ్య నవ్వుల వాతావరణం!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 9 ఫస్ట్ కెప్టెన్… సంజనా గల్రానీ

Big Boss 9 Telugu : శ్రేష్టి వర్మకు షాకింగ్ ఓటింగ్… మొదటి వారమే హౌస్‌ నుంచి అవుట్ ?

Big Stories

×