క్రెడిట్ కార్డుతో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయవచ్చా అంటే అవును అనే సమాధానం చెప్పవచ్చు. నిజానికి క్రెడిట్ కార్డుతో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. అయితే ఇది కేవలం పెద్ద ఆభరణాల దుకాణాలలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది. సాధారణంగా ఆభరణాల దుకాణాల వద్ద వారు క్యాష్ తో పాటు అన్ని రకాల పేమెంట్ ఆప్షన్లకు అనుమతి అందిస్తారు. కనుక మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రెడిట్ కార్డు ద్వారా బంగారు ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. అయితే క్రెడిట్ కార్డు ద్వారా బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే కొన్ని లాభనష్టాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. . ముఖ్యంగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే సమయంలో క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తున్నట్లయితే ఇలాంటి అంశాలపై దృష్టి సారించాలో కూడా ఇప్పుడు మనం చూద్దాం.
క్రెడిట్ కార్డుతో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం వల్ల కలిగే లాభాలు ఇవే:
క్రెడిట్ కార్డుతో మీరు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్లయితే మీరు పెద్ద మొత్తంలో క్యాష్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీరు క్రెడిట్ కార్డు ద్వారా బంగారు ఆభరణాలను కొంటే మీకు రివార్డు పాయింట్లు అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్లు లభిస్తాయి. మీరు పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు క్రెడిట్ కార్డులు ఉపయోగపడతాయి. అంతేకాదు క్రెడిట్ కార్డు ద్వారా మీరు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన అనంతరం ఈ బిల్లు మొత్తాన్ని మీరు ఈఎంఐ రూపంలోకి మార్చుకొని సులభ వాయిదాలలో చెల్లించుకోవచ్చు. అలాగే మీరు బిల్లు చెల్లింపులు క్రెడిట్ కార్డు ద్వారా చేసినట్లయితే ఇది పూర్తిగా సురక్షితమైనటువంటి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కావున భవిష్యత్తులో ఎలాంటి ఇన్కమ్ టాక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉండదు. పూర్తి పారదర్శకంగా ఈ చెల్లింపులు జరుగుతాయి.
క్రెడిట్ కార్డుతో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే:
ఇక క్రెడిట్ కార్డు ఉపయోగించి బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్లయితే సాధారణంగా నగల షాపుల వారు అదనపు చార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది ఇది దాదాపు 1-2 శాతం వరకు ఉండవచ్చు. అలాగే కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డు ఉపయోగించి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే రివార్డ్ పాయింట్స్ ఇవ్వవు. అలాగే మీరు క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐ గా మార్చుకున్నట్లయితే దానిపై 12 నుంచి 18 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా మీరు డబ్బు నష్టపోవచ్చు. మీరు క్రెడిట్ కార్డు ఉపయోగించి బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినప్పుడు బిల్లు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఆ బిల్లును సమయానికి చెల్లించకపోయినట్లయితే, 30 నుంచి 40 శాతం మేర వడ్డీ వసూలు చేసే అవకాశం ఉంటుంది. కనుక క్రెడిట్ కార్డు ఉపయోగించి బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించుకుని ముందు అడుగు వేస్తే మంచిది. . క్రెడిట్ కార్డు బదులుగా డెబిట్ కార్డు ఉపయోగించి బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.