Bigg Boss 9 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9) కార్యక్రమం ఎట్టకేలకు సెప్టెంబర్ 7వ తేదీన ఘనంగా ప్రారంభం అయ్యింది. ఇందులో 9 మంది సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగుపెట్టగా.. 6 మంది కామనర్స్ ‘అగ్నిపరీక్ష’ లో తమను తాము నిరూపించుకొని హౌస్ లోకి అడుగుపెట్టారు. అలా అడుగుపెట్టిన 6 మంది కామనర్స్ ను ఓనర్స్ గా ప్రకటించిన బిగ్ బాస్.. సెలబ్రిటీలను టెనెంట్స్ గా ప్రకటించి.. రెండు ఇల్లుగా వీరిని విభజించడం జరిగింది. అంతేకాదు ఎవరికి వారికి ఇల్లు కూడా కేటాయించారు. అయితే మెయిన్ హౌస్ లో కామనర్స్ ఉంటారు.. ఇందులోకి సెలబ్రిటీలు ప్రవేశించాలి అంటే బిగ్ బాస్ పెట్టే టాస్క్లను నెగ్గాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా మొదటి వారం నామినేషన్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. అందులో 8 మంది సెలబ్రిటీలు నామినేట్ కాగా.. ఒక కామనర్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఇకపోతే హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి ఇప్పటివరకు ప్రముఖ నటి సంజన గల్రానీ (Sanjana Garlani) పై కంటెస్టెంట్ల మధ్య పూర్తి వ్యతిరేకత నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈమె బిహేవియర్ నచ్చలేదని కామెంట్లు చేశారు. పైగా షాంపూ , కండిషనర్ విషయంలో బాత్రూం దగ్గర ఫ్లోరా షైనీతో గొడవకు దిగడం.. అటు వీటన్నింటినీ తీసేయాలి అని కామనర్ చెప్పినా ఆమె వినకపోవడం అన్నీ కూడా ఆమెకు వ్యతిరేకంగానే నిలిచాయి.
ఫస్ట్ కెప్టెన్సీగా బాధ్యతలు..
అంతేకాదు హౌస్ లో ఒక్క పని చేయకుండా తిని కూర్చుంటుంది అని కూడా ఈమెపై కామెంట్లు చేశారు. పైగా ఓనర్స్ అంతా కూడా కట్టగట్టుకొని మరీ ఈమెను నామినేట్ చేశారు.దీంతో ఈమె మొదటివారం ఎలిమినేట్ అవుతుందని అంతా ఫిక్స్ అయిపోయారు. కట్ చేస్తే సీన్ రివర్స్.. ఎలిమినేషన్ నుంచి సేఫ్ అవ్వడమే కాకుండా మొదటి కెప్టెన్ గా హౌస్ కి బాధ్యతలు చేపట్టి సంచలనం సృష్టించింది. ఇన్ని రోజులు హౌస్ లో కంటెస్టెంట్స్ వ్యతిరేకత ఎదుర్కొన్న సంజనా మొదటివారం సేఫ్ జోన్ లోకి రావడమే కాకుండా ఇలా ఈ సీజన్ లో మొదటి కెప్టెన్ గా బిగ్ బాస్ సీజన్ 9 లో నిలిచి రికార్డు సృష్టించింది. ఏది ఏమైనా సంజన ఇప్పుడు మొదటి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ లవర్స్ మాత్రం ఇది కదా అసలు ట్విస్ట్ అంటే అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా సంజన సేఫ్ అవడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
అసలైన ట్విస్ట్ మొదలు..
ఇక బిగ్ బాస్ సీజన్ 9 విషయానికి వస్తే.. కనీవినీ ఎరుగని రీతిలో 20వేలకు పైగా కామన్ మ్యాన్ క్యాటగిరి కోసం అప్లికేషన్లు రాగా.. అందులో 45 మందిని ఎంపిక చేసి అగ్నిపరీక్ష అంటూ ఒక మినీ షో నిర్వహించారు. ఇందులో 6 మందిని ఎంపిక చేసి హౌస్ లోకి పంపించడం జరిగింది. ఇప్పుడు వీరంతా కూడా తమ స్ట్రాటజీని చూపిస్తూ టైటిల్ విజేతగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈసారి కప్పు ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.
ALSO READ:The Raja Saab First Song : రాజా సాబ్ ఫస్ట్ సాంగ్ లీక్… ఓ బావా బావా అంటూ