BigTV English

Personal Finance: రూ. 50 లక్షల హోం లోన్ సైతం…ఈఎంఐ కడుతూ కేవలం 10 సంవత్సరాల్లో అప్పు తీర్చడం ఎలా..?

Personal Finance: రూ. 50 లక్షల హోం లోన్ సైతం…ఈఎంఐ కడుతూ కేవలం 10 సంవత్సరాల్లో అప్పు తీర్చడం ఎలా..?

ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక జీవిత ఆశయం అని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్వకాలంలో మన పెద్దలు సైతం పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని చెబుతుండేవారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఈ రెండు పనులు చేయడం అనేది ఒక అతిపెద్ద ఆర్థిక ప్రణాళిక అని చెప్పవచ్చు. అమ్మాయి పెళ్లి చేయాలనుకున్నా, లేదా ఇల్లు కట్టాలనుకున్నా, ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోనే సాధ్యమవుతుంది. కనీసం 20 నుంచి 30 సంవత్సరాల వరకు పొదుపు చేస్తేనే ఇల్లు కానీ పెళ్లి కానీ పూర్తవుతాయి. సగటు భారతీయులంతా ఎక్కువగా ఈ రెండు అవసరాల గురించి ఆలోచిస్తూ ఉంటారు.


అయితే ఇల్లు కొనుగోలు చేయడానికి మనం ఎక్కువ మొత్తం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ డబ్బును మీరు పొదుపు చేసి జీవిత చరమాంకంలో ఇల్లు నిర్మించాలి అనుకున్నట్లయితే అప్పటి ఖర్చులకు ఇల్లు పూర్తి చేయడం ఖరీదు అయిపోతుంది. అయితే ఇంటి కల నెరవేర్చుకోవడానికి బ్యాంకులు రుణాలను అందిస్తున్నాయి.

ఈ రుణాలను తీసుకోవడం ద్వారా మీరు అతి తక్కువ వడ్డీరేట్లకే హోమ్ లోన్ పొంది, మీ సొంత ఇంటి కలను పూర్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం పలు బ్యాంకులు ఉద్యోగులకు, వ్యాపారులకు, ప్రొఫెషనల్ వృత్తిదారులకు హోమ్ లోన్స్ అందజేస్తున్నాయి. అయితే వీటిని తిరిగి చెల్లించేందుకు మీకు సామర్థ్యం ఉందా లేదా అనే విషయాన్ని సిబిల్ స్కోర్ ను బట్టి తెలుసుకుంటారు.


ప్రస్తుత కాలంలో ఒక మోస్తరు డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుగోలు చేయాలి అంటే 50 లక్షల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ 50 లక్షల రూపాయలను మీరు లోన్ గనుక పొందినట్లయితే తిరిగి చెల్లించడానికి కనీసం 20 నుంచి 30 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. అయితే ఈ మొత్తాన్ని కేవలం 10 సంవత్సరాల కాలంలోనే తిరిగి చెల్లించాలి అనుకున్నట్లయితే ఏం చేయాలో తెలుసుకుందాం.

ఉదాహరణకు మీరు 50 లక్షల రూపాయలతో ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారు అనుకుందాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న హోమ్ లోన్ వడ్డీ ప్రకారం ఎనిమిది శాతం వడ్డీకి రుణం పొందారు అనుకుందాం. ఈ లెక్కన చూస్తే మీరు ప్రతి నెల కనీసం 40 వేల రూపాయలు ఈఎంఐ చెల్లిస్తూ 20 సంవత్సరాల్లో ఈ రుణం తీర్చవచ్చు.

ఈ మొత్తాన్ని మీరు 10 సంవత్సరాల్లోనే తీర్చాలి అనుకున్నట్లయితే. మీరు నెల నెల ఈ అమ్మాయి చెల్లిస్తూనే, మీ వేతనంలో మరో 20 వేల రూపాయలను, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో, మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేసినట్లయితే, పది సంవత్సరాల కాలంలో, 12% రాబడిని ఆశించినట్లయితే, మీరు సుమారు 45 లక్షల రూపాయల వరకు కార్పస్ ఫండ్ జమ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని మీరు హోమ్ లోన్ తీర్చుకునేందుకు, ఉపయోగించుకోవచ్చు. ఎలాగో పది సంవత్సరాల ఈఎంఐ అనంతరం, మీ రుణ భారం సగానికి సగం తగ్గిపోతుంది మీ కార్పస్వామ్తో మిగిలిన మొత్తాన్ని కలిపి ఫ్రీ క్లోజర్ ప్రాతిపదికన రుణ అకౌంట్ క్లోజ్ చేసినట్లయితే, మీకు రుణ భారం నుంచి విముక్తి లభిస్తుంది. కొన్ని బ్యాంకులు ఫ్రీక్లోసింగ్ ఎకౌంట్ల పైన చార్జీలను సైతం వసూలు చేస్తుంటాయి.

అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఈక్విటీ మార్కెట్ల పైన ఆధారపడి ఉంటాయి. వీటిపై రాబడి అనేది కచ్చితంగా ఊహించలేము. ఇవి మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. కానీ మీరు లోన్ చెల్లింపు తో పాటు మదుపు సైతం చేసినట్లయితే, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కార్పస్ ఫండ్ మీకు తోడ్పడుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడి సలహాగా భావించరాదు. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కులకు లోబడి ఉంటాయి. . బిగ్ టివి తెలుగు పోర్టల్ మీకు ఎలాంటి పెట్టుబడి సలహాలు ఇవ్వదు. మీ పెట్టుబడుల కోసం సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ సలహా తీసుకుంటే మంచిది.

Related News

క్రెడిట్ కార్డుతో బంగారు ఆభరణాలు కొనవచ్చా..? కొంటే ఎదురయ్యే లాభనష్టాలు ఏంటి..?

Gold Rate: అమెరికాలో బంగారం ధర తక్కువగా ఉంటుందా..? యూఎస్ నుంచి ఎంత బంగారం తెచ్చుకోవచ్చు..

Airtel Xstream Fiber: ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఆఫర్.. నెలకు రూ.250 సేవ్ చేసుకోండి

Vi Business Plus: వ్యాపారానికి ఉత్తమ 5జి ప్లాన్.. విఐ బిజినెస్ ప్లస్ ప్రత్యేక ఆఫర్

Flipkart Big Billion Days: స్మార్ట్‌ఫోన్‌ కొనే టైమ్‌ వచ్చేసిందోచ్! ఫ్లిప్‌కార్ట్ మైండ్‌బ్లోయింగ్ డిస్కౌంట్లు!

Jio Cricket Offer: క్రికెట్ అభిమానుల కోసం జియో కొత్త ఆఫర్..మూడు నెలలు లైవ్ క్రికెట్.. కానీ చిన్న ట్విస్ట్?

DMart Ready App: డీమార్ట్ బంపర్ ఆఫర్.. 50శాతం వరకు డిస్కౌంట్లు, మూడు ఆర్డర్లకు ఉచిత డెలివరీ

Big Stories

×