OTT Movie: మలయాళం సినిమాల్లో కంటెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థ్రిల్లర్ అయినా.. హార్రర్ అయినా.. చివరికి ఫ్యామిలీ మూవీస్ అయినా.. చిన్న కంటెంట్‌తో కొట్టుకొచ్చేస్తారు. అంతేకాదు.. అప్పుడప్పుడు యూత్‌ను పిచ్చెక్కించే సినిమాలు కూడా తీస్తుంటారు. అదే ‘రతి నిర్వేదం’. ఈ మూవీ 2011లో విడుదలై సంచనలం క్రియేట్ చేసింది. వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఇది 1981లో వచ్చిన అదే పేరుతో సినిమాకు రీమేక్. కథ ప్రధానంగా టీనేజ్ అబ్బాయి పప్పు (స్రీజిత్ విజయ్) చుట్టూ తిరుగుతుంది. పరీక్షల తర్వాత సెలవులు గడపడానికి గ్రామానికి వచ్చి పక్కింటి ఆంటీతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేదే ఈ కథ.
పప్పు (స్రీజిత్ విజయ్) అనే టీనేజ్ అబ్బాయి ఇంటర్ పరీక్షలు పూర్తి చేసి సెలవుల కోసం ఇంటికి వెళ్తాడు. పప్పు టీనేజర్ కావడం వల్ల ఎప్పుడూ అలాంటి కోరికలతో ఉంటాడు. అతని తల్లి, అత్త అతడి ఆలోచనలను తెలుసుకోలేకపోతారు. ఆ సమయంలో అతడి కన్ను పక్కింటి రతి (శ్వేతా మీనన్) మీద పడుతుంది. రతికి పెళ్లయి విడాకులు కూడా అవుతాయి. చిన్నప్పటి నుంచి పప్పును తమ్ముడిలా చూసుకొనేది. ఓ రోజు పప్పు రతిని కలుస్తాడు. ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ పప్పు మనసులో మాత్రం వేరే ఆలోచనలు ఉంటాయి. అతడు ఆమెను పొందాలని అనుకుంటాడు. అతని చేష్టలను రతి సీరియస్‌గా తీసుకోదు. ఏదో పిల్లాడు అల్లరి చేస్తున్నాడని అనుకుంటుంది.
ఆమెను చూస్తే చాలు.. పప్పు కోరికలతో రగిలిపోతుంటాడు. ఓ రోజు ఆమె స్నానం చేస్తుంటే పప్పు రహస్యంగా చూస్తాడు. అప్పటి నుంచి అతడిలో కోరికలు మరింత పెరిగిపోతాయి. ఆమెను టచ్ చేసేందుకు, కలిసేందుకు ఆరాటపడతాడు. పప్పు తన ఫీలింగ్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ రతి అతన్ని తమ్ముడిగా మాత్రమే చూస్తుంది. చివరికి అనుకోకుండా ఓ రోజు చిన్న టెంపుల్ వద్ద ఉన్న రతిని పప్పు కలుస్తాడు. జోరున వర్షం కురుస్తుంది. అప్పుడే అనుకోకుండా పప్పు, రతి శరీరకంగా ఒక్కటవ్వుతారు. కానీ, రతిని పాము కాలు వేస్తుంది. కానీ ఆమెను కాపాడలేకపోతాడు. విషాదంతో కథ అంతమవుతుంది. ఈ మూవీలో అన్నిరకాల భావోద్వేగాలు ఉంటాయి. పిల్లలతో చూడాల్సిన సినిమా మాత్రం కాదు. ఈ మూవీ ప్రస్తుతం Jio Hotstar, YouTubeలో అందుబాటులో ఉంది.
Also Read: OTT Web Series: ఈ 10 వెబ్ సీరిస్‌లు చూస్తే రాత్రంతా జాగారమే.. హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడండి మామ!