Big Boss 9 Telugu :బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తూ సరికొత్త రియాలిటీ షో గా పేరు సొంతం చేసుకుంది బిగ్ బాస్.. తెలుగులో 8 సీజన్లో పూర్తికాగా.. ఇప్పుడు తొమ్మిదవ సీజన్ కూడా మొదలయ్యింది. సెప్టెంబర్ 7వ తేదీన చాలా ఘనంగా ఈ షోని ప్రారంభించారు నిర్వాహకులు. ఇంకా ఇందులో తొమ్మిది మంది సెలబ్రిటీలు.. 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇకపోతే ఓనర్స్ గా కామనర్స్ , టెనెంట్స్ గా సెలబ్రిటీలను విభజించి రెండు హౌస్ లను కేటాయించిన విషయం తెలిసిందే. ఇకపోతే మొదటి వారం నామినేషన్ లో భాగంగా ఏకంగా 9 మంది ఈ జాబితాలోకి వచ్చేసారు.
నామినేషన్ ప్రక్రియ మొదలవగానే.. అటు ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. అందులో భాగంగానే 8 మంది సెలబ్రిటీలు.. ఒక కామనర్ ఈ జాబితాలోకి వచ్చేసారు.. ఇకపోతే తాజాగా బిగ్ బాస్ పేరుతో ఓ సోషల్ మీడియా ఖాతా నుండి ఓటింగ్ కి సంబంధించిన లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అందులో ఎవరికి ఎంత పర్సంటేజ్ ఓటు వచ్చింది అనే విషయం వైరల్ గా మారింది. ఇకపోతే మొదటివారం హౌస్ లో జరిగిన గొడవలను చూస్తే సంజనా గల్రానీ (Sanjana Garlani) ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా శ్రేష్టి వర్మ (Shresti Varma) ఆ లిస్టులోకి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ఆ బిగ్ బాస్ పేరుతో ఉన్న సోషల్ మీడియా అకౌంట్‌లో ఉన్న పోల్‌కు సంబంధించి ఓటింగ్ జాబితా ఎలా ఉందో.. ఎవరికి ఎంత శాతం ఓట్లు వచ్చాయో.. వారు ఏ స్థానంలో ఉన్నారో ఇప్పుడు చూద్దాం.
మొదటివారం ఓటింగ్..
తనూజ – 26%
సుమన్ శెట్టి – 20%
ఇమ్మానుయేల్ – 16%
డీమోన్ పవన్ – 10%
సంజన గర్లాని – 9%
రాము రాథోడ్ – 7%
రీతూ చౌదరి – 5%
ఫ్లోరా షైనీ – 3%
శ్రేష్టి వర్మ – 3%
దీని ప్రకారం… అతి తక్కువ ఓటింగ్ శాతంతో శ్రేష్టి వర్మ చివరి స్థానంలో ఉన్నారు. అలాగే ఫ్లోరా సైనీ (ఆశా సైనీ) కూడా దాదాపు అదే ఓటింగ్ శాతంతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నారు. అంటే మొదటి వారం ఈ ఇద్దరిలో ఎవరో ఒక్కరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అయితే, శ్రేష్టి వర్మనే ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
శ్రేష్టి వర్మ ఎలిమినేషన్ కి కారణం అదేనా?
ఇలా కంటెస్టెంట్స్ అందరి వ్యతిరేకత ఎదుర్కొని సంజన హౌస్ నుంచి వెళ్ళిపోతుందని అనుకున్నారు. కానీ తాజాగా నమోదైన ఓటింగ్ చూస్తూ ఉంటే ఆమె ఐదవ స్థానానికి చేరుకున్నారు. మరోవైపు శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అవుతుందని ఎవరు ఊహించలేదు. నిజానికి ఈమె జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు.. ఆయన కేసులో ఇరుక్కుని బాగా వైరల్ అయింది. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రఫీ అందించింది.
నిజానికీ బయట ఎంత ఫేమ్ ఉన్నా సరే హౌస్ లో ప్రెజెంట్స్ అనేది చాలా ముఖ్యం.. కానీ శ్రేష్ఠి వర్మ ఎక్కడ కూడా తన ప్రెజెంట్ ను చూపించుకునే ప్రయత్నం చేయలేకపోయింది.దీంతో ఈమె పెద్దగా జనాలలోకి వెళ్లలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే అటు ఆడియన్స్ కూడా పెద్దగా ఈమెకు ఓట్లు వేయడం లేదని ..ఈ ఓటింగ్ చూస్తుంటే అర్థమవుతుంది.. ఏది ఏమైనా మొదటి వారమే హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతోంది అంటూ ఈ ఓటింగ్ స్పష్టం చేస్తోంది. మరి మొదటివారం ఎలిమినేషన్ ఉంటుందా అనే అనుమానాలు కూడా మరోవైపు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ బోనస్ లో భాగంగా మొదటి వారం ఎలిమినేషన్ తీసేస్తే మాత్రం శ్రేష్టి వర్మ సేవ్ అయినట్లే అని చెప్పవచ్చు.
ALSO READ:KishkindhaPuri: స్పెషల్ షో ఎఫెక్ట్.. ఉన్న బజ్ కి.. టాక్ కి అసలు సంబంధమే లేదు!