Prabhas in Mirai : కార్తీక్ ఘట్టమనేని (Karthik gattamaneni) దర్శకత్వంలో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా నటిస్తున్న సినిమా మిరాయ్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పలుచోట్ల ప్రీమియర్ షోస్ మొదలైన ఈ సినిమా అద్భుతమైన పాజిటివ్ టాక్ అందుకుంటుంది. రేపటితో ఈ సినిమాకి యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే, బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా మరో సంచలనం అవుతుంది. గతంలో తేజ చేసిన హనుమాన్ (Hanuman Movie) సినిమా కూడా ఒక సెన్సేషన్. చాలామంది పెద్ద హీరోలు నడుమ ఈ సినిమా పోటీకి వచ్చి విజేతగా నిలబడింది.
అతి తక్కువ థియేటర్లో విడుదలైన హనుమాన్ సినిమా, కేవలం మౌత్ టాక్ వలన చాలామందికి రీచ్ అయ్యి ఆ తర్వాత ఈ సినిమా కోసం థియేటర్లను కేటాయించారు. ఆ సినిమా తర్వాత తేజ చేస్తున్న సినిమా మిరాయ్ కాబట్టి పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి టీజర్ ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ టైమ్స్ లో విఎఫ్ఎక్స్ గురించి కంప్లైంట్స్ వస్తూ ఉన్న విషయం విధితమే. కానీ ఈ సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ కి ఎక్కువ అప్రిసేషన్ వచ్చింది.
ఈ సినిమా రేపు ప్రేక్షకులు ముందుకు రానున్న తరుణంలో హీరో తేజ సజ్జ ఒక ట్వీట్ చేశాడు. ఇంకొన్ని గంటల్లో మిరాయి సినిమా మీ ముందుకు వస్తుంది. మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు రెబల్ స్టార్ ప్రభాస్ గారికి తెలుపుతున్నాను. ఆయన ఈ సినిమాను మరింత స్పెషల్ చేశారు. మీరు మాత్రం రెబలియస్ సర్ప్రైజ్ ను మొదటినుండి మిస్ అవ్వొద్దు. అంటూ ట్వీట్ చేశారు. ఇక్కడితో ప్రభాస్ ఎంట్రీ ఈ సినిమాలో ఉండబోతుంది అని అందరికీ ఆలోచనలు మొదలయ్యాయి. అలానే కొంతమంది మాత్రం ప్రభాస్ వాయిస్ ఓవర్ ఉంటుంది అని చెబుతున్నారు. ఒకవేళ నిజంగా ప్రభాస్ వాయిస్ ఉన్నా కూడా అది సప్రైజ్.
#Mirai is all yours in few hours 🙂
Eternal gratitude to our BIG-HEARTED
SRI #Prabhas garu for making it so special 🙏🏻Don’t miss the REBELLIOUS SURPRISE right at the beginning 🤍
— Teja Sajja (@tejasajja123) September 11, 2025
మిరాయ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ బ్యానర్లో ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ ( The Raja Saab) సినిమా నిర్మితం అవుతుంది. అందువలన సేమ్ బ్యానర్ కాబట్టి మిరాయ్ సినిమా కోసం ప్రభాస్ స్పెషల్ గా తన వంతు సహాయం చేసి ఉండొచ్చు. సేమ్ బ్యానర్ కాకపోయినా ప్రభాస్ (Prabhas) అవతల వాళ్లను ఎంకరేజ్ చేస్తారు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా విడుదలైనా కూడా ప్రభాస్ అభినందనలు ఆ సినిమాకు ఉంటూనే ఉంటాయి.
Also Read: Bigg Boss 9: ఇమ్మానుయేల్ ఎలిమినేషన్? ఇదెక్కడి ట్విస్ట్?