Bigg Boss 9 : బిగ్ బాస్ ఈ షో ఏంట్రా బాబు ఎలా చూస్తారు అని కొంతమంది అనుకుంటారు. కానీ ఈ షో చూసే అలవాటు పడిన వాళ్ళు ఈ షో చూడకుండా ఉండలేరు. మనుషులు వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి, వాళ్లు ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా ఎలా రంగులు మారుస్తారు. అని క్లియర్ గా మన కళ్ళ ముందు చూపించే షో బిగ్ బాస్. బిగ్ బాస్ మొదలై ఈ రోజుకి నాలుగు రోజులు అవుతుంది. ఈ నాలుగు రోజుల్లో కూడా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ బయటపడుతుంది.
ముఖ్యంగా దమ్ము శ్రీజ ప్రతి విషయంలో అరవడం అనేది చాలామందికి ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. కొంతమంది బిగ్ బాస్ లోకి కామన్ పీపుల్ ని ఎందుకు తీసుకోరు అని ముందు సీజన్లో చూసినవాళ్లు అంటుంటారు. వాళ్లకి ఇది కూడా ఒక సమాధానం అని చెప్పాలి. ఇలా చిన్న పెద్ద విషయానికి అరుస్తూ మీద పడిపోతారు కాబట్టి కామన్ పీపుల్ ని తీసుకోలేరేమో అనిపిస్తుంది.
మామూలుగా చెప్పాల్సిన విషయాన్ని కూడా ఈ అమ్మాయి గొంతు వేసుకొని పడిపోయి మరి చెప్తుంది. ఈరోజు సంజనను కన్ఫెక్షన్ రూమ్ లోకి బిగ్బాస్ (bigg Boss Telugu season 9) పిలిచారు. పిలిచి మిమ్మల్ని హౌస్మెట్ టార్గెట్ చేస్తున్నారా అని అడిగారు. అవును బిగ్ బాస్ నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ తన వెర్షన్ తను చెప్పుకొచ్చింది. అలానే నేను షుగర్ కోటెడ్ గా లేకుండా బయట ఎలా ఉంటానో అలానే ఉంటాను అంటూ చెప్పింది.
బిగ్ బాస్ సంజన చెప్పిన ఆన్సర్ కి బహుశా ఇంప్రెస్ అవడం వలన తనకు కెప్టెన్ ఎంచుకునే బాధ్యతను ఇచ్చారు. అలానే ఒక ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఆ ఫైవ్ మెంబర్స్ లో తనను కూడా సెలెక్ట్ చేసుకుంది సంజన (Sanjana Garlani) . ఆ తర్వాత డిమాన్ పవన్ (demon Pawan), హరీష్ (mask man Harish), ఇమ్మానుయేల్ (Immanuel), సృష్టి వర్మ (Srishti Verma) ను కెప్టెన్ గా అనుకుంటున్నాను అని చెప్పింది.
ఇదే విషయాన్ని హౌస్ మేక్స్ కి చెప్పినప్పుడు అందరూ సైలెంట్ గా వింటున్నారు. ఆ తరుణంలో ఒక్కసారిగా దమ్ము శ్రీజ (dhammu sreeja) నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు వాళ్లే ఎందుకు అనిపించారు అని కన్ఫెక్షన్ రూమ్ లో ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడేసింది. ఇలాంటి సందర్భాలు దమ్ము శ్రీజ నుంచి కోకొల్లలు ఉన్నాయి.
Also Read : Prabhas in Mirai : మిరాయ్ లో ప్రభాస్? రెబల్ సర్ప్రైజ్ మిస్ అవ్వకండి