Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. ఒక త్రిల్లర్ సినిమా చూసినప్పుడు వచ్చి థ్రిల్లింగ్ లా అనిపిస్తుంది. ఈ సోలో ట్విస్టుల మీద ట్విస్టులు దర్శనమిస్తున్నాయి. ఒక్కొక్కటిగా అందరు వ్యక్తిత్వాలు బయటపడుతున్నాయి. కొంతమంది తెలిసిన సెలబ్రిటీస్ లోని ఎప్పుడూ చూడని మరో మనిషి బయటకు వస్తున్నాడు.
ఇక బిగ్ బాస్ సీజన్ డే ఫోర్ స్టార్ట్ అయిపోయింది. కాసేపట్లో ఆ కంప్లీట్ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కి రానుంది. ఈ తరుణంలో ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో మనీష్ మరియు ఇమ్మానుయేల్ మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. అయితే దీనిలో ఎవరిది తప్పు అని ఎపిసోడ్ చెప్పలేము.
బిగ్ బాస్ మొదటి కెప్టెన్ ని నిర్ణయించడానికి ఒక టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ కు వదలకు బెదరకు అనే పేరు కూడా పెట్టారు. ఈ టాస్క్ లో కాంటెండర్స్ తరఫున సపోటర్స్ ఆడవలసి వచ్చింది. కంటెండర్ సంజనకు సపోర్టుగా దమ్ము శ్రీజ. హరీష్ కి సపోర్టుగా రాము రాథోడ్. ఇమ్మానియేల్ తరఫున భరణి ఆడారు. కొంత ఎత్తులో ఉన్న సపోర్టర్స్ కాళ్లు నేలను తాకినట్లయితే కెప్టెన్సీ నుంచి ఎలిమినేట్ అయినట్లే. రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆ ప్లేస్ కి వచ్చి, గ్రీన్ లైట్ రాకముందు ఆ సపోర్టర్ ని కిందకి దించే ప్రయత్నం కంటెండర్స్ చేయాల్సి ఉంది.
ఈ తరుణంలో ఇమ్మానుయేల్ ఒక సపోటర్ కిందకు దించే ప్రయత్నం చేశాడు. కానీ గ్రీన్ లైట్ రాకముందే అలా తీయడంతో సంచాలకు మనీష్ దానిని గుర్తు చేశాడు. ఇక్కడితో సారీ చెప్పాడు ఇమ్మానుయేల్. మనీష్ వెంటనే ఇమ్మానుయేల్ టీం ఎలిమినేషన్ అన్నాడు. ఇక్కడితో వీళ్ళిద్దరికీ విపరీతమైన ఆర్గ్యుమెంట్ మొదలైంది. ఆ ఆర్గ్యుమెంట్ దాదాపు ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వెళ్లిపోయింది అనుకోవడంలో కూడా తప్పులేదు. కేవలం అందరూ చూస్తున్న బిగ్ బాస్ షో కాబట్టి ఆగారు అనిపించింది.