Bigg Boss 9 Telugu:బిగ్ బాస్ (Bigg Boss).. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో.. ఇప్పుడు కొత్త సీజన్ ప్రారంభం అయింది. 8 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్.. ఇప్పుడు తొమ్మిదవ సీజన్ కూడా ప్రారంభం అయింది. ఎప్పటిలాగే కింగ్ నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అటు సోషల్ మీడియా, ఇటు యూట్యూబ్, సినిమాల ద్వారా పాపులారిటీ అందుకున్న 9 మంది సెలబ్రిటీలను ఎంపిక చేసిన నిర్వాహకులు.. కామన్ మ్యాన్ క్యాటగిరిలో సామాన్య ప్రజల నుంచి 6 మందిని హౌస్ లోకి ఆహ్వానించారు. ఇక వీరి మధ్య ఇప్పుడు భీకర పోటీ మొదలైందని చెప్పవచ్చు.
మొదటివారంలో భాగంగా అప్పుడే మొదటి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవగా.. దాదాపు 9 మంది నామినేట్ అయ్యారు. అందులో 8 మంది సెలబ్రిటీలు.. ఒక కామన్ మ్యాన్ నామినేట్ అవ్వడం జరిగింది. గత మూడు రోజులుగా హౌస్ లో సెలబ్రిటీలు, కామనర్స్ మధ్య హీట్ పుట్టిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు తాజాగా నాల్గవ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయడంతో.. ఇందులో గొడవలే కాదు నవ్వులు కూడా ఉంటాయని నిరూపించారు.
also read:Allu -Mega: హమ్మయ్య.. వార్ ముగిసినట్టేనా.. కలిసిపోతున్న అల్లు- మెగా కుటుంబాలు.. ఇదిగో సాక్ష్యం!
ఫోర్త్ ఎపిసోడ్.. మొదటి ప్రోమో రిలీజ్..
తాజాగా విడుదల చేసిన ప్రోమో విషయానికి వస్తే.. పవన్ , రీతు చౌదరి కిచెన్ లో పాత్రలు శుభ్రం చేస్తూ ఉండగా.. రీతు చౌదరి ఒక కడాయిని శుభ్రంగా కడిగి.. చూడు మీ మొఖం ఇందులో ఎంత చక్కగా కనిపిస్తుందో అంటూ కామెంట్లు చేసింది.. ఆ తర్వాత హరిత హరీష్ వచ్చి మీరు ఫ్లోరా గారు ఇచ్చిన ఐబ్రోస్ పెన్సిల్ తీసుకున్నారా? అని అడగగా.. నేను మనుషుల మనసులను దోచుకుంటాను.. కానీ మనుషుల వస్తువులను కాదు అంటూ కామెంట్లు చేసింది. ఆ తర్వాత.. జబర్దస్త్ హౌస్ లో తన కామెడీతో ప్రేక్షకులను అలరించిన ఇమ్మానుయేల్ ఇప్పుడు హౌస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ కూడా ఆయన తన మార్క్ చూపించే ప్రయత్నం చేశారు. లేడీ గెటప్లో కనిపించి హౌస్ లో నవ్వుల వాతావరణాన్ని క్రియేట్ చేశారు.
లేడీ గెటప్ లో ఆకట్టుకున్న ఇమ్మానుయేల్..
“హాయ్ గాయ్స్ షాక్ అయ్యారా?” అంటూ హౌస్ లోకి అడుగుపెట్టిన ఇమ్మానుయేల్.. తల పైన పువ్వులు పెట్టుకొని నా పేరు సు అంటూ తెలిపారు. నేను ఎర్లీ మార్నింగ్ జుట్టుకి లెమన్ వాటర్ తీసుకుంటాను అంటూ అమ్మాయిలా మాట్లాడుతూ హౌస్ లో నవ్వులు క్రియేట్ చేశారు. మధ్యలో దమ్ము శ్రీజ కలుగ చేసుకుని.. మీ ఆయన ఏదో నీతో మాట్లాడుతారంట అంటూ కామెంట్ చేయగా.. మా ఆయన నచ్చాడా అంటే హూ అని మాత్రమే చెబుతాడు అంటూ కామెడీ చేశారు. అలా హౌస్ లో మొత్తానికి నవ్వుల వాతావరణాన్ని సృష్టించేశారు రీతూ – ఇమ్మాను యేల్. ఏది ఏమైనా ఇన్ని రోజులు గొడవపడ్డ వీరు ఇలా ఒక్కసారిగా నవ్వుతూ కనిపించేసరికి బిగ్ బాస్ మరింత ఆసక్తిగా మారింది అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.