చరిత్రలోనే తొలిసారిగా బంగారం ధర అన్ని రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు దూసుకుని వెళ్తోంది. గతంలో ఎప్పుడు కూడా బంగారం ధర ఈ రేంజ్ లో పెరగలేదు. బంగారం ధర పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొంటున్న పరిస్థితులు ఒక కారణంగా చెప్పవచ్చు.
ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రపంచ ఆర్థిక మార్కెట్లు అన్నీ కూడా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంగా గడచిన కొంతకాలంగా ఎదుగుతూ వస్తోంది. బంగారంపై పెట్టుబడును ఏ స్థాయిలో పెరిగిపోయాయి అంటే, ఏకంగా అమెరికా డాలర్ ను సైతం వెనక్కు తోసి, పలు దేశాల సెంట్రల్ బ్యాంక్ రిజర్వులు బంగారం నిల్వలను నిరంతరం పెంచుకుంటున్నాయి.
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చి చూసినట్లయితే బంగారం వాడకం అనేది భారతీయులలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే భారతీయులు ఎక్కువగా బంగారం ఆభరణాలను ధరించేందుకు ఇష్టపడుతుంటారు. మనదేశంలో బంగారం అనేది ఒక సంస్కృతిలో భాగం అని చెప్పవచ్చు. బంగారం లేకుండా ఏ శుభకార్యం కానీ, ఏ పండగ కానీ జరగదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా వివాహాది మహోత్సవాల్లో బంగారం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
భారతీయులు కొంత భాగం ప్రతి సంవత్సరం బంగారం కొనుగోలు చేయడానికి వెచ్చిస్తుంటారు. అందుకే బంగారం అనేది భారతీయులకు ఒక పెద్ద వ్యవహారంగా చెప్పవచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగిపోయినప్పటికీ, భారతదేశంలో పోల్చి చూస్తే ఇతర దేశాల్లో బంగారం ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశంలో బంగారు ఆభరణాలపై దిగుమతి సుంకం కాస్త ఎక్కువగా ఉంటుంది. గతంలో దిగుమతి సుంకం దాదాపు 10 నుంచి 15% మధ్యలో ఉండేది. ప్రస్తుతం ఈ మొత్తాన్ని దాదాపు 6 శాతానికి తగ్గించారు. అయినప్పటికీ ఇతర దేశాలతో పోల్చి చూస్తే స్థానిక పన్నులు కలుపుకొని చూసినట్లయితే మన దేశంలో బంగారు ఆభరణాల ధరలు ఇతర దేశాలతో పోల్చి చూస్తే ఎక్కువే అని చెప్పవచ్చు.
అయితే భారతదేశంలో పోల్చి చూస్తే అమెరికాలో బంగారం ధర తక్కువే. ఉదాహరణకు బంగారం ధర సెప్టెంబర్ 11వ తేదీ, 2025న అమెరికాలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 94,000 రూపాయలు ఉంటే, అదే సమయంలో మన దేశంలో రూ. 1 లక్ష పైనే పలుకుతోంది. ఈ నేపథ్యంలో భారత దేశంలో కన్నా అమెరికాలో బంగారు ఆభరణాల ధరలు చవక అని చెప్పవచ్చు.
అయితే అమెరికాలో బంగారం ఆభరణాల ధర తక్కువగా ఉంది కదా అని ఎంత పడితే అంత బంగారం అమెరికా నుంచి భారతదేశానికి తెచ్చుకోలేము. అందుకు కస్టమ్స్ నిబంధనలు ఒప్పుకోవు. . అమెరికా నుంచి భారతదేశానికి బంగారాభరణాలను డ్యూటీ ఫ్రీ రూపంలో తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీనికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి.
ఉదాహరణకు పురుషులు 50 వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను తెచ్చుకోవడానికి డ్యూటీ ఫ్రీ లిమిట్ ఉంది. అదే సమయంలో మహిళలు ఒక లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలను డ్యూటీ ఫ్రీ రూపంలో తెచ్చుకోవచ్చు. ఈ లిమిట్ దాటినట్లయితే కస్టమ్స్ శాఖ వారు మీ మొత్తం బంగారం విలువ పైన పన్ను విధిస్తారు. అయితే ఇందులో బంగారం కాయిన్లు, బంగారం బార్లు, ఇతర 24 క్యారెట్ల బంగారు కడ్డీలు వంటివి తెచ్చుకోవడానికి వీలు లేదు.