BigTV English

Bigg Boss 9 Sanjana : సంజనా ఓ కట్లపాము.. ఓ నాగుపాము… మూడు రోజుల్లో ఆమెలో ఇది గమనించారా ?

Bigg Boss 9 Sanjana : సంజనా ఓ కట్లపాము.. ఓ నాగుపాము… మూడు రోజుల్లో ఆమెలో ఇది గమనించారా ?

Bigg Boss 9 Sanjana : మహేష్ బాబు నటించిన త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అతడు సినిమాలో త్రిష బ్రహ్మానందంతో ఉంటుంది వాడు మామూలోడు కాదు బాబాయ్ “వాడు కాశీతాడు లా కనిపించే కట్లపాము, నైలాన్ తాడులా కనిపించే నాగుపాము అని” కనిపించడానికి సాఫ్ట్ గా ఉన్నాడు కానీ వాడి వెనక ఏదో తెలియని బ్యాక్ గ్రౌండ్ ఉంది. అనేది బహుశా ఆ డైలాగ్ ఉద్దేశం కావచ్చు. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ సంజనాను చూస్తే ఈ డైలాగ్ గుర్తొస్తుంది.


బిగ్ బాస్ సీజన్ 9 కి ఎంట్రీ ఇవ్వగానే తనలోని మహానటిని బయటకు తీసింది. ఏమీ తెలియనట్లు ఉంటూ అందరినీ ఒక ఆటాడిస్తూ రియల్ గేమర్ అనిపించుకుంటుంది. ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఆమె ప్రవర్తించిన తీరు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొదటిరోజు ఫ్లోరా సైని వచ్చి వాష్ రూమ్ లో ఉన్న షాంపూ, కండిషనర్ ఎవరివి అనగానే తనవే అని చెప్పింది సంజన.

అప్పుడు దమ్ము శ్రీజ మీరు అలా పెట్టడం వలన ప్రతి ఒక్కరూ అలా పెడతారు అది కరెక్ట్ కాదు అంటూ మొదలుపెట్టింది. అవి అక్కడే ఉండాలి అని సంజన ఆర్గ్యుమెంట్ చేసింది. అక్కడితో మొదలైన వివాదం అందరిని ఒక ఆట ఆడించింది. హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా సంజనకు ఎదురు తిరిగి ఆరోజు మాట్లాడారు. ఈమె ఫుటేజ్ కోసం ట్రై చేస్తుంది అనే కామెంట్స్ కూడా అక్కడ చేశారు. నేను ఫుటేజ్ కోసం ట్రై చేస్తున్నానా అంటూ బాధపడింది.


గుడ్డు కోసం గొడవ 

నాలుగు గుడ్లు ఉండాల్సిన చోట కేవలం మూడు గుడ్లు మాత్రమే ఉన్నాయి. ఒక గుడ్డు ఎవరు తిన్నారు అంటూ అన్వేషణ మొదలైంది. చాలా లైట్ గా ఆ గుడ్డు తనే తిన్నట్లు క్లారిటీ ఇచ్చింది సంజన. అక్కడితో మళ్ళీ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పుడు హౌస్ లో మూడో రోజు ఆవిడ ఏం చేస్తుందో అని అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ మొదలైంది. ఆవిడ గుడ్డు తినడం వల్ల హౌస్ లో ప్రతి ఒక్కరు క్యారెక్టర్లు కూడా బయటపడిపోయాయి. ఒకరి మీద ఒకరు విపరీతంగా అరుచుకున్నారు.

సింపతి కూడా ప్లే చేస్తుంది 

గుడ్డు కోసం ఆర్గుమెంటు తారస్థాయికి వెళ్ళిపోయిన తరుణంలో, సంజన మాట్లాడుతూ నేను ఫుటేజ్ కోసం ట్రై చేస్తున్న అంటున్నారు. అసలు నేను ఎంత బాధలో ఉన్నానో తెలుసా. నా మీద ఉన్న కేసు కూడా అనవసరంగా వచ్చింది. దాని గురించి రోజు నేను నా బెడ్ పైన ఏడుస్తూనే ఉన్నాను అంటూ సింపతీ డ్రామా కూడా మొదలుపెట్టింది. ఏదేమైనా ఒకే ఒక పనితో అందరినీ ఇబ్బంది పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఈమె గేమ్ ప్లాన్ చేస్తుంటే కచ్చితంగా కెప్టెన్ అవుతుంది అనిపిస్తుంది.

Also Read : Bigg Boss 9 : మిషన్ సక్సెస్… సెలబ్రెటీస్ మధ్య సక్సెస్ ఫుల్ గా చిచ్చు పెట్టిన దమ్ము శ్రీజ

Related News

Bigg Boss 9: ఇమ్మానుయేల్ ఎలిమినేషన్? ఇదెక్కడి ట్విస్ట్?

Bigg Boss Telugu 9 Promo: ప్రియ వర్సెస్‌ మనీష్‌.. హౌజ్‌లో సంజనకు కంప్లీట్‌ నో ఎంట్రీ.. ప్రియ సపోర్ట్.. మనీష్ ఫైర్..

Bigg Boss 9 Telugu: ఇమ్మూ గెటప్ అదుర్స్.. గొడవల మధ్య నవ్వుల వాతావరణం!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 9 ఫస్ట్ కెప్టెన్… సంజనా గల్రానీ

Big Boss 9 Telugu : శ్రేష్టి వర్మకు షాకింగ్ ఓటింగ్… మొదటి వారమే హౌస్‌ నుంచి అవుట్ ?

Big Stories

×