Bigg Boss Telugu 9: బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి బిగ్ బాస్ సీజన్ 9 ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. ఇప్పటివరకు ఎనిమిది సీజన్లు పూర్తి కాగా ఇప్పుడు 9వ సీజన్ కూడా చాలా గ్రాండ్ ప్రారంభం అయింది. ఎప్పటిలాగే నాగార్జున (Nagarjuna )హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈసారి సినిమా సెలబ్రిటీలను చాలా తక్కువ మందిని తీసుకున్నట్లు తెలుస్తోంది. 6 మంది కామన్ మ్యాన్ క్యాటగిరిలో హౌస్ లోకి అడుగుపెట్టగా.. మరి కొంతమంది బుల్లితెర, సోషల్ మీడియా , యూట్యూబ్ లో పాపులారిటీ సంపాదించుకున్న వారిని హౌస్ లోకి తీసుకున్నారు. ఒకరిద్దరూ సినిమా వాళ్లు హౌస్ లోకి అడుగుపెట్టారు. అందులో భాగంగానే జానపద కళాకారుడికి కూడా ఈసారి హౌస్ లోకి అవకాశం కల్పించడం జరిగింది.
తన గాత్రంతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రాము రాథోడ్ (Ramu Rathod) కూడా హౌస్ లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అంటూ పలు విషయాలు వైరల్ గా మారగా.. తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన తెలుగు జానపద పాటల గాయకుడు. జానపద కళలకు ప్రాధాన్యతనిస్తూ వాటిని ఆధునికరించడానికి కృషి చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని యూట్యూబ్లో క్రియేట్ చేసుకున్నారు. అతి తక్కువ సమయంలోనే రికార్డులను బ్రేక్ చేశారు.
ఎవరీ రాము రాథోడ్?
బంజారా లంబాడి గిరిజన జానపద గాయకుడిగా పేరు తెచ్చుకున్న కిషన్ నాయక్, కమలాబాయి దంపతులకు ఐదో సంతానం. చిన్నప్పటినుంచి టేప్ రికార్డర్ పాటలపై నృత్యం చేసేవాడు. డిగ్రీ వరకు తన విద్యను పూర్తి చేసిన ఈయన.. తాండాలో జరిగే పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొని డాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అటు స్కూల్లో జరిగే సాంస్కృతిక కార్యకలాపాల్లో కూడా డాన్స్ తో అందరినీ ఆకట్టుకునేవారట. ప్రజాకవి గోరటి వెంకన్న పాటలు, మాటలకు ఆకర్షితులై ఆయన స్ఫూర్తితోనే రచయితగా, గాయకుడిగా మారాడు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాటలు , నృత్యాలతో ఎన్నో వేదికలు పంచుకున్న రాము అందర్నీ ఆకట్టుకున్నారు.
రాను బొంబాయి కి రాను పాటతో కోటి నజరానా..
ఈయన పాడిన “రాను బొంబాయి కి రాను” పాట ఇటీవల యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట ఫోక్ ఇండస్ట్రీని షేక్ చేసింది. అంతేకాదు ఈ పాటకు యూట్యూబ్ నుంచి ఏకంగా కోటి రూపాయలు లభించాయి. దీంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈయన పేరు బాగా వినిపిస్తోంది. అంతేకాదు ఈ ఒక్క పాటతో దేశవ్యాప్తంగా కూడా పాపులారిటీ అందుకున్నారు. “సొమ్మసిల్లి పోతున్నావే ఓ చిన్న రాములమ్మ” అనే పాటను కూడా స్వయంగా రచించి, పాడాడు కూడా.. ఈ పాటకు 29 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు ఈ పాటను ‘మజాకా’ సినిమాలో రీ క్రియేట్ కూడా చేయడం జరిగింది. తన అద్భుతమైన టాలెంట్ తో అందరినీ అబ్బురపరిచిన రాము రాథోడ్ ఇప్పుడు హౌస్ లో.. ఎలా బిగ్ బాస్ పెట్టే టాస్కులు నెగ్గి ప్రేక్షక ఆదరణ పొందుతారో చూడాలి.
ALSO READ:Bigg Boss 9 Telugu: ఎన్నో అవమానాలు, హేళనలు.. కట్ చేస్తే.. టాప్ స్టేజ్.. ఇమ్మూ బ్యాక్ గ్రౌండ్ ఇదే!