Bigg Boss 8 Telugu : తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 మరో రెండు వారాల్లో ముగియనుంది.. ఈ క్రమంలో 12 వారం నామినేషన్స్ ఆసక్తిగా మారాయి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఫైనల్ గా విన్నర్ ఎవరు అవుతారు అనేది ఆసక్తిగా మారింది.. అయితే హౌస్ లో పదకొండొవ వారంలో నో ఎలిమినేషన్ కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఓ వార్త షికారు చేస్తుంది. ఈవారంలో నామినేషన్స్‌లో ఉన్న ఐదుగురిలో ఒక్క నబీల్ మినహా.. మిగిలిన నలుగురూ కూడా కన్నడ వాళ్లే. అందులోనూ నిఖిల్, యష్మీ, పృథ్వీ, ప్రేరణ లాంటి యమా డేంజర్ కంటెస్టెంట్స్ ఒకేసారి నామినేషన్స్‌లోకి వచ్చారు. అయితే నిఖిల్ నామినేషన్స్‌లో ఉన్నాడంటే.. అతని ఓటింగ్‌కి ఢోకా ఉండదు. గురువారం వరకూ అతని హవా నడిచింది. శుక్రవారం నుంచి అతని గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. వీకెండ్ వచ్చేసరికి హౌస్ లో ఓటింగ్ తారుమారు అవుతున్నాయి. ఇపుడు కూడా నిఖిల్ డేంజర్ లో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. డేంజర్లో ఉన్న ఆ ఇద్దరు ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఇప్పటివరకు బిగ్ బాస్ లో జరిగిన నామినేషన్స్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు 12వ వారం నామినేషన్స్‌తో ఈవారం ఆట మరో లెక్క అనేట్టుగానే సాగింది. ముఖ్యంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేయడంతో ఆట స్వరూపమే మారిపోయింది. ఈ 12వ వారం నామినేషన్స్‌లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉంటే.. హౌస్‌లో మొత్తం పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. కన్నడ వాళ్లు, తెలుగు వాళ్ళు ఈక్వెల్ గా ఉన్నారు. మరి హౌస్ నుంచి ఎవరు డబుల్ ఎలిమినేషన్ ఎవరో ఆసక్తిగా మారింది. ఇక ఈ పది మందిలో టాప్ 5కి వెళ్లేది ఐదుగురే కావడంతో.. ఫినాలే వీక్‌ని తీసేస్తే మిగిలిన మూడు వారాల్లో ఒక్కొక్కర్నీ కాకుండా ఇద్దరిద్దర్ని ఎలిమినేట్ చేస్తేనే హౌస్‌లో టాప్ 5 బెర్త్‌లు ఉంటాయి. ఎలాగూ.. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ లాంటివి బిగ్ బాస్ హిస్టరీలో లేవు కాబట్టి.. ఖచ్చితంగా ఫినాలే వీక్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే ఉండబోతున్నారు.
ఈ సందర్భంలో ఖచ్చితంగా ఈవారం డబుల్ ఎలిమినేషన్ పెడితేనే హౌస్ మేట్స్ తగ్గుతారని తెలుస్తుంది. 12,13 వారాలు డబుల్ ఎలిమినేషన్ జరిగితే టాప్ 5 మాత్రమే ఉంటారని బిగ్ బాస్ ఆలోచిస్తున్నారట.. ఈ వారం ఓటింగ్‌లో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. నిఖిల్, నబీల్, పృథ్వీ, ప్రేరణ, యష్మీ.. ఈ ఐదుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. వీళ్లలో ఒక్క నబీల్ తప్ప మిగిలిన వారంతా కన్నడ బ్యాచ్.. ఈ వారం యష్మీ, పృథ్వి ఇద్దరు బ్యాగ్ సర్దుకొని బయటకు వెళ్ళాల్సిందే అని తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ మరో ఇద్దరు వెళ్లక తప్పదు. చూద్దాం వీకెండ్ ఎపిసోడ్ లో ఏదైనా జరగొచ్చు.. ఎవరైనా ఇంటికి వెళ్లిపోవచ్చు.. ఇక ఇప్పటికే విన్నర్ నబీల్ అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..