BigTV English

Sonia Akula Engagement : బిగ్ బాస్ బ్యూటీ సోనియా ఎంగేజ్మెంట్ ఫోటోలు.. పెళ్లి ఎప్పుడంటే?

Sonia Akula Engagement : బిగ్ బాస్ బ్యూటీ సోనియా ఎంగేజ్మెంట్ ఫోటోలు.. పెళ్లి ఎప్పుడంటే?

Sonia Akula Engagement : బిగ్ బాస్ హాట్ బ్యూటీ సోనియా ఆకుల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు… బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో పాల్గొన్న ఈ అమ్మడు హౌస్ ఓ బాగానే ఆడింది. తన ఆటతో పాటతో హౌస్ లో ఉన్నన్ని రోజులు బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా చిన్నోడు పెద్దోడు అని నడిపిన లవ్ ట్రాక్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఇక ఆమె హౌస్ ఉన్న తీరు పై ఆడియన్స్ కు కోపం రావడంతో ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆమె చెప్పిన ఇంటర్వ్యూ లు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు.. ఇక బిగ్ బాస్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పి అందరికి షాకిచ్చింది. ఇక తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎంగేజ్మెంట్ ఫోటోలు సైతం వైరల్ అవుతున్నాయి.


ఈ నెల 21 గురువారం నాడు వీరి వివాహ నిశ్చితార్థం బంధువులు, స్నేహితుల సమక్షంలో జరిగినట్టు తెలుస్తోంది. అయితే వీరి వివాహ నిశ్చితార్ధానికి సంబంధించిన ఫొటోలు కానీ.. వీడియోలో కానీ వారి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయకపోవడంతో.. అసలు ఇది రియలా ఫేక్‌నా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక యష్, సోనియాలకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయ్యింది. డిసెంబర్ నెలలో ముహూర్తం. నిజానికి బిగ్ బాస్‌కి వెళ్లకుండా ఉంటే వీరి లగ్గం అయ్యిపోయింది కూడా. అయితే, సడెన్‌గా సోనియా ఆకులకు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో.. డిసెంబర్‌ని కళ్యాణ గడియను మార్చుకున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ హడావిడి అయిపోవడంతో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తుంది.

యష్ గురించి సోనియా ఆల్రెడీ బిగ్ బాస్ లో చెప్పేసింది. అతనికి ఆల్రెడీ పెళ్లయిందని విడాకులు తీసుకున్నాడని చెప్పింది. పిల్లలు కూడా ఉన్నారు. అయితే సోనియాతో పరిచయం తరువాత.. భార్యకి విడాకులు ఇచ్చాడనే విషయం బయటకు వచ్చింది. ఇక మొత్తానికి వారిద్దరూ ఇష్ట పడి పెళ్లి చేసుకుంటున్నారు. నెగిటివిటీతోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ప్రతి సీజన్‌లో బిగ్ బాస్ ఆటకి బలై.. క్యారెక్టర్‌ని కోల్పోయే కంటెస్టెంట్స్ ఒకరిద్దరు ఉంటాడు. అలా ఈ సీజన్‌లో బిగ్ బాస్ ఆటకి బలైంది సోనియా. అయితే హౌస్‌లో ఉన్నప్పుడు నిఖిల్‌తో చాలా క్లోజ్‌గా ఉన్న సోనియా.. బయటకు వచ్చిన తరువాత అతని నిజస్వరూపాన్ని తెలుసుకుని.. 12వ వారం నామినేషన్స్‌లో భాగంగా హౌస్‌లోకి వెళ్లి మరీ అతని బండారం మొత్తం బయటపెట్టేసింది.. అంతేకాదు ఆమె యష్మీకి హాయ్. జాగ్రత్త అని కూడా చెప్పింది. ఇక వీరిద్దరి పెళ్లి వచ్చే నెల 14 న జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలియాలి.. ఏది ఏమైనా ఆమె పై వస్తున్న రూమర్స్ కు చెక్ పెడుతూ పెళ్లి చేసుకోవడం విశేషం..


Tags

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×