BigTV English

Mahesh Babu : ఇదేం క్రేజ్ సామి.. బిగ్ బాస్ లో మహేష్ బాబు పై ప్రశంసలు..

Mahesh Babu : ఇదేం క్రేజ్ సామి.. బిగ్ బాస్ లో మహేష్ బాబు పై ప్రశంసలు..

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. ఇప్పుడు నార్త్ లో కూడా ఆయన పేరు తెగ వినిపిస్తుంది. అదేంటి మహేష్ నటించిన సినిమాలు హిందీలో రిలీజ్ కాలేదు కదా అనే సందేహం రావొచ్చు. అవును ఆయన సినిమాలు కాదు. బాలీవుడ్ బిగ్ బాస్ హౌస్ లో మహేష్ మాట వినిపించడం విశేషం.. అందుకు కారణం ఆయన మరదలే అని తెలుస్తుంది. మహేష్ బాబు మరదలు, నమ్రత శిరోద్కర్ సోదరి శిల్ప శిరోద్కర్ కూడా గతంలో హీరోయిన్ గా సినిమాలు చేసింది. ప్రస్తుతం అడపాదడపా టీవీ షోలు, సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తుంది.. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇటీవల నమ్రత కూడా తన చెల్లికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓ పోస్ట్ కూడా చేసింది.. ఇక ఇప్పుడేమో మహేష్ బాబు మాట సల్మాన్ ఖాన్ వెంట వినిపించడం విశేషం..


హిందీలో బిగ్ బాస్ 18 సీజన్ ప్రసారం అవుతుంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఎపిసోడ్ లో శిల్ప శిరోద్కర్ తో మాట్లాడుతూ సల్మాన్ మహేష్ బాబు ప్రస్తావన తీసుకువచ్చారు. సల్మాన్ ఖాన్ శిల్పతో మాట్లాడుతూ.. శిల్ప మీ బావ మహేష్ బాబు స్క్రీన్ మీద స్టైల్, యాక్షన్, యాటిట్యూడ్ లుక్ తో ఉంటాడు. కానీ బయట రియల్ లైఫ్ లో మాత్రం సింపుల్ గా ఫ్యామిలీ మ్యాన్ లా ఉంటాడు అంటూ సూపర్ స్టార్ పై ప్రశంసలు కురిపించారు. మహేష్ బాబును అంత పెద్ద షోలో పొగడటం పై ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతుంది.

ఇక మహేష్ బాబు రియల్ లైఫ్ విషయానికొస్తే.. సల్మాన్ ఖాన్ చెప్పినట్లు అన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా చాలా సింపుల్ గా ఉంటాడు. బయట ఎక్కడ కనిపించినా ఆయన సింపుల్ లుక్ చూసి ఫ్యాన్స్ సంబరిపడిపోతారు. ఇక ఆయన సినిమాల సెలెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య వచ్చిన ప్రతి సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ షేక్ అయ్యే కలెక్షన్స్ ను అందుకున్నాయి.. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కథ పూర్తి అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్.. ఈ మూవీ కోసం మహేష్ బాబు తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారు. గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు. యోధుడుగా కనిపిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి..


Related News

Bigg Boss Buzzz Srija : నేను గ్రూపు దగ్గర కూర్చుంటే వాళ్ళు లేచి వెళ్ళిపోయే వాళ్ళు, ప్లాన్డ్ గా లవ్ యాంగిల్ నడిపాడు

Bigg Boss 9 Wild Card : తమిళ్ బిగ్ బాస్ లో 65 రోజులు ఉన్నా, ఈ లోపు నా బాయ్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయితో…

Bigg Boss 9 Wild Card : బిగ్ బాస్ లోకి దువ్వాడ మాధురి. షాక్ అయిన హౌస్ మేట్స్, శ్రీజ తో ఆర్గ్యుమెంట్ మొదలు 

Bigg Boss 9 : మైండ్ చెదిరిపోయే ట్విస్టులు, డబుల్ ఎలిమినేషన్స్, వైల్డ్ ఫైర్ వైల్డ్ కార్డు ఎంట్రీస్

Bigg Boss 9 Wild Card : బిగ్ బాస్ హౌస్ లోకి నాగార్జున ఫ్యామిలీ మెంబర్? ఇదెక్కడి ట్విస్ట్?

Bigg Boss 9 wild Card: వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా పచ్చళ్ళ పాప.. హౌస్ లోకి అడుగుపెట్టగానే రచ్చ!

Bigg Boss 9 Elimination :ఈ వారం డబుల్ ఎలిమినేషన్… ఫస్ట్ బయటకు వచ్చింది ఎవరంటే?

Justice For Srija Dammu : శ్రీజ దమ్ము ఎలిమినేట్, హౌస్ లో ఉండాలి అంటూ నెటిజెన్స్

Big Stories

×