Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ లో ఒకరు సంజన గర్లాని. బుజ్జిగాడు (Prabhas bujjigadu) సినిమాలో త్రిష (Trisha Krishnan) చెల్లిగా కనిపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంది. కొంతకాలం తర్వాత ఈమె డ్రగ్స్ కేసులో కూడా ఇరుక్కున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కొంతమంది అది వాస్తవం అని కూడా అంటుంటారు. ఇక బిగ్ బాస్ 9 లో ఈవిడ మొదటి వారమే ఎలిమినేషన్ అయిపోతుంది అని కొందరు అనుకున్నారు. కంటెస్టెంట్ మనీష్ కూడా అదే ఆలోచనలో ఉండేవాడు. కానీ ప్రియా శెట్టి అలా జరగదు అని మనీష్ కి చెప్పింది.
కొన్ని సంభాషణలు బట్టి సిచువేషన్ బట్టి కొన్ని మాటలకు అర్ధాలు మారిపోతుంటాయి. అందుకనే ఒక మాట మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడుతుండాలి. ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా విపరీతంగా సంజనాను ట్రోల్ చేస్తున్నారు. కెప్టెన్ అయ్యేటప్పుడు ఒక లెటర్ ను తెలుగులో చదివింది సంజన. ఆ చదువుతున్నప్పుడు కూడా చాలా బూతులు వినిపించాయి. అలానే ఇమ్మానుయేల్ తుడుస్తున్నప్పుడు… సంజన ఇమ్మానియేల్ తో మాట్లాడిన విధానం కూడా మంచి కామెడీగా అనిపించింది. తనకు తెలియకుండానే కొన్ని బూతులు మాట్లాడేస్తుంది. వాస్తవానికి అవి బూతులు కూడా కాదు కానీ సోషల్ మీడియాలో అలా అర్థమవుతున్నాయి.
ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గుండె అంకుల్ అనే టాపిక్ మళ్ళీ ప్రస్తావించారు నాగార్జున. గుండు అంకుల్ అనేది కామెడీ అని మీకు అనిపించకపోతే. రెడ్ ఫ్లవర్ అని ఇమ్మానుయేల్ (Emmanuel) ని ఎందుకు అన్నారు అని హరీష్ (mask man Harish) ని క్వశ్చన్ చేశారు నాగార్జున. అలానే వీడియో కూడా ప్లే చేసి చూపించారు.
అయితే రెడ్ ఫ్లవర్ అనేదాన్ని దేనికి వాడుతారో తెలుసా అంటూ నాగార్జున చాలా సీరియస్ గా క్వశ్చన్ చేశారు. రెడ్ ఫ్లవర్ అనే పదాన్ని ఈ మధ్యకాలంలో దేనికి వాడుతున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నాగార్జున (Nagarjuna Akkineni) అంత సీరియస్ సిచువేషన్ లో అడుగుతుంటే, మరోవైపు నుంచి సంజన (Sanjana garlani) ప్రపోజల్ కి వాడుతారు అంటూ ఆన్సర్ ఇచ్చింది. వెంటనే హౌస్ మేట్స్ అందరూ తనని చిన్నగా మందలించారు. అయితే కొంతసేపటి తర్వాత కూడా అది డబుల్ మీనింగ్ అని సంజన మాట్లాడటం ఆశ్చర్యం. మొత్తానికి సీరియస్ సిచువేషన్ లో కూడా తెలియకుండా చేస్తున్న కామెడీ కొంతమంది వీక్షకులకు ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తుంది.
Also Read : Bigg Boss 9 : అందరి బాక్సులు బద్దలు, దుమ్ము దులిపేసిన కింగ్ నాగార్జున