Bigg Boss 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొత్తానికి ఆరు రోజులు గడిచిపోయింది. ఈ ఆరు రోజుల్లో చాలా జరిగిపోయాయి. అయితే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకంటూ కొన్ని నిజాలు ఉంటాయి. అవన్నీ కూడా ఈరోజు ఎవరికి వారు కంటెస్టెంట్లు నాగార్జున దగ్గర చెప్పుకున్నారు. అయితే ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అనిపించింది ఇంకొకరికి రాంగ్ అనిపిస్తుంది. ఇంకొకరికి రాంగ్ అనిపించింది వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్లకు కరెక్ట్ అనిపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ చూస్తే అర్థమయిపోతుంది. ఈరోజు ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన అంశాలను నాగార్జున లేవనెత్తారు.
ఫ్లోరా సైని ( flora saini) కి వాష్రూమ్స్ డ్యూటీ అప్పజెప్పిన సంగతి తెలిసిందే. వాష్రూమ్స్ లో షాంపూ మరియు కండిషన్స్ సంజన మర్చిపోయింది. అయితే దాని గురించి విపరీతమైన ఆర్గ్యుమెంట్ మొదలైంది. మొదట ఆ విషయాన్ని ప్రస్తావించారు నాగార్జున. అలానే ఫ్రీ బర్డ్, బ్యాక్ బిక్చింగ్ అనే పదాల గురించి కూడా మాట్లాడారు. సంజన తనను వల్గర్ మాటలు అన్నారు అంత సింపుల్ గా సారీ చెప్తే ఎలా అంటూ ఫ్లోరా సైనిని క్వశ్చన్ చేసింది. మొత్తానికి పెద్ద మనసు చేసుకొని క్షమించమని చెప్పిన నాగార్జున మాటతో సంజన కూల్ అయింది.
తనుజ (Bigg Boss Tanuja) కి మరియు రీతు చౌదరికి మధ్య టాస్క్ జరిగింది. ఆ టాస్క్ లో రీతు చౌదరి (Ritu Chaudhary) తలకు గాయమైంది. గాయమైనప్పుడు పట్టించుకోకుండా టాస్క్ ఫినిష్ చేసింది తనూజ. అయితే అది జరిగిన తర్వాత నామినేషన్ అప్పుడు ఈ టాపిక్ వచ్చింది. ఎలా జరిగింది అని తనుజ అడిగినందుకు రీతు విపరీతంగా ఫీల్ అయినట్లు ఆ నామినేషన్స్ డే రోజు అర్థమైంది. అదే విషయాన్ని నాగర్జున ప్రస్తావించారు. ఫైనల్ గా ఇద్దరికీ సర్ది చెప్పి వారిద్దరిని కలిపారు. అలానే తనుజ కిచెన్ డ్యూటీ గురించి కూడా వచ్చిన కంప్లైంట్స్ కు క్లారిటీ ఇచ్చారు.
ఇమ్మానుయేల్ ఒక టైం లో గుండు అంకుల్ అని హరీష్ ను పిలిచాడు. దానికి హరీష్ బాగా హర్ట్ అయిపోయాడు. దాని గురించి కూడా పదేపదే టాపిక్ నడిచింది. అయితే ఇమ్మానుయేల్ హరీష్ ను ఫన్నీ గానే పిలిచాను అని కింగ్ ముందు చెప్పాడు. అలానే హౌస్ మేట్స్ అందరూ కూడా ఫన్నీ గానే పిలిచాడు అనిపించింది అని ఒప్పుకున్నారు. అలానే చాలామంది ఆడియన్స్ కి కూడా అదే అనిపించింది అని కింగ్ నాగార్జున క్లారిటీ ఇచ్చారు.
అలానే భరణి, ఇమ్మానుయేల్ ని ఆడవాళ్ళతో పోల్చి, ఆడవాళ్లను తక్కువ చేశారు అనే వీడియోని ప్లే చేసి నాగార్జున ఈ అంశంపై క్వశ్చన్ చేశారు. రీతు వర్మ కాకుండా చాలామంది హౌస్ మేట్స్ ఆడవాళ్లను తక్కువ చేస్తూ స్టేట్మెంట్ పాస్ చేశారు అని హరీష్ కు నెగిటివ్ గా చేతులెత్తారు. మొత్తానికి హరీష్ (Harish Bigg Boss9) కి కూడా అన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చేశారు కింగ్ నాగార్జున.
ఒక కెప్టెన్ ఎన్నుకునే తరుణంలో కంటెండర్స్ కి మరియు సపోర్టర్స్ టాస్క్ జరిగింది. ఆ టాస్క్ లో ఇమ్మానుయేల్ కి మరియు మనీష్ కి మధ్య విపరీతమైన గొడవ నడిచింది. నువ్వు పెద్ద సంచాలక్ అంటూ ఆగ్రహంతో ఇమ్మానుయేల్ (Emmanuel) మనీష్ (Manish Bigg Boss) ని అన్నాడు. ఈ విషయంలో నాది కూడా కొంత మేరకు తప్పు ఉంది అని మనీష్ నాగర్జున ముందు ఒప్పుకున్నారు.
నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్లను నాగార్జున నిలబెట్టారు. అలానే సేఫ్ జోన్ లో ఉన్న తనుజను అనౌన్స్ చేశారు. ఆయన దగ్గర మిగిలిన బాక్సులు రేపు తెరుద్దాం అంటూ, రేపు కలుద్దాం అంటూ నాగ్ ఈరోజుకి టాటా చెప్పేసారు.
Also Read : Bigg Boss 9 : నేను తిట్టించుకోవడానికి రాలేదు, సంజన కుళాయి ఓపెన్ చేసింది