 
					Bigg Boss 9 Promo: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ.. మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోవడమే కాకుండా ఎంతో మంది సెలబ్రిటీలకు ఊహించని పాపులారిటీ అందిస్తోంది బిగ్ బాస్. భాషతో సంబంధం లేకుండా వివిధ భాషలలో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో.. ఇప్పుడు తెలుగులో 9వ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 7 వారాలు పూర్తికాగా.. 8 మంది ఎలిమినేట్ అయ్యారు. 9 మంది కంటెస్టెంట్స్,7 మంది కామర్నర్స్, 6 మంది వైల్డ్ కార్డు ఎంట్రీ లతో మొదలైన ఈ సీజన్లో మాజీ కంటెస్టెంట్ గా నిలిచిన భరణి , శ్రీజాలకు మళ్లీ అవకాశం కల్పించారు బిగ్ బాస్. అయితే ఇద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశం కల్పిస్తూ పలు టాస్కులు విధిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. తాజాగా 54వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో దివ్వెల మాధురి చేసిన పనికి ఇమ్మానుయేల్ ఇచ్చిన పనిష్మెంట్ చూసి ఆడియన్స్ షేమ్ లెస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకసారి కాదు రెండుసార్లు కాదు పదేపదే అలాంటి తప్పు చేయడంతో అసలు గేమ్ ఆడటానికి వచ్చావా లేక అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా బిగ్ బాస్ ఇచ్చిన టైమింగ్ లో తప్ప ఎప్పుడూ కూడా కంటెస్టెంట్స్ నిద్రపోకూడదు. అలర్ట్ గా ఉంటూ ఆడియన్స్ ను అలరించాలి. కానీ దివ్వెల మాధురి నిద్రపోయి కనిపించింది. శ్రీజ వచ్చి లెగాలి అమ్మా అని చెప్పినా ఆమె అలా నిద్రపోతుండగా వెంటనే బిగ్ బాస్ కుక్క అరిచిన శబ్దాన్ని ప్లే చేశారు. దాంతో ఇంటికి కెప్టెన్ గా ఉన్న ఇమ్మానుయేల్ వచ్చి నిద్రపోతున్నావా.. 20 గుంజీలు తీయు అంటూ ఆమెకు పనిష్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత రెండు మూడుసార్లు చెప్పినా ఆమె వినకపోయేసరికి ఆఖరికి పచ్చిమిర్చిని ఆమె చేత తినిపించి ఆమె నిద్ర పోగొట్టే ప్రయత్నం చేశారు.
ఇక కట్ చేస్తే బిగ్ బాస్ హౌస్ లో మాజీ కంటెస్టెంట్ గా వచ్చి పెర్మనెంట్ హౌస్ మేట్ గా మారడానికి భరణి, శ్రీజ ఇద్దరు పోటీపడ్డారు. ఆడియన్స్ నిర్ణయం ప్రకారం రెండు బాక్స్లను తీసుకురాగా.. వాటిని పగలగొట్టి ఒకరిని మాత్రమే హౌస్ లో ఉంచేటట్టు నిర్ణయం తీసుకున్నారు.. ఇకపోతే ప్రోమో చివర్లో భరణి ఇంటి నుండి వెళ్ళిపోతున్నట్లు చూపించారు. దివ్య నిఖిత ఏడుస్తూ ఉండగా ఆమె కన్నీళ్లు తుడిచారు భరణి. ఆ తర్వాత తనూజ కూడా సైలెంట్ గా, దిగాలుగా కూర్చున్నట్లు చూపించారు. అయితే అసలు విషయంలోకి వెళ్తే.. శ్రీజ హౌస్ నుండి వెళ్ళిపోయింది. కానీ ఆడియన్స్ ను ఫూల్ చేయడానికి.. మిస్ లీడ్ చేయడం కోసం తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భరణి వెళ్ళిపోతున్నట్లు చూపించారు. కానీ అసలు వెళ్లిపోయింది శ్రీజ . ఈ విషయం తెలిసిన ఆడియన్స్ బిగ్ బాస్ కాకుండా భరణి ఫ్యామిలీ అని పేరు మార్చండి. ఆ సీరియల్ బ్యాచ్ ని గెలిపించడానికి ఎన్ని తంటాలు పడుతున్నారో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ: Arjun Sarja : యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడిపై కేసు.. అసలేం జరిగిందంటే?