Gill-Sara : ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియా వర్సెస్ యూఏఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కి సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా హాజరు కావడం విశేషం. వాస్తవానికి సారా టెండూల్కర్.. టీమిండియా ఓపెనర్ బ్యాటర్ శుబ్ మన్ గిల్ ఆడే ప్రతీ మ్యాచ్ ని వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తుంటుంది. నిన్న కూడా శుబ్ మన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గ్రౌండ్ లో కనిపించింది. అయితే సారా టెండూల్కర్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సారా టెండూల్కర్ దొంగ చాటుంగా దుబాయ్ కి వెళ్లి క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తుందని.. గిల్ బ్యాటింగ్ చేస్తుంటే.. కెమెరా మెన్ కెమెరాను ఆమె వైపు చూపిస్తే కానీ ఎవ్వరికీ తెలియలేదు.
Also Read : Kavya Maran : ఈ ప్లేయర్లను వాడుకుని వదిలేసిన SRH కావ్య పాప?
సారా మ్యాచ్ కి వచ్చిందనే విషయం. అభిషేక్ శర్మ, గిల్ ఓపెనింగ్ అదుర్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే క్లౌడ్ లో లోంచే స్పందించింది సారా. ప్రస్తుతం సారా టెండూల్కర్ కి సంబంధించిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరోవైపు గత కొద్ది సంవత్సరాలుగా సారా టెండూల్కర్ తో శుబ్ మన్ గల్ ప్రేమలో ఉన్నాడని.. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఓ వార్త బయటికి వచ్చింది. ఆ సమయంలో వీరిద్దరికీ సంబంధించిన డీప్ ఫేక్ ఫొటోలు చాలా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా నిప్పు లేనిదే పొగరాదని.. వీరి మధ్య ఏదో ఉందని క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చనే జరిగింది. అయితే ఈ ఏడాది ఆగస్టు 06వ తేదీ రాఖీ పండుగ రోజు సారా టెండూల్కర్ శుబ్ మన్ గిల్ కి రాఖీ కట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.
దీంతో వీరిద్దరి మధ్య అలాంటి రిలేషన్ ఏమి లేదని అంతా చర్చించుకుంటుండగానే.. తాజాగా సారా టెండూల్కర్ ఏకంగా దుబాయ్ కి వెళ్లి ఆసియా కప్ లో తొలి మ్యాచ్ యూఏఈ వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్ కి హాజరైంది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి గతంలో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా అనుష్క శర్మ ప్రేమాయణం కొనసాగించినప్పుడు గతంలో ఇలాగే తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగేవారు. ఆ తరువాత వారిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఓ కూతురు కూడా కలదు. మరోవైపు సారా టెండూల్కర్ గోవాలో మరో వ్యక్తితో ప్రేమాయణం కొనసాగిస్తుందని కూడా రూమర్స్ వినిపించాయి.
శుబ్ మన్ గిల్-సారా మధ్య రిలేషన్ కొనసాగుతుందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ వారిద్దరిలో ఎవ్వరో ఒకరూ నోరువిప్పి అధికారికంగా చెప్పేంత వరకు ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.
https://www.facebook.com/share/p/172F2mTqNm/