BigTV English

The Raja Saab First Song : రాజా సాబ్ ఫస్ట్ సాంగ్ లీక్… ఓ బావా బావా అంటూ

The Raja Saab First Song : రాజా సాబ్ ఫస్ట్ సాంగ్ లీక్… ఓ బావా బావా అంటూ

The Raja Saab First Song : లీక్.. లీక్.. లీక్.. ఎక్కడ చూసినా ఈ లీకుల బెడద సినిమాలకు తప్పేలా లేదు. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి అప్పుడే అడుగుపెట్టిన డైరెక్టర్ ను మొదలుకొని ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్ల వరకు చాలామంది ఎంతో పగడ్బందీగా తమ చిత్రం నుండి ఎక్కడ లీక్ జరగకుండా ఎంతో ప్లాన్ చేస్తారు. కానీ ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక చిన్న బిట్ అయినా సరే లీక్ అయ్యి నిర్మాతలకు తలనొప్పిగా మారింది. ఎన్ని షరతులు పెట్టినా లీక్ మాత్రం అవ్వకుండా ఎవరూ ఆపడం లేదు అనేది వాస్తవం. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎంతో పొగడ్బందీగా తెరకెక్కిస్తున్న ‘ది రాజా సాబ్’ నుండి ఏకంగా మొదటి పాట లిరిక్స్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


ఫస్ట్ లిరికల్ సాంగ్ లీక్..

అసలు విషయంలోకి వెళ్తే.. మారుతి (Maruthi) దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) తాజాగా నటిస్తున్న చిత్రం ది రాజా సాబ్. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. కానీ వీఎఫ్ఎక్స్ కారణాలవల్ల మళ్లీ రీ షూట్ చేస్తున్నారు. పైగా కొంత భాగం షూటింగ్ కూడా పెండింగ్లో ఉండడంతో సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతూ ఉండగా ఈ సినిమా నుండి ఒక లిరికల్ పాటను కొంతమంది లీక్ చేశారు.. అందులో..”ఓ బావా బావా బావా.. నీ చేయి పాలకోవా”.అంటూ సాగిన ఈ పాట లిరిక్స్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికైతే లీక్ అయినా సరే సినిమాపై అంచనాలు పెంచేసిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి లీకులు అటు చిత్ర బృందానికి నష్టాన్ని కలిగించేలా ఉన్నాయని కొంతమంది నిపుణులు కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం.

హారర్ జానర్ లో ప్రభాస్..


ది రాజాసాబ్ సినిమా విషయానికి వస్తే.. రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి హారర్ రొమాంటిక్ జానర్లో సినిమా చేయబోతున్నారు. ఇప్పటివరకు ఎన్నో జానర్లలో ప్రేక్షకులను అలరించిన ఈయన.. తొలిసారి హారర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రభాస్ లుక్ కూడా వింటేజ్ ప్రభాస్ ను గుర్తు చేస్తోంది. పైగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ , ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ALSO READ:Big Boss 9 Telugu : gశ్రేష్టి వర్మకు షాకింగ్ ఓటింగ్… మొదటి వారమే హౌస్‌ నుంచి అవుట్ ?

ప్రభాస్ కి జోడిగా ముగ్గురు భామలు..

ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తూ ఉండగా.. ఈయనకు జోడిగా నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ , వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, అనుపమ్ ఖేర్ , ఎస్ జే సూర్య, యోగి బాబు, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, అలీ, శ్రీనివాసరెడ్డి, మురళి శర్మ, నాజర్ , రావు రమేష్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

NTR – Neel: ఎన్టీఆర్ కోసం రిషబ్ రంగంలోకి.. ఏ పాత్రో తెలిస్తే నమ్మలేరు!

Telusu Kada Teaser: ఇద్దరిద్దరి మధ్యలో దూరడం నీకు ఇష్టం కదా.. హీరోయిన్లతో సిద్దూ రొమాన్స్‌, టీజర్‌ చూశారా?

Deepika – Shahrukh : బెయిల్ వచ్చేసింది… హైకోర్టులో దీపిక – షారుఖ్‌కు భారీ ఊరట

Allu -Mega: హమ్మయ్య.. వార్ ముగిసినట్టేనా.. కలిసిపోతున్న అల్లు- మెగా కుటుంబాలు.. ఇదిగో సాక్ష్యం!

KishkindhaPuri: స్పెషల్ షో ఎఫెక్ట్.. ఉన్న బజ్ కి.. టాక్ కి అసలు సంబంధమే లేదు!

Big Stories

×