E-Paper
Advertisement

Bigg Boss Reethu : దువ్వాడ మాధురి పరువు తీసిన రీతూ తల్లి .. టాప్ 5 లో ఎవరున్నారంటే..?

Bigg Boss Reethu : దువ్వాడ మాధురి పరువు తీసిన రీతూ తల్లి .. టాప్ 5 లో ఎవరున్నారంటే..?
Advertisement

Bigg Boss Reethu : తెలుగు బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ మరికొన్ని రోజుల్లో ముగింపు దశకు చేరుకొనుంది.. సెప్టెంబర్ 7న గ్రాండ్ గా ప్రారంభమైన ఈ షో ఇప్పటివరకు 13 వారాలను పూర్తి చేసుకుంది.. 14వ వారంలోకి అడుగు పెట్టేసింది. గతవారం హౌస్ లో ఫైర్ బ్రాండ్ గా టాస్క్ లలో విజృంభించిన రీతూ చౌదరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. 13వ వారం డేంజర్ జోన్ లో ఉన్న సంజన ఈ వారం పెట్టేసర్దుకుంటుందని అందరు అనుకున్నారు. కానీ జనాల ఊహలకు అందని విధంగా రీతూ ఎలిమినేట్ అయ్యింది. రీతూ 13 వారాలు హౌస్ కొనసాగినందుకు గాను బాగానే రెమ్యూనరేషన్ ను అందుకుంది. ఇక ప్రస్తుతం ఈమె పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూ లు ఇస్తుంది. తాజాగా తన తల్లితో కలిసి ప్రెస్ మీట్ కు హాజరైయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో మాధురి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది రీతూ తల్లి. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.

మాధురి ఎవరి మీద క్రష్ తో వెళ్లిందో..

రీతూ ఎలిమినేట్ అయ్యి బయటకు రాగానే వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. బిగ్ బాస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు రీతు.. మీడియా ప్రతినిధులు అడుగుతున్నా ప్రశ్నలకు ఆమె ఓపిగ్గా సమాధానం చెప్పారు.. ఈ క్రమంలో ఓ వ్యక్తి మీ అమ్మగారు దువ్వాడ మాధురికి ఫోన్ చేసి డిమాన్ పవన్ తో మాట్లాడవద్దని అన్నారట నిజమేనా? అని అడిగారు. ఆ ప్రశ్నకు రీతు తల్లి దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్పింది. ఆమె మాట్లాడుతూ నేను ఎవరికీ ఫోన్ చేసి ఎవరితోనూ మాట్లాడొద్దని చెప్పలేదు. ఆవిడ ఎవరి మీద క్రష్ తో వెళ్ళిందో ఆవిడకే తెలియాలి అని ఒక్క మాటతో మాధురి పరువును అడ్డంగా తీసేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో మాధురి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.. మరి రీతూ తల్లి చేసిన వ్యాఖ్యల పై దువ్వాడ మాధురి ఎలా రియాక్ట్ అవుతారో అన్నది ఆసక్తిగా మారింది.

Advertisement

Also Read :ఈ వారం నామినేషన్స్ లేనట్టేనా..? నంబర్స్ కోసం కంటెస్టెంట్స్ పోటీ.. ఫైనల్ విన్నర్ అతనే..?

బిగ్ బాస్ టాప్ 5 ఉన్నది వీళ్లే.. 

అనంతరం రీతును ప్రశ్నలు అడిగారు.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లలో టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు అని అడిగారు.. దానికి రీతు సమాధానం చెప్పింది.. ప్రస్తుతం హౌస్ లో కొనసాగుతున్న వారిలో.. తనూజ, పవన్, ఇమ్మానుయేల్, సంజన, కళ్యాణ్ ఉంటారని చెప్పారు. మరి వీరిలో భరణి వచ్చే అవకాశం లేదా అని అడుగుతారు.. భరణి గారు ఎలా ఆడుతున్నారో మీరే చూసి నిర్ణయించండి అని సింపుల్ గా సమాధానం చెప్పింది రీతు. మొత్తానికైతే టాప్ 5 కంటెస్టెంట్ల గురించి రీతూ చెప్పడం ఆసక్తిగా మారింది.. ఇక హౌస్ లో ఉన్న వారిలో విన్నర్ గా ఎవరిని నిలుస్తారు? మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి అని అడిగారు. దానికి రీతు ఎవర్ని విన్నర్ గా చేస్తే వాళ్లే విన్నర్ అవుతారని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. బిగ్ బాస్ సీజన్ 9 లో హౌస్ ఉన్నది సుమన్ శెట్టి, సంజన, డిమాన్, కళ్యాణ్, తనూజ, భరణి,ఇమ్మానుయేల్ ఉన్నారు. మొత్తం ఏడుగురు ఉన్నారు. మరి వీరిలో ఈ వారం ఇద్దరు బయటకు వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.. ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే ఈ వీక్ మిస్ అవ్వకుండా బిగ్ బాస్ చూడాల్సిందే..

Advertisement

 

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×