CM Revanthreddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇవాళ్టితో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టారు. తన ఆలోచనలను ఎక్స్‌లో పోస్టు చేశారు.
ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జన సేవకుడిగా సహచరుల సహకారంతో.. విమర్శలను సహిస్తూ విద్వేషాలను ఎదురిస్తూ ప్రపంచంలో తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపేందుకు ముందుకు సాగిపోతున్నానని ప్రస్తావించారు.
ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి కలిగిందన్నారు. సమస్త ప్రజల ఆకాంక్షలు, సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి అంటూ ఎక్స్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి శనివారం(డిసెంబర్ 7 నాటికి) ఏడాది పూర్తైంది.
ప్రభుత్వాలు అంటే అంతర్గతంగా చేసేవి కొన్ని విషయాలు ఉంటాయి. అలాంటి వాటిని పక్కన పెట్టేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఏదైనా ఉంటే ప్రజల ముందు, లేదంటే మీడియా ముందు ఓపెన్‌గా చెబుతున్నారు. ప్రజా పాలన అన్న పేరుకు తగ్గట్టుగానే అన్నీ ప్రజల ముందే చెప్పి చేస్తున్నారు కూడా. రీసెంట్‌గా జరిగిన కొన్ని వ్యవహారాలే ఇందుకు ఉదాహరణ.
ALSO READ: అరెస్టుల సరదా.. కారు నేతల్లో ‘కటకటాల’ సెంటిమెంట్, కంటెంట్ కోసమేనా?
ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఓపెన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు ఎలాంటి వారైనా తలవంచాల్సిందే నని అన్నారు. ప్రజా ఉద్యమానికి నిజాం నవాబు సైతం తలొగ్గిన విషయాన్ని గుర్తు చేశారు. బాధ్యతలు చేపట్టిన ఆరు నెలలు ఎన్నికల కోడ్‌తో సరిపోయిందని, కేవలం తాను ఆరునెలలు మాత్రమే పని చేశానని వెల్లడించారు.
ప్రజా సమస్యలపై అధికార-విపక్షాలు అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విపక్షం సభకు వచ్చి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలన్నారు. తెలంగాణలో సీనియర్ నేతగా మీ అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని కేసీఆర్‌కు సూచన చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ విధంగా మాట్లాడిన నేత ఇప్పటివరకు ఒక్కరు లేదన్నది కొందరి సీనియర్ల మాట.
శుక్రవారం హోంగార్డుల రైజింగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే బాధితులతో ఫ్రెండ్లీ ఉండాలన్నారు. నేరగాళ్లు భయపడేలా పోలీసింగ్ చేయాలన్నారు. కబ్జారాయుళ్లు, ఖూనీ కోరులకు ఎలాంటి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదని ఓపెన్‌గా చెప్పేశారు. తప్పు చేస్తే ప్రజాప్రతినిధులైనా ప్రోటోకాల్స్, హోదా వర్తించవని గుర్తు చేశారు.
ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు స్వేచ్ఛ ఉంటుందని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని చెప్పకనే చెప్పేశారు. ఎవరైనా స్టేషన్లకు వచ్చి జులుం ప్రదర్శిస్తే కఠినంగా వ్యవహరించా లన్నారు. నేరగాళ్లకు ప్రొటోకాల్స్ పాటిస్తే మీరు ఉద్యోగాలు చేయలేరన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ మాటలపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గతంలో చాలామంది నేతలను చూశామని, ఈ విధంగా ఓపెన్‌గా చెప్పినవారు ఇప్పటివరకు చూడలేదంటూ ప్రజలు చర్చించుకోవడం గమనార్హం.
పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను…
ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను…
అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి…
డిసెంబర్ 7, 2023 నాడు…
తెలంగాణ నా చేతుల్లో పెట్టింది.తన వారసత్వాన్ని సగర్వంగా…
సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే
బాధ్యతను అప్పగించింది.ఆక్షణం నుండి…
జన… pic.twitter.com/z31HWss8ZZ— Revanth Reddy (@revanth_anumula) December 7, 2024