Siri Hanumanth:ప్రముఖ బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ (Siri Hanumanth)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. హౌస్ లో తోటి కంటెస్టెంట్ షణ్ముఖ్ తో కాస్త చనువుగా మూవ్ అయిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడ విమర్శలతో పాటు భారీ పాపులారిటీ అందుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రియుడు ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీహాన్ (Shrihan) తో కలిసి పలు వీడియోలు చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులకు చేరువలో ఉంటోంది. ఇక వీరిద్దరూ సీరియల్స్, కామెడీ షోలు, రియాల్టీ షోలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా తాజాగా వీరిద్దరూ కలసి ఒక బిజినెస్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ తో కలిసి బిజినెస్ మొదలుపెట్టిన సిరి హనుమంత్
సీరియల్స్, యూట్యూబ్ తో భారీ పాపులారిటీ దక్కించుకున్న సిరి హనుమంతు.. బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మరింత బిజీగా ఉంటూ.. వెబ్ సిరీస్, సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ దూసుకుపోతోంది. అంతేకాదు ప్రముఖ యూట్యూబర్ శ్రీహాన్ తో ప్రేమలో ఉన్న ఈమె లివ్ ఇన్ రిలేషన్ లో కూడా ఉంటున్న విషయం తెలిసిందే. అంతే కాదు వీరిద్దరూ కలిసి ఒక బాబును కూడా దత్తత తీసుకున్నారు. ఇక ఇప్పుడు వీరిద్దరూ కలిసి సిరి సొంత ఊరైన వైజాగ్ లో బ్యూటీ క్లినిక్ బిజినెస్ మొదలుపెట్టారు. ,”హెచ్. కె. పెర్మనెంట్ మేకప్ క్లీనిక్ ” అనే పేరుతో ఈ బిజినెస్ స్థాపించడం జరిగింది. ఫిబ్రవరి 2వ తేదీన చాలా గ్రాండ్గా ఓపెన్ చేయబోతున్నారు. ఈ ఓపెనింగ్ కి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరు కానున్నట్లు సమాచారం. గత కొన్ని రోజుల నుంచి రెగ్యులర్గా తన మేకప్ క్లీనిక్ గురించి అప్డేట్లు ఇస్తున్న సిరి హనుమంత్ ఎట్టకేలకు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ బిజినెస్ ప్రారంభించింది. ఇకపోతే సిరి హనుమంతు ప్రారంభించబోతున్న ఈ క్లినిక్ లో మేకప్ మాత్రమే కాకుండా బ్యూటీ స్కిన్ కి సంబంధించిన పలు ట్రీట్మెంట్లు కూడా ఉండనున్నాయని తెలిపింది. అంతేకాదు తన మేకప్ క్లీనిక్ లో పనిచేయడానికి ఎంప్లాయిస్ కావాలని, పలువురికి జాబ్స్ కూడా ఇస్తానని చెబుతోంది సిరి హనుమంత్.
బిజినెస్ ను విస్తృతం చేస్తున్న జంట..
ఇకపోతే ఈ బిజినెస్ ను ఇప్పుడు వైజాగ్ లో ఓపెన్ చేస్తుండగా.. త్వరలో విజయవాడలో కూడా ఓపెన్ చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ విషయం తెలిసి పలువురు సినీ, టీవీ, యూట్యూబ్ సెలబ్రిటీలు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సిరి, శ్రీహాన్ లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు కాబట్టి, త్వరలోనే వివాహం కూడా చేసుకుంటారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఒక పక్క సినిమాలు , సీరీస్ లు, యూట్యూబ్ తో బిజీగా ఉంటూనే మరొక పక్క బిజినెస్ కూడా మొదలుపెట్టి భవిష్యత్తు తరానికి బాటలు వేసుకుంటుంది ఈ జంట. అంతేకాదు ఈ క్లినిక్ లో ధరలు కూడా చాలా రీజనబుల్ గానే ఉంటాయంటూ చెప్పుకొచ్చినట్లు సమాచారం. మొత్తానికైతే బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టేసింది సిరి అంటూ అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.