E-Paper
Advertisement

Gadwal News: స్నేహితుల మధ్య ఘర్షణ.. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి..

Gadwal News: స్నేహితుల మధ్య ఘర్షణ.. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి..
Advertisement

Gadwal News: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ముగ్గురు యువకులు పరస్పరం  కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ నేపత్యంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు  తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే పట్టణంలోని కృష్ణవేణి చౌక్ సమీపంలో.. ఓ లాడ్జీలో ముగ్గురు యువకులు కూర్చొని మద్యం సేవించారు. అయితే మత్తు ఎక్కువవడంతో వారి మధ్య మాట, మాట పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది.

Advertisement

ఈ గొడవ కాస్తా ముదిరి ఒకరి పై ఒకరు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ  దాడుల్లో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, లాడ్జీ సిబ్బంది అందించిన సమాచారం మేరకు వెంటనే అంబులెన్స్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దాడిలో గాయపడిన ముగ్గురిలో ఒక యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం అతడిని కర్నూల్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

ఈ ఘటనపై గద్వాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు యువకుల మధ్య విభేదాలు ముందే ఉన్నాయా లేక తక్షణం జరిగిన వాదన వలన దాడులు జరిగాయా అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే లాడ్జీ యజమానిని, సిబ్బందిని కూడా అదనపు వివరాలను తెలుసుకోవడానికి విచారణకు పిలిచినట్లు తెలిసింది.

Advertisement

Also Read: తీవ్ర విషాదం.. పెద్దపల్లి జిల్లాలో బర్త్‌డే రోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన బాలుడు

లాడ్జిలో రాత్రి వేళ ఇంత పెద్ద గొడవ జరగడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేసి వాస్తవాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. గాయపడిన యువకుల వివరాలు సేకరిస్తూ, వారి మధ్య వివాదానికి కారణాలు ఏంటో స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×