Bigg Boss Vasanthi : ఈ మధ్య సెలబ్రిటీల విడాకుల వార్తలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే.. ఈమధ్య సినీ తారలు మాత్రమే కాదు బుల్లితెరపై సందడి చేస్తున్న ముద్దుగుమ్మలు కూడా విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి సడన్గా ఎంతోమంది సీరియల్ హీరోయిన్లు విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బుల్లితెర టాప్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ వాసంతి.. ఈమె తన భర్తతో విడాకులు తీసుకుపోతుందంటూ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం మాత్రం ఇది హాట్ టాపిక్ గా మారింది.. అసలేం జరిగింది? ఈమె నిజంగానే విడాకులు తీసుకుపోతుందా లేదా అవి కేవలం రూమర్సేనా అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
బిగ్ బాస్ బ్యూటీ వాసంతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తిరుపతికి చెందిన యువతి. చదువుకుంటున్న రోజుల్లోనే నటనపై ఆసక్తితో కన్నడ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సిరిసిరి మువ్వలు, గోరింటాకు తదితర సీరియల్స్‌తో పాపులర్ అయ్యింది. ఈ దశలో సంపూర్ణేష్ బాబు హీరోగా వచ్చిన కాలీఫ్లవర్, గేమ్ ఆన్, భువన విజయం తదితర సినిమాల్లోనూ నటించింది.. ఆ తర్వాత తెలుగు టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. కొన్ని వారాలు పాటు బాగానే తన ఆటిట్యూడ్ తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న విషయం కూడా తెలిసిందే.పవన్ కళ్యాణ్ అనే కుర్రాడితో ప్రేమలో పడి పెళ్లి 2024 ఫిబ్రవరి 21న చేసుకుంది. వాసంతి ఎక్కువగా బిజీగా ఉండటంతో తన భర్తకి ఎక్కువ దగ్గరగా లేదు అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూ లో బయట పెట్టిన విషయం తెలిసిందే. అయితే సినిమాలో సీరియల్స్ వల్ల ఆమె ఎక్కువగా ఇంట్లో ఉండలేదని తెలుస్తుంది. ఈ క్రమంలోనే భర్తతో విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు కూడా వినిపించాయి. అందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తుంది. తాజాగా వీరిద్దరూ కలిసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో జంటగా పాల్గొన్నారు.
Also Read :తెలుగు సీరియల్స్ తో క్రేజ్ తెచ్చుకున్న కన్నడ హీరోయిన్స్.. ఆ ఇద్దరే టాప్..
బిగ్ బాస్ మాదిరిగానే ఈ మధ్య మరో రియాలిటీ షో వచ్చింది.. ఈ షోలో సింగిల్స్ కాకుండా జంటలుగా పాల్గొంటున్నారు.. 10 వారాల పాటు 10 జంటలని ఒక మ్యాన్షన్‌లో ఉంచుతారు. చివరి వరకు ఏ జంట అయితే ఉంటుందో వారే మేడ్ ఫర్ ఈచ్ అదర్ షో విజేతగా నిలుస్తారు. యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తుంది. అనిల్ రావిపూడి, సీనియర్ నటి రాధ, లయలు జడ్జీలుగా వ్యవరిస్తున్నారు. షో కి సంబంధించిన ప్రోమో లను స్టార్ మా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ షోలో పాల్గొంటున్న జంటల విషయానికొస్తే.. ప్రియాంక జైన్ – శివకుమార్, నూకరాజు – ఆసియా, వాసంతి- పవన్ కళ్యాణ్, జాను – భాను, బ్రిట్టో- సంధ్య, సోనియా – సిద్ధూ, సాండ్రా – మహేశ్, నీతూ- నటరాజ్, హరిత- హరీష్, అంజలి – పవన్ జంటలు ఎంట్రీ ఇచ్చారు. ఈనెల 15 నుంచి ఈ షో అధికారికంగా ప్రారంభం కాబోతుంది. మరి ఇందులో ఎలాంటి గొడవలు జరుగుతాయో చూడాలి..