BigTV English

BB Telugu 8: నేటి ఎపిసోడ్ లో విన్నర్ ఎవరో హింట్ ఇవ్వనున్న హోస్ట్ నాగార్జున..!

BB Telugu 8: నేటి ఎపిసోడ్ లో విన్నర్ ఎవరో హింట్ ఇవ్వనున్న హోస్ట్ నాగార్జున..!

BB Telugu 8:ఒకప్పుడు బుల్లితెరపై ఏదైనా షో ప్రారంభమైందంటే ఎక్కువగా సీరియల్స్ చూసేవారు ఈ షోలను చూడడానికి ఆసక్తి చూపించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఏ ఛానల్ లో ఏ షో వచ్చినా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే సీరియల్ అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా ఈ షోలను చూస్తూ ఎంటర్టైన్ పొందుతున్నారు. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా ప్రతి భాషలో కూడా ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక ఎంటర్టైన్మెంట్ షో బిగ్ బాస్ (Bigg Boss). రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఇది , ఇప్పుడు తెలుగులో ఎనిమిదవ సీజన్ నడుస్తోంది. మరో వారం రోజులు గడిస్తే ఈ సీజన్ కూడా పూర్తి కానుంది


విన్నర్ ఎవరో హింట్ ఇవ్వనున్న నాగార్జున..

ఈ నేపథ్యంలోనే ఈ సీజన్ విన్నర్ గా ఎవరు నిలుస్తారు? అనే విషయం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఒకవైపు హౌస్ లో మొదటి నుండి తన ఆటతో ప్రేక్షకులను మెప్పిస్తున్న నిఖిల్(Nikhil )విన్నర్ అవుతారని కామెంట్లు చేస్తుంటే , ఇంకొంతమంది వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చినా సరే తన ఆట తీరుతో అందరినీ మెప్పిస్తున్న గౌతమ్ (Gautham)విన్నర్ అవుతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మొత్తానికైతే వచ్చేవారం విన్నర్ ఎవరో తేలనున్న నేపథ్యంలో ఈ శనివారం ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున (Nagarjuna) హింట్ ఇవ్వనున్నారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది అదేంటో ఇప్పుడు చూద్దాం.


తెరపైకి కొత్త వాదన..

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మరో వారం రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ ఎవరు తేలిపోనుంది. నాగార్జున డిసెంబర్ 7 శనివారమే హింట్ ఇచ్చేసినట్లు సమాచారం. అయితే నేటి ఎపిసోడ్ ఈరోజు రాత్రికి ప్రసారం కానున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఎలా హింట్ ఇవ్వనున్నాడు అనే విషయానికి వస్తే.. నాగార్జున టార్గెట్ చేసి తిట్టిన కంటెస్టెంట్ విన్నర్ అని, పొగిడిన కంటెస్టెంట్ రన్నర్ అనే ఒక వాదన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇకపోతే నాగార్జున జడ్జిమెంట్ సరిగా లేదని, అందుకే ఇదే జరుగుతుందని కూడా కామెంట్లు చేస్తున్నారట నెటిజన్స్.

నిఖిల్ పై మండిపడ్డ హోస్ట్ నాగార్జున..

ఇకపోతే తాజాగా ఇప్పటివరకు జరిగిన కార్యక్రమంలో నిఖిల్ ను టార్గెట్ చేస్తూ ఫౌల్ గేమ్ ఆడాడు అంటూ నాగార్జున పెద్ద ఎత్తున మండిపడుతూ కామెంట్లు చేశారు. అటువైపు తన ఆట తీరుతో మెచ్చుకుంటూ గౌతమ్ ను పొగడ్తలతో ముంచేశాడు. ఇక దీన్ని బట్టి చూస్తే విన్నర్ గా నిఖిల్ , రన్నర్ గా గౌతమ్ నిలవబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికైతే రన్నర్, విన్నర్ అంటూ ఏర్పడిన ఈ కన్ఫ్యూజన్లో ఎవరు విన్నర్ గా నిలవనున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ వారం మొదటి ఫైనలిస్ట్ అవినాష్ (Avinash )మినహా మొత్తం 6 మంది నామినేషన్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక గతవారం పృథ్వి కూడా ఎలిమినేట్ అయ్యారు. ఇక ప్రస్తుతం ఉన్న వారిలో ఈవారం రోహిణి లేదా ప్రేరణ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News

Bigg Boss AgniPariksha: అనుమానం రేకెత్తిస్తున్న మాస్క్ మ్యాన్.. ఎవరో తెలుసా?

Bigg Boss Telugu 9 Promo : సంవత్సరానికి నలుగురు పిల్లలు కావాలా? ఏంటి శ్రీముఖి ఇది? 

Bigg Boss 9 Agnipariksha : బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఐదుగురు కన్ఫామ్..?

Bigg Boss Telugu: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. వీడియో వైరల్!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Bigg Boss Agnipariksha: ఒక్క ఛాన్స్ అంటూ గోల.. రేయ్ ఎక్కడ దొరికార్రా మీరంతా?

Big Stories

×