BigTV English

Telangana BJP: తెలంగాణ కొత్త బీజేపీ అధ్యక్షుడు ఆయనేనా..?

Telangana BJP: తెలంగాణ కొత్త బీజేపీ అధ్యక్షుడు ఆయనేనా..?

తెలంగాణ బీజేపీలో నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి.. ఓ వైపు కేంద్రమంత్రిగా.. ఇంకోవైపు పార్టీ రథసారధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకూ కశ్మీర్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించి.. బిజీబిజీగా గడిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పార్టీ నేతలపై ఆయన సరైన ఫోకస్ పెట్టడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయట. దీంతో… ఇటు క్యాడర్‌తో పాటు.. అటు.. లీడర్స్ కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని లైట్‌ తీసుకొంటున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. అందుకే రాష్ట్ర నాయకత్వ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలు.. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.

పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నేతృత్వంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించినా.. అందులో పాల్గొనే వారి సంఖ్య తక్కువగా ఉండటం కమలనాథుల్లో ఆందోళన కలిగిస్తోందట. కేసీఆర్ పాలన వైఫల్యాలను ఎండగడుతూనే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల వైఫల్యాలపై పోరాటాలు చేస్తున్నా.. కిషన్‌ వెంట వచ్చేవారు నానాటికీ తక్కువ అవుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. హైడ్రా, మూసీ ప్రక్షాళనతోపాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత వంటి అంశాలపై కీలక సమావేశాల్లో పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అద్యక్షులు డుమ్మా కొడుతున్న తీరు.. కమలం పార్టీ చర్చనీయాంశంగా మారిందట.


రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మరో గౌరవం కూడా ఉందట. తప్పు చేసిన నేతలను ఆయన కనీసం మందలించే స్వభావి కాదనే పొగడ్తలూ ఉన్నాయి. కానీ.. గ్రౌండ్‌లెవల్‌లో మాత్రం.. చేసేవి చేస్తుంటారనే విమర్శలూ ఉన్నాయి. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలనే క్రమశిక్షణ కమిటీ నివేదికలనూ అందరి ముందు పక్కన పెట్టేస్తారట. కానీ.. చేసేవి తెలియకుండా చేసేస్తారనే టాక్ ఉంది. అలా అని.. పని చేసిన కార్యకర్తలను ప్రశంసించి వెన్నుతట్టి ప్రోత్సహించిన సందర్భాలు కూడా తక్కువేనని చర్చ.. కింది స్థాయి క్యాడర్‌లో ఉందట. తెలంగాణ బీజేపీ సారథిగా కిషన్ రెడ్డి.. నేతలను, క్యాడర్‌ను సర్దిచెప్పి పనిచేయించుకుని వదిలించుకుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దూకుడుగా ముందుకు వెళ్తున్న యువమోర్చా, మహిళా మోర్చా నేతలను సైతం తన అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని సూచించినట్టుగా పార్టీలోనే చర్చ సాగుతోంది. దీంతో అధ్యక్షుడి తీరుపై కొందరు బహిరంగంగానే చర్చించుకుంటున్నారనే టాక్ నడుస్తోంది.

Also Read:  ఏడాదిలోనే ఎన్నో అభివృద్ధి ఫలాలు.. రేవంత్ సర్కార్ చేపట్టిన పనులు, చేసుకున్న ఒప్పందాలివే!

ముఖ్యంగా కిషన్‌రెడ్డి వ్యవహారంలో యువనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో పేరు తెచ్చుకోవాలంటూ వివిధ కార్యక్రమాలు, పార్టీ తరపున పోరాటం చేయాల్సిన సమయంలో తమను ఎదగనివ్వటం లేదనే కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మొన్నటి వరకూ తెలంగాణలో బలంగా ఉన్న పార్టీ.. వీక్ కావడానికి ఇలాంటి నిర్ణయాలే కారణమనే వాదనలూ వినిపిస్తున్నాయి. దక్షిణాదిలో తెలంగాణపై కేంద్ర నాయకత్వం దృష్టి సారించినా.. జనంలోకి వెళ్లే అవకాశం రావటం లేదని కొందరు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్‌ను ఉత్సాహపరిచేందుకు ప్రధాని మోడీ కూడా రంగంలోకి దిగారు. తెలంగాణలోని కీలక నేతలతో సమావేశమై.. దిశానిర్దేశం చేశారు. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా.. టీబీజేపీ చీఫ్‌ సరైన గౌడైన్స్ ఇవ్వటం లేదని కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారట.

లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని.. క్యాడర్‌లో జోష్ ఉన్నా, అందుకు రాష్ట్ర నాయకత్వ తీరు నిరుత్సాహ పరుస్తోందని కొందరు ఆరోపిస్తున్నారట. గతంలో బండి సంజయ్‌ను అద్యక్ష పదవి నుంచి ఉన్న ఫలంగా తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడంపైనా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అందులో భాగంగానే రాష్ట్ర బీజేపీకి కొత్త బాస్ రాబోతున్న తరుణంలో.. కిషన్‌రెడ్డిని, ఆయన లీడర్‌ షిప్‌ను పార్టీ నేతలతో పాటు, క్యాడర్ కూడా లైట్ తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది.

మరికొన్ని రోజుల్లో రాష్ట్ర బీజేపీకి కొత్త రథసారథి రానున్నారు. ఇప్పటికే సంస్థాగత ఎన్నికల ప్రక్రియా మొదలైంది. వచ్చే నెలాఖరు లేదా కొత్త సంవత్సరం మొదటి వారానికి కొత్త అధ్యక్షుడు ఎవరనే స్పష్టత రానుంది. అతికొద్ది సమయంలో కిషన్ రెడ్డి నేతల పట్ల కఠినంగా వ్యవహరించి.. పార్టీని గాడిలో పెడతారా.. క్రమశిక్షణ కమిటీ సిఫార్సులను అమలు చేస్తారా..? పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చి తన మార్క్ చూపించుకుంటారా లేదా అనే అంశం ఉత్కంఠగా మారింది. లేకుంటే మౌనంగానే ఉండి.. కొత్త అధ్యక్షుడికి మరింత బాధ్యతలు అప్పగిస్తారా అనేది రాష్ట్రరాజకీయల్లో ఆసక్తిగా మారింది.

తెలంగాణ పరివార్ క్యాడర్ అంతా.. త్వరలోనే వచ్చే కొత్తసారథిపైనే ఆశలు పెంచుకుంటుందట. పార్టీని ఉరకలు పెట్టించే సారథి కోసం బీజేపీ హైకమాండ్ అన్వేషణ కొనసాగిస్తోందట. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే అధ్యక్షుడి ఎన్నికకు సందిగ్ధతకు తెర దించుతూ.. కొత్త కమలఅధిపతిని ప్రకటించే ఛాన్స్ ఉందనే చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న పరివార్ పార్టీ లక్ష్యాలు.. ఏ మేరకు నెరవేరతాయో చూడాలి. దీంతో పాటు కొత్త బాధ్యతలు తీసుకునే వ్యక్తికి ఇద్దరు కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, క్యాడర్.. ఏ మేరకు సహకరిస్తారో చూడాలి.

Related News

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Kakani Govardhan Reddy: జైలు జీవితం కాకాణిని మార్చేసిందా?

Big Stories

×