BigTV English

Adimulapu Suresh: ఆ నియోజకవర్గంలో సీన్‌ రివర్స్.. అజ్ఞాతంలోకి ఆదిమూలం సురేష్

Adimulapu Suresh: ఆ నియోజకవర్గంలో సీన్‌ రివర్స్.. అజ్ఞాతంలోకి ఆదిమూలం సురేష్

ఇదీ.. ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని సీన్‌. 2019లో 151 సీట్లతో వైసీపీ విజయం సాధించాక.. ఐదేళ్లు పాటు మంత్రి పదవి అనుభవించిన ఆదిమూలపు సురేష్‌.. ఎక్కడంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారట. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించటంతో పాటు విద్యాశాఖ, మున్సిపల్ శాఖల మంత్రిగా పనిచేసిన సురేష్‌.. కనిపించిన దాఖలాలు లేవంటూ సొంతనియోజకవర్గంలో చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందటంతో తన మూలాలను కాపాడుకునేందుకు పోటీ చేసిన చోట కాకుండా.. పక్క నియోజకవర్గంపై ఆయన దృష్టి సారించారనే వార్తలు గుప్పుమంటున్నాయి.

గత ఎన్నికల్లో సురేష్‌ను.. YCP అధిష్టానం యర్రగొండపాలెం నుంచి కొండపి నియోజకవర్గానికి బదిలీ చేసింది. ఆ నియోజకవర్గంంలో ఓటర్లు ఆయన్ను ఆదరించలేదు. 2009లో యర్రగొండపాలెం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదిమూలపు స్థానం మార్చుకుని 2014లో సంతనూతలపాడు నుంచి YCP టికెట్‌పై పోటీ చేసి గెలుపొందారు. 2019లో సంతనూతలపాడు సిట్టింగ్ స్థానం వదిలి తిరిగి యర్రగొండపాలెం నుంచి వైసీపీ తరుపున విన్ అయ్యారు. గత ఎన్నికల్లో మాత్రం కొండపి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి.. ప్రస్తుత మంత్రి బాల వీరాంజనేయస్వామి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. అక్కడ నుంచి సీన్‌ మొత్తం మారిందని టాక్ నడుస్తోంది.


ఎన్నికల్లో ఓడిన నాటి నుంచీ మాజీమంత్రి.. నియోజకవర్గానికి చుట్టంచూపుగా పరిమితం అయ్యారు. ఈ మాట స్వయంగా వైసీపీ శ్రేణులే చర్చించుకుంటున్నారట. ఫుల్ టైమ్ కొండపి బాధ్యతలను ఆదిమూలపు సురేష్‌ చూడటం లేదని క్యాడర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత సింగరాయకొండలోని వైసీపీ ఆఫీస్ ఎత్తేశారట. తాడేపల్లిలో జరిగే ప్రెస్ మీట్లు తప్ప.. జిల్లాలో జరిగే పార్టీ యాక్టివిటీస్‌లో ఎక్కడా సురేష్ కనిపించటం లేదని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. మరోవైపు ఆయన హైదరాబాద్‌కే పూర్తిగా పరిమితం అయ్యారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు కొండపి నియోజకవర్గం తనకు వర్కౌట్ కాదని.. తన సన్నిహితులతో సురేష్‌ చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో కలిసొచ్చిన సంతనూతలపాడే బెస్ట్‌ అనే ఆలోచనలో మాజీమంత్రి ఉన్నట్లు సమాచారం. యర్రగొండపాలెంకు తిరిగి వెళ్లాలని ఆశ ఉన్నా.. అది తనకు సెట్‌ కాదనే యోచనలో సురేష్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

Also Read: విక్రాంత్ రెడ్డి C/O తాడేపల్లి ప్యాలెస్.. జగన్ ఫ్యామిలీకి ‘ఆర్థిక వనరు’ అతడేనా?

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి, యర్రగొండపాలెం.. రెండు నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా రెపరెపలాడింది. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో సురేష్‌కు నో ఛాన్స్‌. అందుకే మాజీమంత్రి.. సంతనూతలపాడుకు షిఫ్ట్ కావాలని యోచనలో ఉన్నట్లు పొలిటికల్ వర్గాల టాక్ . ప్రస్తుత సంతనూతలపాడు వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా మాజీమంత్రి మెరుగు నాగార్జున కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో నాగార్జున.. వేమూరు నుంచి సంతనూతలపాడు షిఫ్ట్ అయ్యి.. ఓటమి చెందారు. తర్వాత ఆయన అటు కన్నెత్తి కూడా చూడలేదట. తాజాగా వైసీపీ అధిష్టానం ఆయన్ను బాపట్ల జిల్లా అధ్యక్షుడుగా నియమించింది. దీంతో ఆయన మళ్లీ సొంత నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. ప్రస్తుత వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా వరికూటి అశోక్ బాబు ఉండగా.. ఆయన కూడా కొండపి వైపే చూస్తున్నారట. దీంతో ఆ నియోజకవర్గంలో మూడుముక్కలాట సాగుతోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. మరోవైపు.. వరికూటి కూడా కొండపి వస్తే మరోసారి గ్రూపు రాజకీయాలకు అవకాశం లేకపోలేదని సొంత పార్టీలో చర్చ సాగుతోందట.

మరోవైపు..కొండపి నియోజకవర్గంలో నిలదొక్కుకునేందుకు వైసీపీ చేయని ప్రయత్నాలు లేవని రాజకీయ వర్గాల్లోనూ టాక్ నడుస్తోంది. అక్కడ ఎలాంటి ఫార్ములా ప్రవేశపెట్టినా.. ఫ్యాన్ పార్టీ సక్సెస్ కావటం లేదనే టాక్ ఉంది. నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ నుంచి మంత్రి బాలవీరాంజనేయ స్వామి స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే కొండపిలో ఆయన పాతుకుపోయారంటే అతిశయోక్తి కాదేమో. అక్కడ నుంచి మూడుసార్లు గెలిచిన ట్రాక్ రికార్డు కూడా ఆయన సొంతం. మరోవైపు.. స్వామికి.. దామచర్ల సత్య కుటుంబం అండగా ఉంది. ఆర్థికంగా, సామాజికంగా దామచర్ల కుటుంబం సపోర్ట్ ఉండటంతో.. వైసీపీలో ఏ నేతా.. కొండపి బాధ్యతలు చేపట్టినా ప్రత్యర్థిగా ఉంటున్న స్వామిని ఢీకొట్టలేకపోతున్నారనే వాదన ఉంది.

అందుకే ఆ నియోజకవర్గంలో వైసీపీ బాధ్యతలను కొత్తవారికి ఇచ్చేందుకు అధిష్టానం వ్యూహాలు రచిస్తోందట.ఆదిమూలపు సురేష్‌.. సంతనూతలపాడు షిఫ్ట్ కావటం కన్ఫామ్‌ అయితే.. కొండపి వైసీపీ ఇన్‌ఛార్జ్ పదవి ఖాళీ అవుతుంది. ఆ స్థానం కోసం వైసీపీ నేతలు జూపూడి ప్రభాకరరావు, మాదాసి వెంకయ్య లైన్‌లో ఉన్నారు. వేమూరు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న వరికూటి అశోక్ బాబు.. తనకు వేమూరు నుంచి టిక్కెట్ కావాలని పట్టు పడుతున్నట్లు సమాచారం. ఎన్నికలకు చాలా సమయం ఉండటంతో.. వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయోననే ఉత్కంఠ ఉంది.

ఇప్పటికే నియోజకవర్గాల్లో నేతల మార్పిడి అంశం.. ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని రాజకీయవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గం మారితే.. ఆ ఎఫెక్ట్ మిగతా నియోజకవర్గాల్లోనూ పడే అవకాశం లేకపోలేదనే టాక్ పొలిటికల్ వర్గాల్లో సాగుతోందట. ఈ నేపథ్యంలో అధినేత జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఆసక్తి నెలకొంది.

 

Related News

Palakurthi Politics: ఎర్రబెల్లి యూ టర్న్.. యశస్విని రెడ్డికి షాక్ తప్పదా?

Kadapa MLA: కడప రెడ్డమ్మ కథ రివర్స్..?

BJP Vs BRS: కేసీఆర్‌కు బీజేపీ షాక్! వెనుక స్కెచ్ ఇదే!

Urea War: బ్లాక్ మార్కెట్‌కు యూరియా తరలింపు.? కేంద్రం చెప్పిందెంత..? ఇచ్చిందెంత..?

AP Politics: సామినేని అంతర్మథనం..

Satyavedu Politics: మారిన ఆదిమూలం స్వరం.. భయమా? మార్పా?

Big Stories

×