BigTV English

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 ఓటింగ్ లో విష్ణు ప్రియా టాప్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 ఓటింగ్ లో విష్ణు ప్రియా టాప్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 7 తో పోలిస్తే 8 వ సీజన్ కాస్త ఆకట్టుకుంటుంది. ముందుగా చెప్పినట్లే ట్విస్టులతో ముందుకు సాగుతుంది. టాస్క్ ల విషయంలో బిగ్ బాస్ ఆచి తూచి వ్యవహారిస్తున్నాడు. రెండు వారాలు పూర్తి అయ్యింది. ఇక మూడో వారం లోకి అడుగు పెట్టింది. ఈ వారం ఎలిమినేషన్ కు సంబందించిన నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. ఈ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్స్ విషయంలో మాత్రం ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరేలా చేస్తున్నారు. శేఖర్ భాషా ఎలిమినేషన్ తర్వాత అంతా పూర్తిగా మారిపోయింది. కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ చేసే వారిని సీక్రెట్ హౌస్ లోకి పంపిస్తారు, కానీ ఇక్కడ అది కూడా జరగలేదు. ఇదంతా పక్కన పెడితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయిన వారిలో అభయ్ నవీన్ కూడా ఉన్నారు.. అయితే ఈ వారం బయటకు ఎవరు వెళ్తారా అన్నది ఆసక్తిగా మారుతుంది.


మంగళవారం ఎపిసోడ్ లో క్లాన్స్ కు ఛీప్స్ గా ఉన్న అభయ్, నిఖిల్ కు కూడా బిగ్ బాస్ నామినేషన్స్ సెగ తగులుతుంది. మీ ఇద్దరిలో ఎవరొకరు నామినేట్ అవ్వాలని బిగ్ బాస్ అంటాడు. దాంతో అభయ్ తనని నామినేట్ చేసుకుంటాడు. నేను నామినేషన్స్ నుండి తప్పించుకుంటాను అనే నమ్మకం ఉందని బిగ్ బాస్ కి చెప్తాడు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, హౌస్ లో ఉన్న ప్రతీ కంటెస్టెంట్ తమదైన మార్కుని క్రియేట్ చేసుకున్నారు. అయితే అభయ్ మాత్రం ఎటువంటి మార్క్ ను క్రియేట్ చేసుకోలేదు. తన పనేంటో తాను చేసుకుంటూ ఉంటాడు. అభయ్ నవీన్ కి మాత్రం ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పే కన్నింగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు.

Vishnu Priya tops in Bigg Boss 8 voting.. Will he be eliminated this week?
Vishnu Priya tops in Bigg Boss 8 voting.. Will he be eliminated this week?

ఇదే అభయ్ కు ఇదే మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా నామినేషన్స్ లోకి వచ్చి డేంజర్ లో పడ్డాడు అభయ్.. సోషల్ మీడియా లో జరిగే పొలింగ్స్ ని ఆధారంగా తీసుకుంటే అభయ్ కి బాటమ్ టాప్ 2 లో స్థానం దక్కింది. ఈయన తర్వాతి స్థానం లో పృథ్వీ రాజ్ ఉన్నాడు. కానీ పృథ్వీ కి కర్ణాటక నుండి అధికారిక ఓటింగ్ లో భారీ స్థాయిలో ఓటింగ్ నమోదు అవుతుందని తెలుస్తుంది. దాంతో ఎటు చూసినా పృథ్వి కి సేఫ్ జోన్ కనిపిస్తుంది. ఇక సీరియల్ బ్యాచ్ దాదాపుగా సేఫ్ పొజిషన్ లో ఉన్నారు. ఎలిమినేట్ అయితే కచ్చితంగా అభయ్ అవుతాడు అని సోషల్ మీడియా పొలింగ్స్ ద్వారా తెలుస్తుంది. మరి ఇక్కడ జరిగినట్టే అధికారిక పొలింగ్స్ లో కూడా జరుగుతుందా లేదా అనేది చూడాలి.. ఇక ఇప్పటివరకు టాప్ ఓటింగ్ లో విష్ణు ప్రియా ఉందని తెలుస్తుంది.మరి ఈ వారం ఎటు చూసిన అభయ్ డేంజర్ లో ఉన్నాడని తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి..


Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×