BigTV English

Asian Champions Trophy 2024: ఆసియా హాకీ చాంపియన్‌గా భార‌త్

Asian Champions Trophy 2024: ఆసియా హాకీ చాంపియన్‌గా భార‌త్

భారత్ కి వ్యతిరేకంగా ఎప్పుడూ కవ్వింపు చర్యలకు పాల్పడే పాకిస్తాన్ దేశం తరహాలోనే చైనా కూడా మారింది. అందుకని ఈ రెండు దేశాలతో జరిగే ఆటలు చాలా ఉద్వేగంగా ఉంటాయి. ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠతో చూస్తారు.  ఈ క్రమంలో జరిగిన హాకీ ఫైనల్ మ్యాచ్ లో 1-0 తేడాతో ఆతిథ్య చైనాను భారత్ మట్టి కరిపించింది. ఆసియా ఛాంపియన్ గా అవతరించింది. దీంతో భారత్ లో సంబరాలు అంబరాన్నంటాయి.

ఇక హోరా హోరీగా సాగిన మ్యాచ్ లో.. చివరి క్వార్టర్ లో డిఫెండర్ జుగ్ రాజ్ గోల్ సాధించి భారత్ కి ట్రోఫీ అందించాడు. దీంతో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ వరుసగా రెండోసారి నిలబెట్టుకుంది. ఓవరాల్ గా చూస్తే ఇప్పటివరకు ఐదు సార్లు భారత్ ట్రోఫీని గెలిచింది.


ఈ దశలో చివరి క్వార్టర్‌ వచ్చింది. ఇక్కడ గానీ గోల్ కొట్టకపోతే అంతే సంగతి అనుకొని.. ప్రాణం పెట్టి ఆడారు.  కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ కి ఒక అవకాశం వచ్చింది. బంతిని అద్భుత రీతిలో తప్పించి డిఫెండర్ జుగ్‌రాజ్‌కి అందించాడు. తను క్షణం కూడా ఆలోచించకుండా.. బ్రహ్మాండమైన స్ట్రయిక్‌‌తో బంతిని కొట్టాడు. అది కళ్లు మూసి తెరిచేలోగా గోల్ పోస్టులోకి వెళ్లిపోయింది. ఈసారి చైనీస్ గోల్ కీపర్‌ ఆపలేకపోయాడు.  అలా ఉత్కంఠకు తెరపడింది. చివరకి భారత్ విజయాన్ని అందుకుంది. ట్రోఫీని ముద్దాడింది.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×