Bigg Boss Buzz : బిగ్ బాస్ సీజన్ 8 మరో రెండు వారాల్లో ముగుస్తుంది. మొన్నటివరకు ఈ వారం ఎవరు బయటకు వెళ్తారా అని ఆడియన్స్ ఎదురు చూశారు. కానీ ఇప్పుడు విన్నర్ ఎవరు అవుతారని టెన్షన్ పడుతున్నారు. ఇక గత వారం కన్నడ బ్యూటీ యష్మీ గౌడ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె వెళ్తుందని అస్సలు ఎవరు ఊహించలేదు. యష్మీ హౌస్ లో ఉన్నన్ని రోజులు మంచి ఫైర్ మీద ఆడింది. ఈ మధ్య యష్మీ నిఖిల్ పై ప్రేమను పెంచుకుంది. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అనుకున్నారు. ఇక గత ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చిన సోనియా నిఖిల్ కు ఇచ్చిన క్లాస్ తో ఇద్దరి మధ్య చెడింది. ఇక 12 వ వారం ఎలిమినేట్ అయిన ఆమె ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున పరువు తీసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ నాగ్ గురించి ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం..
బిగ్ బాస్ నుంచి 12 వ వారం ఎలిమినేట్ అయ్యిన యష్మీ బిగ్ బాస్ బజ్ షోలో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ షోకు అర్జున్ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ ఇంటర్వ్యూలో యష్మీ అందరిలాగే ఏదోకటి చెబుతుంది అని అనుకున్నారు. షోలో ప్రమాణం చేసి నిజాలు చెప్పడం మానేసి తాను గ్రేట్ అని చెప్పుకోవడానికి తనకు నచ్చినట్లు పచ్చి అబద్దాలు చెప్పేసిందని తెలుస్తుంది. వీకెండ్‌లో నాగార్జున అడగని.. ఆయన నిలదీయలేని ప్రశ్నలన్నింటినీ వేసి యష్మీ గౌడను కడిగిపారేశాడు అర్జున్ అంబటి. గ్రూప్ గేమ్ ఆడావా? లేదా? అసలు నిఖిల్‌ని ప్రేమించావా లేదా? మొదట్లో ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి.. తరువాత లేవని ఎందుకు ప్లేట్ తిప్పేశావ్.. ఇలా చాలా విషయాలను చర్చించాడు.. దానికి కొన్ని నిజాలు చెప్పగా మరికొన్ని పచ్చి అబద్దాలు చెప్పిందనే టాక్ వినిపిస్తుంది.
అర్జున్ మాట్లాడుతూ.. వీకెండ్‌లో నాగార్జున ఏదైతే గ్రూపిజం తప్పుకాదు అని అన్నారుగా దాని మీద మీ అభిప్రాయం ఏంటని అడిగాడని తెలుస్తుంది. దానికి సమాధానం చెబుతూ అది ఖచ్చితంగా తప్పే నని యష్మీ గౌడ నోటితోనే చెప్పించాడు అర్జున్ అంబటి. నాగార్జున రాంగ్ అన్నదాన్నే రైట్ అనేట్టుగా యష్మీ నోటితోనే చెప్పించారు. మొత్తానికి బిగ్ బాస్ టీం వాళ్లు హోస్ట్ నాగార్జునని వెర్రిపప్పని చేసినట్టే అనిపించింది. దాంతో నాగార్జున పరువు మొత్తం పోయిందని తెలుస్తుంది. ఇక ఆ వీడియో వైరల్ అవ్వడంతో నాగార్జున పై ట్రోలింగ్ మొదలైంది.. అర్జున్ హోస్ట్ గా ఉంటే బాగుండు.. వారం మొత్తం ఎపిసోడ్ చూసి ఏమైందో చెబుతారు.. వారం ఎండింగ్ వచ్చి చెబుతున్నాడు. బిగ్ బాస్ దీనిపై ఆలోచించాలి అని చెప్తున్నారు. దాంతో ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నారేమో మొత్తానికే యూట్యూబ్ లో ఎపిసోడ్ ను డిలీట్ చేశారు. బిగ్ బాస్ బజ్‌లో అంబటి అర్జున్ ప్రశ్నలు చూసిన తరువాత.. నాగార్జునతో పోల్చుతూ కామెంట్లు రావడంతో.. యష్మీ బజ్ ఇంటర్వ్యూని డిలీట్ చేశారా? లేదంటే మరేదైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది..