BigTV English

Pawan Kalyan: బంగ్లాదేశ్ లో హిందువుల‌పై దాడులు.. స్పందించిన ప‌వ‌న్.. ఆయ‌న‌ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్

Pawan Kalyan: బంగ్లాదేశ్ లో హిందువుల‌పై దాడులు.. స్పందించిన ప‌వ‌న్.. ఆయ‌న‌ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్

Pawan Kalyan: బంగ్లాదేశ్ లో ఇస్కాన్ గురువు చిన్మ‌య్ కృష్ణ‌దాస్ ను ప్ర‌భుత్వం అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్స్ వేధిక‌గా స్పందించారు. చిన్మ‌య్ కృష్ణ‌దాస్ అరెస్ట్ ను అంద‌రూ ఖండించాల‌ని పిలుపునిచ్చారు. హిందువుల‌పై దాడుల‌ను ఆపాల‌ని బంగ్లాదేశ్ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భార‌త సైన్యం ర‌క్తం చిందించింద‌ని, ఎంతోమంది జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయార‌ని ప‌వ‌న్ గుర్తు చేశారు. హిందువుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు పాల్ప‌డ‌టం తీవ్రంగా క‌ల‌చివేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.


Also read: షాకింగ్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడుగా ఉన్న ప్ర‌భాక‌ర్ రావుపై మ‌రోకేసు..!

ఈ విష‌యంలో యూఎన్ఓ క‌ల‌గ‌జేసుకోవాల‌ని కోరారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ లో హిందువుల‌పై జ‌రుగుతున్న దాడుల‌కు వ్య‌తిరేకంగా కృష్ణ‌దాస్ పోరాటం చేస్తున్నారు. అక్టోబ‌ర్ లో ఆయ‌న ఓ ర్యాలీలో పాల్గొన‌గా బంగ్లాదేశ్ జెండాను అగౌర‌వ‌ప‌రిచార‌నే ఆర‌ప‌ణ‌లతో ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న‌తో పాటూ మ‌రో 18 మందిని అదుపులోకి తీసుకుని వారిపై దేశ‌ద్రోహం కేసు న‌మోదు చేశారు. ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌పై భార‌త విదేశాంగ‌శాఖ సైతం స్పందించింది. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న హిందువుల‌ను అరెస్ట్ చేయ‌డాన్ని ఖండించింది. మైనారిటీలు, హిందువుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరింది.


బంగ్లాదేశ్ లో హిందువుల‌పై దాడులు చేయ‌డం, దోపీడీలు, దొంగ‌త‌నాలు చేయ‌డం ఆందోళ‌న‌క‌రం అని అభిప్రాయ‌ప‌డింది. దుర్మార్గాల‌కు పాల్ప‌డిన వారిని కాకుండా శాంతి యుతంగా నిరస‌న తెలుపుతున్న వారిని అరెస్ట్ చేయ‌డాన్ని త‌ప్పుప‌ట్టింది. అయితే ఇప్పుడు క‌ల్యాణ్ సైతం బంగ్లాదేశ్ లో మైనారీల‌పై దాడుల‌ను ఖండించ‌డం హాట్ టాపిక్ గా మారింది. తిరుమ‌ల ఇష్యూ త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు దేశ‌వ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. హిందువుల‌కు ర‌క్ష‌ణ‌గా ఆయ‌న ప‌నిచేస్తున్నార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. ఇప్పుడు ఆయ‌న బంగ్లాదేశ్ లో హిందువుల‌పై దాడుల‌ను ఖండించ‌డంతో మ‌రిన్ని ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×