trinayani serial today Episode: నేత్రి ఇచ్చిన పాలు తాగి గాయత్రి పాప స్పృహ కోల్పోతుంది. గాయత్రిని చూసిన అందరూ షాక్ అవుతారు. త్రినేత్రి పాలు తాగించగానే ఇలా అయిందా ఏంటి? అంటుంది తిలొత్తమ్మ. సుమన కూడా అవును అంటుంది. పాలల్లో చక్కెర కలిపాశా..? మరింకేదైనా కలిపావా..? ఏంటి అంటాడు వల్లభ. పిచ్చా ఏంటి మీకు పిల్లలుకు ఎవరైనా అలా చేస్తారా.? అంటూ కోప్పడుతుంది నేత్రి. లేకపోతే మాకు చేస్తావా? అంటాడు వల్లభ. విశాల్ గాయత్రి పాపను పట్టుకుని పిలుస్తుంటాడు.
అమ్మా గాయత్రి ఒక్కసారి కళ్లు తెరచి చూడమ్మా అంటూ బాధపడుతుంటాడు. నేత్రి పాపను తీసుకోవడానిక వెలితే తిలొత్తమ్మ ఆపి.. మళ్లీ ఏం చేద్దామని దగ్గరకు వెళ్తున్నావు.. నువ్వు పాలు ఇవ్వగానే పిల్లకు అలా అయింది. మళ్లీ తీసుకుని చంపేద్దాం అనుకున్నావా..? అని తిడుతుంది. ఇంతలో విశాల్ పాపను హాస్పిటల్ కు తీసుకెళ్దాం అనగానే తిలొత్తమ్మ అక్కర్లేదని గాయత్రి పాప స్పృహ కోల్పోగానే గాయత్రి అక్క వచ్చింది అని చెప్తుంది. అమ్మ వచ్చిందా..? నయని నీకు అమ్మ కనిపిస్తుందా..? అని అడుగుతాడు. తనకు ఎవ్వరూ కనిపించడం లేదని ఆత్మ కనిపించడం లేదని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. బ్రో నాకేదో తేడాగా ఉందంటే మీరు నమ్మలేదు అంటాడు విక్రాంత్.
తలకు దెబ్బ తగిలింది ఏదో మాట్లాడుతుంది అనుకున్నాం కానీ పెద్దత్తయ్యను చూడలేకపోతుంది అంటే ఈవిడ మా అక్కనే కాదు అంటుంది సుమన. దీంతో వల్లభ నేత్రిని తిడుతుంటే గాయత్రి దేవి వల్లభను కామ్ గా ఉండమను అంటూ తిలొత్తమ్మకు చెప్తుంది. బాధగా విశాల్ అమ్మ నువ్వు కనబడవు.. నీ మాట ఎవ్వరికీ వినబడదు.. కానీ నయనికి నువ్వు కనబడతావు కదా..? నయనికి కనబడటం లేదని చెప్తుంది ఏంటి అమ్మా అని అడుగుతాడు. తిలొత్తమ్మ కూడా నువ్వే చెప్పక్కా.. అని గాయత్రిని అడగ్గానే తను నా కోడలు నయని అంటుంది గాయత్రి. దీంతో తిలొత్తమ్మ షాక్ అవుతుంది. విశాల్ అడిగితే తను నయని కాదంట అని అబద్దం చెప్తుంది తిలొత్తమ్మ.
దీంతో సుమన, వల్లభ నేత్రిని తిడుతుంటే.. నేత్రి కోపంగా సుమనను కొడుతుంది. మీద మీదకు వచ్చి దౌర్జన్యం చేయాలని చూస్తే నేను ఊరుకోను. చిన్నా పెద్దా అని కూడా చూడను. నేను మర్యాద ఇచ్చేంత వరకే ఇస్తాను తేడా వచ్చిందే ఎవర్ని కూడా లెక్క చేయను అంటుంది నేత్రి. దీంతో చూశావా తిలొత్తమ్మ తేడా వస్తే నా కోడలు విశ్వరూపం ఎలా ఉంటుందో.. అంటుంది గాయత్రి దేవి. అయినా సరే నేను నిజం చెప్పను అక్క. నీ మాట ఎలాగూ ఎవరికి వినబడదు. నాకు నయని అని నమ్మకం వచ్చే వరకు నీ మాట నేను ఎలా వినాలి అనుకుంటుంది మనసులో. బ్రో ఏం చేద్దాం అంటాడు విక్రాంత్.
అమ్మనే తను నయని కాదంటే.. అని ఏదో చెప్పబోతుంటే.. గాయత్రి దేవి బాధతో విశాల్ తను నా కోడలు నయనినే.. జరిగింది ప్రమాదమే అయినా.. విశాలాక్షి అమ్మవారి లీల వేరేలా ఉంటుంది అంటుంది. కానీ గాయత్రి దేవి మాలు ఎవరికీ వినిపించవు. ఇంతలో నేత్రి ఏమైంది బాబుగారు నా మీద అనుమానం వచ్చిందా..? అని అడుగుతుంది. దీంతో వల్లభ నువ్వు నయనివి కాదు అని తేలిపోయింది కదా..? అంటాడు. దీంతో ఏయ్ పిచ్చా ఏంటి నీకు నువ్వు నయనిని కాదు అని ఎన్ని సార్లు చెప్పాలి అంటుంది. గాయత్రి దేవి కూడా అయ్యో అమ్మా నువ్వు నయనివే అంటుంది.
ఏయ్ తిలొత్తమ్మ నా కొడుకుకు నిజం చెప్పు అంటుంది. తిలొత్తమ్మ నవ్వుతుంది. పెద్దమ్మ ఏమీ అనడం లేదా..? అమ్మా అంటూ విక్రాంత్ అడగ్గానే తను కూడా షాక్ లో ఉంది విక్రాంత్ అంటుంది తిలొత్తమ్మ. నువ్వు నా కన్నతల్లి ఆత్మను చూడలేకపోతే నువ్వు నా భార్య నయనివి కాదని నేను కూడా ఒప్పు కోవాల్సి వస్తుందని విశాల్ చెప్తాడు. దీంతో నేత్రి ఏడుస్తూ.. పైకి వెళ్లిపోతుంది. గాయత్రి దేవి కోపంగా తిలొత్తమ్మను నిజం చెప్పమని వార్నింగ్ ఇస్తుంది.
విశాల్ దగ్గరకు వల్లభ, తిలొత్తమ్మ వెళ్తారు. పాపను ఒంటిరగా వదిలేసి నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి అని అడుగుతుంది. పాప స్పృహ కోల్పోయింది కానీ ప్రమాదం ఏమీ లేదని చెప్తాడు. తిలొత్తమ్మ వచ్చింది నయని కాదని వేరే ఎవరో అంటుంది. వెంటనే ఆమెను ఇంట్లోంచి పంపించి వేయమని వల్లభ అంటాడు. పాపం నయనిని ఎందుకు విసిగిస్తున్నారు అంటాడు విశాల్. తను నయనినే అయితే గాయత్రి అక్క ఆత్మను ఎందుకు చూడలేకపోయింది అంటంది తిలొత్తమ్మ. చూస్తుంది తప్పకుండా చూస్తుందని విశాల్ అంటాడు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?