E-Paper
Advertisement

NexGen Energia EV : చీప్ గురూ.. రూ. 37,000 కే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌!

NexGen Energia EV : చీప్  గురూ.. రూ. 37,000 కే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌!
Advertisement
NexGen Energia EV
NexGen Energia EV

NexGen Energia EV : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రేజీగా పెరిగింది. ఇప్పటికే కొత్తకొత్త కంపెనీలు ఈవీ మార్కెట్‌లోకి రంగ ప్రవేశం చేశాయి. సరికొత్త ఫీచర్లు, మంచి ఆఫర్డ్‌బుల్ ప్రైజ్‌తో ఈవీ వెహికల్స్‌ను అందిస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది ఈవీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరి ముఖ్యంగా ఈవీ స్కూటర్ల వాడకం సిటీల్లో ఎక్కువగా ఉంది. వీటి మెయింటి‌నెస్ చాలా తక్కువ. పైగా ఎటువంటి పొల్యూషన్ కూడా ఉండదు. ప్రభుత్వాలు కూడా ఈ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో Nexgen Energia అనే సంస్థ అత్యంత సరసమైన ధరలో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లాంచ్ చేసింది. బాలీవుడ్‌ నటుడు సునీల్ శెట్టి ఈ ఈవీని విడుదల చేశారు. దీని ధర రూ. 36,990గా ఉంది. దీని పూర్తి వివరాలు తెలుసుకోండి.

Advertisement

Also Read : ఫోక్స్ వ్యాగాన్ కార్లపై అదిరిపోయే ఆఫర్.. రూ. లక్షల్లో డిస్కౌంట్లు!

నెక్స్‌జెన్ ఎనర్జియా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ నోయిడా కేంద్రంగా పనిచేస్తుంది. కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విజయవంతంగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కేవలం రూ. 36,990 ధరలో విడుదల చేయడంతో ఈ స్కూటర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరకు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేలా ఈ స్కూటర్ లాంచ్ చేసినట్లు కంపెనీ ఛైర్మన్ పీయూష్‌ ద్వివేది తెలిపారు.

Advertisement

అంతేకాకుండా పొల్యూషన్ లేకుండా ప్రతి భారతీయ పౌరుడికి ఎలక్ట్రిక్ వాహనాలు అందించడమే తమ లక్షమని అన్నారు. అలానే ఈ కొత్త స్కూటర్‌ విడుదలతో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 500 కోట్ల లావాదేవీలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 500 మంది డీలర్లు నియమించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

Also Read : పల్సర్ నుంచి మరో కొత్త బైక్.. ఏప్రిల్ 10న లాంచ్ కానున్న N250 మోడల్

దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి లభిస్తోందని పీయూష్‌ ద్వివేది అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల రంగం భారతదేశ భవిష్యత్తుగా రూపుదిద్దుకుంటోందని వెల్లడించారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ సెగ్మెంట్‌ను అభివృద్ధి చేస్తున్నామని.. త్వరలో ఎలక్ట్రిక్ కార్లను కూడా మార్కెట్‌లోకి తీసుకొస్తామని తెలిపారు. ఎలక్ట్రిక్ కార్లు విజయవంతమైతే వాటిని రూ. 5 లక్షల కంటే తక్కువ ధరలో విక్రయిస్తామని ద్వివేది వెల్లడించారు.

Related News

Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్.. కేంద్రం క్లారిటీ, వారే అర్హులు

ఆభరణాలకు పింక్ పేపరే ఎందుకు? దాని వెనుక ఉన్న రహస్యమేంటి?

ఆధార్, ఫోన్ నంబర్‌తో.. మీ UAN నంబర్‌ను క్షణాల్లో కనుక్కోండిలా

ఆషాడ వేళ పసిడి షాక్.. ఆశలకి బ్రేక్ వేస్తూ మళ్ళీ పైపైకి బంగారం ధరలు!

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

Big Stories

Advertisement
×