BigTV English

Huge Discount on Volkswagen Cars: ఫోక్స్ వ్యాగాన్ కార్లపై అదిరిపోయే ఆఫర్.. రూ. లక్షల్లో డిస్కౌంట్లు..!

Huge Discount on Volkswagen Cars: ఫోక్స్ వ్యాగాన్ కార్లపై అదిరిపోయే ఆఫర్.. రూ. లక్షల్లో డిస్కౌంట్లు..!
Discount On Volkswagen
Discount On Volkswagen

Huge Discount on Volkswagen Cars: ప్రస్తుత కాలంలో భారత ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల ఎంట్రీతో కార్లకు మరింత క్రేజ్ పెరిగింది. దీంతో సామాన్య, మధ్యతరగతి వారింట్లో కూడా తప్పని సరిగా బైక్‌ లేదా కారు కచ్చితంగా ఉంటుంది. కొత్తకొత్త కార్ల కంపెనీలు కూడా దేశంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. కొనుగోలు దారులకు ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.


ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగాన్ తన కంపెనీకి చెందిన పలు మోడళ్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఏప్రిల్ 2024 డిస్కౌంట్ క్రింద లక్షల రూపాయల విలువైన తగ్గింపులు అందిస్తుంది. ఈ నెలలో కంపెనీ గరిష్టంగా రూ. 3.40 లక్షల తగ్గింపును ఇస్తోంది. కంపెనీ ప్రస్తుతం భారత మార్కెట్లో మూడు కార్లు, SUVలను విక్రయిస్తోంది. ఇందులో సెడాన్‌గా వర్టస్, ఫ్లాగ్‌షిప్ SUVగా టిగువాన్,  టైగన్ ఉన్నాయి.

Also Read: ఇలా చేస్తే.. కారు మైలేజ్ కచ్చితంగా తెలిసిపోతుంది!


ఫోక్స్ వ్యాగాన్ టిగువాన్

ఏప్రిల్ 2024లో Tiguan SUVపై ఫోక్స్ వ్యాగాన్ అత్యధిక ఆఫర్‌లను అందిస్తోంది. ఈ నెలలో టిగువాన్ కొనుగోలు చేయడం ద్వారా కంపెనీ రూ.3.40 లక్షలు ఆదా చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఫ్లాగ్‌షిప్ SUVపై కంపెనీ రూ. 75,000 నగదు తగ్గింపు, రూ. 75,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 1 లక్ష వరకు కార్పొరేట్ ప్రయోజనాలు ఇస్తుంది. అలానే రూ. 90,000 విలువైన నాలుగు సంవత్సరాల సర్వీస్ ప్యాకేజీని అందిస్తోంది. భారతదేశంలో SUV యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 35.17 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

ఫోక్స్ వ్యాగాన్ టైగన్

టైగన్ ఫోక్స్ వ్యాగాన్ రెండవ SUVగా ఉంది. ఏప్రిల్ 2024లో టైగన్‌లో రూ. 1.50 లక్షల వరకు ఆఫర్‌లు అందిస్తోంది. మీరు ఏప్రిల్‌లో ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేస్తే మీరు రూ. 90 వేల వరకు నగదు తగ్గింపు పొందొచ్చు. అలానే రూ. 40 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 20 వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్.  లాయల్టీ బోనస్‌గా కూడా ఆదా చేసుకోవచ్చు.

Also Read: పల్సర్ నుంచి మరో కొత్త బైక్.. ఏప్రిల్ 10న లాంచ్ కానున్న N250 మోడల్

ఫోక్స్ వ్యాగాన్ వర్టస్

ఫోక్స్ వ్యాగాన్  Virtus భారత మార్కెట్లో కంపెనీ అందించే ఏకైక సెడాన్ కారు. ఏప్రిల్ 2024లో కంపెనీ ఈ సెడాన్‌పై గరిష్టంగా రూ. 80 వేల తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 30 వేలు నగదు తగ్గింపు ఉంటుందిద. రూ. 30 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 20 వేల లాయల్టీ బెనిఫిట్ ఉన్నాయి. Virtus  ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.56 లక్షల నుండి రూ. 19.15 లక్షల వరకు ఉంది.

Related News

iPhone 17 Prices: ఐఫోన్ 17 ధరలు షాక్! భారత్ vs అమెరికా vs జపాన్ – తెలుసుకున్నారా?

BSNL Prepaid Plan: ఏడాది వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్.. తక్కువ ధరకే BSNL క్రేజీ ప్లాన్!

Oppo Reno13 Pro: ప్రపంచంలోనే మొదటి 108ఎంపీ సెల్ఫీ ఫోన్.. ఒప్పో రెనో 13 ప్రో 5జీ ప్రత్యేకతలు

DMart: ఐటీ జాబ్ కంటే డిమార్ట్ లో ఉద్యోగం బెస్ట్, సాలరీతో పాటు ఇన్ని సౌకర్యాలా?

Jio Entertainment: జియో యూజర్ల కోసం ప్రత్యేక ఎంటర్టైన్‌మెంట్.. అదృష్టం పరీక్షించండి!

UPI New Rules: యూపీఐ లావాదేవీలకు షాక్‌! సెప్టెంబర్ 15 నుంచి రూల్స్ మార్చిన ప్రభుత్వం

Big Stories

×