BigTV English

Raghava Lawrence – MG Gloster: సెలబ్రిటీల కళ్లన్నీ ఈ కారు పైనే.. ఇప్పుడు నటుడు లారెన్స్ వంతు.. ఫీచర్లు మైండ్ బ్లోయింగ్!

Raghava Lawrence – MG Gloster: సెలబ్రిటీల కళ్లన్నీ ఈ కారు పైనే.. ఇప్పుడు నటుడు లారెన్స్ వంతు.. ఫీచర్లు మైండ్ బ్లోయింగ్!

Raghava Lawrence Gifted MG Gloster to His Brother: ప్రముఖ నటుడు, డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నాడు. అయితే లారెన్స్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన దాతృత్వాన్ని చాటుకుంటున్నాడు. పేద కుటుంబాలకు, అలాగే పేద పిల్లలకు సహాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అయితే తాజాగా నటుడు రాఘవ లారెన్స్ తన తమ్ముడు ఎల్విన్‌కి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచాడు.


నటుడు లారెన్స్ తమ్ముడు ఎల్విన్ నటిస్తున్న కొత్త సినిమా ‘బుల్లెట్’. ఈ సినిమాతో ఎల్విన్ సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఇనాసి పాండియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ నిర్మాణ దశలో ఉంది. ఇందులో భాగంగానే రాఘవ లారెన్స్ తన తమ్ముడు ఎల్విన్‌కి తాజాగా MG గ్లోస్టర్‌ కారును బహుమతిగా ఇచ్చాడు. MG Gloster భారతదేశంలో రూ.38.80 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. దీనిపై సోషల్ మీడియా ద్వారా లారెన్స్ స్పందిస్తూ.. తన తమ్ముడు నటన పట్ల తాను చాలా గర్వపడుతున్నట్లు తెలిపాడు.

లారెన్స్ తన ట్విట్టర్ పోస్ట్‌లో ‘హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్.. నేను ఈ ప్రత్యేకమైన క్షణాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నేను మా సోదరుడు ఎల్విన్ మొదటి చిత్రం బుల్లెట్ చూశాను. అతని నటనకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నా బహుమతి. నా సోదరుడికి మీ అందరి ఆశీస్సులు కావాలి’ అంటూ రాసుకొచ్చాడు.


Also Read: ఫిదా చేసే లుక్‌, డిజైన్‌తో రెండు కొత్త ఎడిషన్లను లాంచ్ చేసిన ఎంజి.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే

MG Gloster Specifications

MG Gloster ADAS, 4X4 డ్రైవింగ్ టెక్నాలజీతో సహా అనేక అధునాతన ఫీచర్‌లను కలిగి ఉంది. ఇది 3 రోస్ సీటింగ్ అరేంజ్‌మెంట్స్‌తో ఫుల్ సైజ్ SUV అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఇది 6-సీటర్, 7-సీటర్ ఎంపికలలో లభిస్తుంది. ఇకపోతే సినీ సెలబ్రెటీలందరూ ఈ కారుపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సన్నీ లియోన్, సోహైల్ ఖాన్, హేమా మాలిని, షెర్లిన్ చోప్రా, మసాబా గుప్తా, ఓంకార్ కపూర్, సుస్మితా సేన్, పాలక్ తివారీ, షారుఖ్ ఖాన్, రస్లాన్ ముంతాజ్, సతీష్ కౌశిక్ వంటి ప్రముఖులలో MG గ్లోస్టర్ ప్రజాదరణ పొందింది. చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ లగ్జరీ ఎస్‌యూవీని ఉపయోగిస్తున్నారు.

ఈ వాహనం రెండు డీజిల్ మోటార్ ఎంపికలతో అందుబాటులో ఉంది. అవి ఒకటి 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్, మరొకటి 2.0-లీటర్ ట్విన్-టర్బో ఇంజన్. టర్బో మోటార్ 161 hp, 375 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ట్విన్-టర్బో మోటార్ 215 hp, 480 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి. అందువల్ల ఎంజీ గ్లోస్టర్ తన లుక్ అండ్ డిజైన్, సేఫ్టీ టెక్నాలజీతో ప్రముఖ సినీ, రాజకీయ నాయకులలో బాగా ప్రాచూర్యం పొందింది.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×